Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for the breadwinners. 3,000 pension every month.

 అన్నదాతలకు గుడ్ న్యూస్. ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్.

Good news for the breadwinners.  3,000 pension every month.

రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కూడా కొన్ని పథకాల్ని తీసుకు వచ్చింది.

ఈ స్కీమ్స్ వలన రైతులకి చక్కటి లాభాలు కలుగుతున్నాయి. రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్స్ లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఒకటి.

ప్రతీ ఏటా రూ.6,000 పెట్టుబటి సాయం రైతులకి ఈ స్కీమ్ కింద వస్తుంది. అలానే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా కేవలం 4 శాతం వార్షిక వడ్డీకే వ్యవసాయ రుణాలు కూడా. అలానే కేంద్రం రైతులకి ప్రతీ నెలా పెన్షన్ ని కూడా ఇస్తోంది. ఇక ఆ వివరాలని చూసేద్దాం.

ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన స్కీమ్

  • ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్ ని మనం ఈ స్కీమ్ కింద పొందొచ్చు.
  • ఈ స్కీమ్ 2019లో ప్రారంభమైంది.
  • రైతులకి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పెన్షన్ స్కీమ్ ని కేంద్రం ప్రారంభించింది.
  • 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సులోపు వున్నా రైతులు దీనిలో చేరచ్చు.
  • ప్రతీ నెల రూ.3,000 పెన్షన్ వస్తుంది. అంటే ఏడాదికి రూ.36,000 పెన్షన్ లభిస్తుంది. రెండు హెక్టార్ల లోపు పొలం ఉన్న రైతులు ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు.

ఎంత కట్టాలి ? ఎంత వస్తుంది?

రైతుల వయస్సును బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సు వున్నప్పుడు ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే… 18 ఏళ్ల వారు రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వారు రూ.110 ప్రీమియం, 40 ఏళ్ల వారు రూ.200 ప్రీమియం చెల్లించాలి.

ఇలా 60 ఏళ్ల దాకా కట్టాలి. 60 ఏళ్లు వయస్సు దాటగానే ప్రతీ నెలా రూ.3,000 చొప్పున పెన్షన్ ని ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామి మిగతా ప్రీమియంలు చెల్లించి పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ పెన్షన్ తీసుకుంటున్న రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి 50 శాతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for the breadwinners. 3,000 pension every month."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0