Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IAS Officer Success Story

 IAS Officer Success Story : అప్పుచేశా. ఐఏఎస్ కొట్టా.కారణం ఇదే.

IAS Officer Success Story

తొలి  ప్రయత్నంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్స్‌లో విజయం సాధించడమే గొప్ప అనుకుంటే.. అలాంది దేశ వ్యాప్తంగా 10వ ర్యాంకు సాధించాడు ఈ యువకుడు.

ఈ యువ ఐఏఎస్ పేరు సత్యం గాంధీ. ఈ నేపథ్యంలో అపూర్వమైన విజయం సాధించిన యువ ఐఏఎస్ ఆఫీసర్ సత్యం గాంధీ సక్సెస్ స్టోరీ మీకోసం.

సత్యం గాంధీ.. బీహార్‌లోని సమస్తిపూర్‌లో దిఘరా గ్రామానికి చెందిన వారు. తండ్రి అఖిలేష్ కుమార్. తల్లి మంజు కుమారి. ఈమె గృహిణి. అతని తాత సచ్చిదానంద రాయ్ ఒక సాధారణ రైతు. తమ్ముడు శివం గాంధీ. చండీగఢ్‌లో బీపీఎస్ చదువుతున్నాడు.

ఎడ్యుకేషన్

సత్యం గాంధీ.. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయం పూసాలో చదివాడు. 2017లో గ్రాడ్యుయేషన్‌ చేసేందుకు తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు. 2020లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని డాక్టర్ దయాళ్ సింగ్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే వారు.

కొడుకు చదువు కోసం తండ్రి.

సత్యం గాంధీ.. చిన్నప్పటి నుంచి చదువులో బాగా చురుకు. కానీ.. అతనిది మధ్య తరగతి కుటుంబం. ఉన్నత చదువులు చదివించేందుకు అతని తండ్రి వద్ద కనీసం డబ్బులు కూడా ఉండేవి కావు. అయితే.. దాని కోసం కొడుకు భవిష్యత్తును ఆపేయాలని అనుకోలేదు. బ్యాంకులో లోను తీసుకొని మరీ.. కొడుకును చదివించాడు. తండ్రి కష్టాన్ని ఆ కొడుకు కూడా ఊరికే పోనివ్వలేదు. చాలా కష్టపడి చదివాడు. యూపీఎస్సీ సివిల్స్‌లో 10 ర్యాంక్ సాధించి.. తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాడు. మద్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడు.. అతని తండ్రి పడిన కష్టానికి ప్రతి ఫలం దక్కేలా చేశాడు.

సివిల్స్‌లో ప్రిపరేషన్ కోసం.

సత్యం గాంధీ.. గ్రాడ్యుయేషన్ కోసం సొంత ఊరిని విడిచి ఢిల్లీకి వెళ్లాడు. తన లక్ష్యసాధనపై ఎప్పుడు ఒక స్పష్టంమైన అవగాహనతో ఉండే వారు. ఎలాగైన తన లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయంతో ముందుకు సాగారు. కాలేజీ మూడో సంవత్సరం నుంచే.. యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాడు. సిలబస్‌ని అర్థం చేసుకుని, మంచి మెటీరియల్‌ని ఎంచుకుని, ఒక ప్లాన్ ప్రకారం చదవడం ప్రారంభించాడు. చదువుకు ఆటంకం కలగకూడదని పెళ్లి వేడుకలు, అనవసరమైన వాటికి దూరంగా ఉండేవారు. అలాగే స్నేహితుల సర్కిల్‌లతో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండేవాడు.

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రయాణం చాలా

యూపీఎస్సీ (UPSC) ప్రయాణం చాలా శ్రమ, సవాళ్లతో కూడుకున్నదన్నారు. ఊరు వదిలి సిటీకి వెళ్లి చదువుకున్నాడు. నగర సంస్కృతి, గ్రామీణ ప్రాంతాల సంస్కృతికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఆ పరిస్థితులకు అలవాటు పడటానికి తనకు కొంత సమయం పట్టిందన్నారు.

ఆర్థిక పోరాటంలో

తన కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారని సత్యం చెప్పారు. చదువు కోసం నిత్యం బ్యాంకులో రుణం తీసుకునేవారు. అప్పు చేసి చదువుకున్నట్లు. కుటుంబ సభ్యులకు కూడా మంచి ఉన్నత అధికారి కావాలని కలలు కనేవారు. ఆ కల ఇప్పుడు నెరవేరింది. తన జీవితంలో ప్రత్యేకమైన పోరాటం జరగలేదని, అయితే కొంత ఆర్థిక సమస్య ఎదురైందన్నారు. అందుకే నేను కాలేజ్ చదువుతో పాటు సెకండ్ ఇయర్‌లో కూడా కాస్త డబ్బు సంపాదించే పనిలో పడ్డాను.

నా విజయంతో వీరిదే కీలక పాత్ర.

తన విజయంలో తన తండ్రి అఖిలేష్ కుమార్, తల్లి మంజు కుమారి కీలక పాత్ర పోషించారన్నారు. అలాగే నా విజయంలో స్నేహితులు, ఉపాధ్యాయులు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు.

నాకు ఇష్టమైనవి ఇవే

సత్యం గాంధీ ఐఏఎస్ కాకపోతే ఏం జరిగేది..? ఈ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. నేను అనుకున్న లక్ష్యం తీరే వరకు మళ్లి మళ్లీ ప్రయత్నిస్తానన్నారు. సినిమా నిర్మాణం, ఫోటోగ్రఫీ, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. నా సివిల్స్‌ ఇంటర్వ్యూ దాదాపు 20 నిమిషాలపాటు సాగిందన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IAS Officer Success Story"

Post a Comment