Mahashivratri Brahmotsavam in Srisailam.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..శివన్నామస్మరణతో మార్మోగిపోతున్న శైవక్షేత్రం.
Srisailam: కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు,శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి.
శ్రీశైలం(Srisailam)శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి( Mahashivratri) బ్రహ్మోత్సవాల(Brahmotsavam) సంబరాలు అంబరాన్నంటాయి. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నాలుగవరోజు శ్రీ భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి మయూరవాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు.శ్రీశైలం ఆలయ ప్రాంగణం అంతట విద్యుత్ దీపకాంతుల నడుమ స్వామిఅమ్మవార్ల ఉత్సవ ఉత్సవమూర్తులను అంగరంగ ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. స్వామి అమ్మవార్లను మయూర వాహనంపై వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరారు.
ముక్కంటి క్షేత్రంలో శివరాత్రి శోభ.. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్సవ మూర్తుల ముందు కళాకారులు నృత్యాలు ఆటపాటలతో భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ముందుగా స్వామి అమ్మ అమ్మవార్లకు ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చకులు,వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూరవాహనంపై ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు.
అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులు విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా గ్రామోత్సవానికి తరలివెళ్లారు..రాజగోపురం గుండ మయూర వాహనాదీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా భాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు విద్యుత్ దీపాలతో అలంకారం..
ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆట,పాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పూజ కార్యక్రమాలలో ఆలయ ఈవో లవన్న దంపతులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో శ్రీశైలం క్షేత్రంలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో కొన్నిచోట్ల ట్రాఫిక్కుఅంతరాయం ఏర్పడింది. మరి కొన్ని చోట్ల భక్తులు సేద తీరడానికి సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
0 Response to "Mahashivratri Brahmotsavam in Srisailam."
Post a Comment