Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

'Five years away from phone.. that's why 100% score!'. JEE topper who said the secret of success.

 'ఐదేళ్లుగా ఫోన్​కు దూరం.. అందుకే 100% స్కోర్!'. సక్సెస్ సీక్రెట్ చెప్పిన జేఈఈ టాపర్.

'Five years away from phone.. that's why 100% score!'.  JEE topper who said the secret of success.

 జెఈఈ మెయిన్ తొలి విడత ఫలితాల్లో 100 శాతం మార్కులు సాధించి ఔరా అనిపించాడు మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థి. తాను గత ఐదేళ్లుగా జేఈఈ కోచింగ్ సమయంలో ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం మొబైల్​ను వాడలేదని తెలిపాడు. 

మరోవైపు, జేఈఈ ఫలితాల్లో మొత్తం 20 మంది 100 శాతం మార్కులను సాధించారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్​టీఏ) తెలిపింది. ఇందులో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉన్నారు.

జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాల్లో 100 శాతం మార్కులు సాధించి ఔరా అనిపించాడు మహారాష్ట్రకు చెందిన ధ్యానేశ్​ హేమేంద్ర శిందే. తాను జేఈఈ కోచింగ్ సమయంలో ఫోన్​కు దూరంగా ఉన్నానని, అందుకే పరీక్షల్లో విజయం సాధించానని చెప్పాడు ధ్యానేశ్​. మరోవైపు, జేఈఈ ఫలితాల్లో ధ్యానేశ్​తోపాటు మొత్తం 20 మంది 100 శాతం మార్కులను సాధించారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్​టీఏ) తెలిపింది. వీరిలో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉన్నారు.

ఎన్​టీఏ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో ధ్యానేశ్.. 100 శాతం మార్కులు సాధించడంపై అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కేవలం థియరిటికల్ నాలెడ్జ్​తో పరిజ్ఞానంతో జేఈఈ పరీక్షల్లో విజయం సాధించలేమని తెలిపాడు ధ్యానేశ్​. ఎప్పటికప్పుడు సిలబస్​ను రివిజన్​ చేసుకోవాలని.., ప్రాక్టీస్ పరీక్షలు రాస్తూ టైంను సర్దుబాటు చేసుకోవాలని చెప్పాడు. జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఒక మార్కు తగ్గినా ర్యాంకులో వెనకబడిపోతామని అన్నాడు ధ్యానేశ్. అందుకే ఎల్లప్పుడూ వంద శాతం మార్కులను సాధించడానికి ప్రయత్నించాలని సూచించాడు.

"నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు బీటెక్ కంప్యూటర్​ సైన్స్​లో చేరాలని నిశ్చయించుకున్నా. ఐఐటీ బాంబేలో సీటు సాధించాలని అనుకున్నా. నేను రాజస్థాన్​.. కోటాలోని అలెన్ కెరీర్ ఇన్​స్టిట్యూట్​లో జేఈఈ కోచింగ్ తీసుకున్నా. ఆండ్రాయిడ్ ఫోన్, ఇంటర్నెట్ వాడడం వల్ల చదువు పట్ల ఆసక్తి తగ్గుతుందని మొబైల్​ను వాడలేదు. దేశంలోనే కోటాను నాలెడ్జ్ సెంటర్​గా పిలుస్తారు. జీవితంలో ఉన్నత లక్ష్యంతో ఉన్నవారికి కోటాలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నా సందేహాలన్నింటినీ కోచింగ్ ఇన్​స్టిట్యూట్​లో తీర్చుకునేవాడిని. రివిజన్ చేయడం, కష్టపడి చదవడం వల్ల జేఈఈలో 100 శాతం మార్కులు సాధించా."

--ధ్యానేశ్​ హేమేంద్ర శిందే

చిన్నప్పటి నుంచి ధ్యానేశ్​కు స్నేహితులు తక్కువేనని అతడి తల్లి మాధవి తెలిపారు. తమ కుమారుడు బాగా చదివే విద్యార్థులతో స్నేహం చేసేవాడని ఆమె చెప్పారు. డల్​గా ఉన్నప్పుడు ఉపశమనం కోసం సంగీతం వింటాడని మాధవి వెల్లడించారు.

మరోవైపు.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్​టీఏ) సోమవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్ పరీక్ష మొదటి విడత ఫలితాల్లో మొత్తం 20 మంది 100 శాతం మార్కులను సాధించారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన దుగ్గినేని వెంకట యుగేశ్, వావిలాల చిద్విలాస్ రెడ్డి, బిక్కిన అభినవ్ చౌదరి, అభిహిత్ మాజేటి, గుత్తికొండ అభిరామ్​ 100 శాతం మార్కులు సాధించి సత్తా చాటారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "'Five years away from phone.. that's why 100% score!'. JEE topper who said the secret of success."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0