Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Government Jobs vacancy

 Government Jobs: కేంద్ర ప్రభుత్వ స్కూళ్లు, యూనివర్సిటీల్లో 58,000 పోస్టులు ఖాళీ: పూర్తి వివరాలు.

Government Jobs vacancy

Government Jobs vacancy: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, యూనివర్సిటీల్లో ప్రస్తుతం 58,000కుపైగా టీచింగ్ (Teaching Post), నాన్-టీచింగ్ (Non-Teaching Post) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కేంద్రీయ విద్యాలయాలు (Kendriya Vidyalayas), జవహర్ నవోదయ విద్యాలయాలు (Jawahar Navodaya Vidyalayas), ఐఐటీలు (IITs), ఎన్‍ఐటీ(NITs)లతో పాటు మరిన్ని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోక్‍సభలో ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా ఉద్యోగ ఖాళీల వివరాలను వెల్లడించారు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ (Subhash Sarkar). విద్యాసంస్థల వారీగా ఖాళీల వివరాలు ఇవే.

Job vacancies: పాఠశాలలు, యూనివర్సిటీల్లో ఖాళీల వివరాలు

  • కేంద్రీయ విద్యాలయాల్లో 12,099 టీచింగ్, 1,312 నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • జవహర్ నవోదయ విద్యాలయాల్లో 3,271 టీచింగ్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. రెసిడెన్షియల్ స్కూళ్లలో 1,756 నాన్ టీచింగ్ పోస్టులు వేకెంట్‍గా ఉన్నాయి.
  • ఉన్నత విద్యాసంస్థలైన, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో (Central Universities)ల్లో 6,180 టీచింగ్, 15,780 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.
  • ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs)ల్లో 4,425 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5,052 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి సిద్దం ఉన్నాయి.
  • నేషనల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITs), ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీల్లో 2,089 టీచింగ్, 3,773 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా కొనసాగుతున్నాయి.
  • ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్& రీసెర్చ్ విద్యాసంస్థల్లో 353 టీచింగ్, 625 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‍మెంట్ (IIMs)ల్లో 1,050 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Government Job vacancies: పదవీ విరమణలు, పదోన్నతులు, అదనపు అవసరాల కారణంగా విద్యాసంస్థల్లో ఈ పోస్టుల ఖాళీలు ఏర్పడినట్టు కేంద్రమంత్రి సుభాష్ సర్కార్ చెప్పారు. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.

బోధనకు ఇబ్బంది లేకుండా కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ విద్యాలయాల్లో కొందరు టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించినట్టు తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Government Jobs vacancy"

Post a Comment