Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

LIC ADO Notification

 LIC ADO Notification: ఎల్‌ఐసీలో 9394 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఎంపికైతే నెలకు 90 వేల రూపాయల జీతం! తెలుగు రాష్ట్రాలకు ఎన్నిపోస్టులుంటాయో వివరాలు.


ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన వారితోపాటు ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

లైఫ్ ఇన్‌స్య్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అప్రెంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్(ఏడీఓ) పోస్టుల భర్తీకి జోన్ల వారీగా  నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 9394 ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలో మొత్తం 1408 ఏడీఓ పోస్టులు ఉన్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులతో పాటు ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. 

అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 9394 పోస్టులు

మొత్తం ఖాళీలు: 9394

జోన్ల వారీగా ఖాళీల వివరాలు

  • సెంట్రల్ జోనల్ ఆఫీస్ (భోపాల్): 561
  • ఈస్టర్న్ జోనల్ ఆఫీస్ (కోల్‌కతా): 1049
  • ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (పట్నా): 669
  • నార్తర్న్ జోనల్ ఆఫీస్ (న్యూదిల్లీ): 1216
  • నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్): 1033
  • సదరన్ జోనల్ ఆఫీస్ (చెన్నై): 1516
  • సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్): 1408
  • వెస్టర్న్ జోనల్ ఆఫీస్ (ముంబయి): 1942
  • దక్షిణ మధ్య జోన్‌లో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఖాళీలు: 1408.

డివిజన్ల వారీగా ఖాళీలు:

కడప- 90, హైదరాబాద్- 91, కరీంనగర్- 42, మచిలీపట్నం- 112, నెల్లూరు- 95, రాజమహేంద్రవరం- 69, సికింద్రాబాద్- 94, విశాఖపట్నం- 57, వరంగల్- 62, బెంగళూరు-1- 115, బెంగళూరు-2- 117, బెల్గాం- 66, ధార్వాడ్- 72, మైసూర్- 108, రాయచూర్- 83, షిమోగా- 51, ఉడిపి- 84.

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ముంబయిలోని ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. లైఫ్‌ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ లేదా ఫైనాన్స్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ విభాగంలో కనీసం రెండేళ్లు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి: 01.01.2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్షలు (ప్రిలిమినరీ/ మెయిన్ ఎగ్జామినేషన్), ఇంటర్వ్యూ, ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం.

ప్రిలిమినరీ పరీక్ష:

మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ-35 ప్రశ్నలు-35 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ-35 ప్రశ్నలు-35 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. అయితే ఇంగ్లిష్ పరీక్షను (30 మార్కులు) కేవలం అర్హత పరీక్షగానే పరిగణిస్తారు. అంటే 75 మార్కులకే ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. ఇంగ్లిష్, హిందీలో ప్రశ్నలు అడుగుతారు. 

మెయిన్ పరీక్ష:

మొత్తం 160 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. 160 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ & న్యూమరికల్ ఎబిలిటీ నుంచి-50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి-35 ప్రశ్నలు-35 మార్కులు; ఇన్‌స్స్యూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్‌నెస్ నుంచి-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్, హిందీలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఇక ఎల్‌ఐసీ ఏజెంట్లకు, ఉద్యోగులకు 160 మార్కులకు‌గాను 100 ప్రశ్నలు ఉంటాయి. 

జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ సమయంలో నెలకు రూ.51,500 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. తదనంతరం ప్రొబేషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా నెలకు రూ.35,650-రూ.90,205 వేతనం ఉంటుంది. దీనికి ఇతర భత్యాలు అదనం.

ముఖ్యమైన తేదీలు.

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 21.01.2023.

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 10.02.2023.

అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ ప్రారంభం: 04.03.2023.

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 12.03.2023.

మెయిన్ పరీక్షతేదీ: 08.04.2023.


WEBSITE : https://ibpsonline.ibps.in/licadojan23/

ONLINE APPLICATION

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "LIC ADO Notification"

Post a Comment