Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Let's find out when and what will increase the salaries of government employees.

 7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసుకుందాం.

Let's find out when and what will increase the salaries of government employees.

7th cpc: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ద్వారా ఆదాయపు పన్ను విషయంలో ఉద్యోగులకు కేంద్రం కొంత రిలీఫ్ ఇచ్చింది. అయితే రానున్న హోలీ తర్వాత ప్రభుత్వ సిబ్బందికి మోడీ సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

DA బకాయిల విడుదల కోసం లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 18 నెలలుగా ఎదురు చూస్తున్నారు. అయితే మరో విధంగానూ వారు లబ్ధి పొందనున్నట్లు వెల్లడించింది.

ప్రాథమిక వేతనాల్లో పెరుగుదల

హోలీ అనంతరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనాలు పెరిగే అవకాశం ఉందని మీడియా సంస్థ తన నివేదికలో తెలిపింది. తద్వారా ప్రస్తుతం ఉన్న కనీస వేతనం 18 వేల నుంచి 26 వేలకు పెరుగుతుందని వెల్లడించింది. ఫిట్‌మెంట్ ను 3.68కి పెంచాలని లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. దానిపైనా నిర్ణయం తీసుకోవడానికి సర్కారు సిద్ధమౌతున్నట్లు పేర్కొంది.

హోలీ అనంతరం:

మార్చి 8(హోలీ) అనంతరం 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఫిట్ మెంట్ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదిక చెప్పింది. ఫిట్‌మెంట్ ను 6వ వేతన సంఘం(CPC) 1.86 శాతంగా సిఫార్సు చేసింది. ప్రస్తుతం 7వ CPC నాటికి సాధారణ ఫిట్‌మెంట్ 2.57 శాతంగా ఉంది. అంటే 4,200 గ్రేడ్ పేలో ఉన్న ఉద్యోగికి దాదాపు 40 వేలు వస్తుందన్నమాట. ఫిట్‌మెంట్ పెంపుపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరగ్గా.. 2024లోపు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని నివేదిక పేర్కొంది.

DA, HRA కూడా..

ఈ మార్చిలో డియర్ నెస్ అలవెన్స్‌ (DA)ను కూడా కేంద్రం పెంచే అవకాశం ఉందని గతంలో నివేదికలు వచ్చాయి. అదే జరిగితే జనవరి 1 నుంచి పెరిగిన DAను లెక్కిస్తారు. ఇంటి అద్దె భత్యం(HRA)లో సైతం ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరణలు చేసినట్లు ఇప్పటికే వార్తలు వెలువడటం తెలిసిందే. త్వరలో జాతీయ ఎన్నికలు జరగనుండగా.. మోడీ సర్కారు కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సంతోషపెట్టే పనిలో పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Let's find out when and what will increase the salaries of government employees."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0