Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to Claim Tax Benefits

 How to Claim Tax Benefits: తల్లిదండ్రుల వైద్యంకోసం ఖర్చు చేస్తున్నారా? అయితే మీకు పుష్కలంగా ట్యాక్స్ బెనిఫిట్స్, పేరెంట్స్ ద్వారా ఎన్ని రకాలుగా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

How to Claim Tax Benefits

ప్రతి ఒక్కరూ కుటుంబ నిర్వహణకు పక్కా ప్లానింగ్ తప్పనిసరి. వారి ఆదాయాన్ని బట్టి ప్రతియేటా ఇన్ కం టాక్స్ పే (Income tax) చేయాల్సి ఉంటుంది.

పన్ను భారం (Tax) తగ్గించుకోవడంతోపాటు భవిష్యత్ కుటుంబ అవసరాల కోసం పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి. ప్రతి ఒక్కరికీ పిల్లల అవసరాలతోపాటు పేరెంట్స్ (parents) బాగోగులు కూడా ముఖ్యమే. పిల్లల చదువులతోపాటు పేరెంట్స్ ఆరోగ్యాన్ని చూసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం పెట్టుబడి పథకాలతోపాటు ఇంటి అద్దె, హెల్త్ ఇన్సూరెన్స్ పే మెంట్స్, ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్‌లపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఆదాయం పన్ను చట్టం-1961 ప్రకారం ఈ మినహాయింపులు క్లయిమ్ చేసుకోవచ్చు. అలా క్లయిమ్ చేయడం వల్ల పన్ను భారం తగ్గుతుంది. ఏయే రూపాల్లో పెట్టుబడులు పెడితే ఇన్ కం టాక్స్ భారం తగ్గుతుందో (Claim Tax Benefits) తెలుసుకుందామా..! Income Tax Returns Filing: 

పేరెంట్స్‌కు గిఫ్టులతో ఇలా

తల్లిదండ్రులే కాదు.. పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు గిఫ్ట్‌లు ఇవ్వొచ్చు.. పేరెంట్స్ (parent's gifts) పేరు మీద పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. తల్లిదండ్రులకు బహుమతిగా క్యాష్ ఇస్తే పన్ను వర్తించదు. ఏదైనా ఇన్వెస్ట్ మెంట్ కోసం పేరెంట్స్‌కు క్యాష్ గిఫ్ట్ ఇవ్వొచ్చు. అటువంటి పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయానికి చట్టంలోని రూల్స్ ఆధారంగా పన్ను విధిస్తుంది ఆదాయం పన్నువిభాగం. ఒకవేళ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం తక్కువగా ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటప్పుడు మీరు మీ తల్లిదండ్రుల పేరిట పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేయొచ్చు. 

మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్.

వారి ఆదాయం ఐటీ యాక్ట్ (IT act) పరిధిలోకి రాకుంటే వారి పేరుతో చేసే ఇన్వెస్ట్ మెంట్లపై ఎక్కువగానే పన్ను పొదుపు చేయొచ్చు. ఉదాహరణకు బ్యాంకు లేదా పోస్టాఫీసు డిపాజిట్ మీద సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు వడ్డీ ఆదాయానికి ఆదాయం పన్ను చట్టం-1961లోని 80టీటీబీ సెక్షన్ కింద మినహాయింపు లభిస్తుంది. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ లభిస్తుంది. 

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ లభిస్తుంది. కనుక మీరు మీ పేరెంట్స్ పేరు మీద బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసి పన్ను పొదుపుతోపాటు ఎక్కువ వడ్డీ ఆదాయమూ పొందవచ్చు. 

ఇంటి అద్దెతో ఇలా బెనిఫిట్

పేరెంట్స్‌తో కలిసి వారింట్లోనే ఉన్నా, మీరు ఇంటి అద్దె చెల్లించొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 10 (3ఎ) సెక్షన్ ప్రకారం రాయితీ లిమిట్‌ను బట్టి హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) ద్వారా లబ్ధి పొందొచ్చు. మీ తల్లిదండ్రులకు మీ కంటే తక్కువ ఆదాయం లభిస్తున్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ ఉపకరిస్తుంది. పేరెంట్స్ సీనియర్ సిటిజన్లయినా.. టాక్స్ లిమిట్ దాటక పోతే మీ ఫ్యామిలీ గణనీయంగానే టాక్స్ పొదుపు చేయొచ్చు. ఆ ఇల్లు తప్పనిసరిగా మీ తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరు పేరు మీద ఉండాలి. వారికి చెల్లించే ఇంటి అద్దె కూడా మీ పేరెంట్స్ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేయాలి.. లేదా చెక్ ద్వారా పే చేయాలి. హెచ్ఆర్ఏ క్లయిమ్ దాఖలు చేయడానికి మీరు రెగ్యులర్‌గా హౌస్ రెంట్ పే చేయాలి. పేరెంట్స్ ప్రతియేటా ఫైల్ చేసే ఐటీ రిటర్న్స్‌లోనూ రెంట్ ఇన్ కం చూపాలి. 

హెల్త్ ఇన్సూరెన్స్ పేమెంట్

పేరెంట్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, టాక్స్ డిడక్షన్ క్లయిమ్ చేయవచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 80డీ సెక్షన్ కింద పేరెంట్స్ ఆరోగ్య బీమా ప్రీమియం వారి పిల్లలు పే చేయొచ్చు. గరిష్టంగా రూ.25 వేలు.. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే రూ.50 వేల వరకు పే చేయొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 80డీడీబీ సెక్షన్ ప్రకారం టాక్స్ పేయర్ తన తల్లిదండ్రుల వ్యాధుల వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులపైనా టాక్స్ క్లయిమ్ చేయొచ్చు. సాధారణ తల్లిదండ్రులకు రూ.40 వేలు, సీనియర్ సిటిజన్లయితే రూ.లక్ష వరకు క్లయిమ్ ఫైల్ చేయొచ్చు. ఇంకా, పేరెంట్స్ అంగ వికలాంగులైతే.. అందుకు అయ్యే వైద్య చికిత్స ఖర్చు మీద ఆదాయం పన్ను చట్టంలోని 80డీడీ సెక్షన్ కింద రాయితీ పొందొచ్చు. కనీసం రూ.75 వేల వరకు డిడక్షన్ ఉంటుంది. తీవ్ర అంగ వైకల్యంతో బాధపడుతుంటే రూ.లక్ష వరకు డిడక్షన్ కోసం ఫైల్ చేయొచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to Claim Tax Benefits"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0