Upper Berth Rules
Upper Berth Rules: రైలులో అప్పర్ బెర్త్ సెలెక్ట్ చేసేముందు ఈ రూల్స్ తెలుసుకోగలరు.
1. భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల్లో చాలామంది అడ్వాన్స్‌గా తమ జర్నీని ప్లాన్ చేసుకుంటారు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ఆన్‌లైన్ ట్రైన్ టికెట్స్ (Online Train Tickets) బుక్ చేస్తుంటారు. ట్రైన్ టికెట్ బుక్ చేసేప్పుడు బెర్త్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్, సైడ్ లోయర్ బెర్త్, సైడ్ అప్పర్ బెర్త్ అని వేర్వేరు బెర్త్ ఆప్షన్స్ ఉంటాయి.
3. రైల్వే ప్రయాణికులు చాలా ముందుగా ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే తమకు కావాల్సిన బెర్త్ లభించే అవకాశాలు ఎక్కువ. కానీ ప్రయాణ తేదీకి కాస్త ముందుగా బుక్ చేసినట్టైతే ఏ బెర్త్ లభిస్తే ఆ బెర్త్‌లో అడ్జెస్ట్ కావాల్సిందే. అయితే లోయర్ సీట్‌లో ఇద్దరు ఆర్‌ఏసీ టికెట్స్ ఉన్నవారు కూర్చున్నట్టైతే అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు ఎక్కడ కూర్చోవాలి అన్న సందేహం రావడం మామూలే. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే నియమనిబంధనలు ఏం చెబుతున్నాయో News18 పరిశీలించింది.
4. థర్డ్ ఏసీ క్లాస్, స్లీపర్ క్లాస్‌లో ప్రతీ సెక్షన్‌లో ఎనిమిది బెర్తులు ఉంటాయి. వాటిలో 2 లోయర్ బెర్త్, 2 మిడిల్ బెర్త్, 2 అప్పర్ బెర్త్, 1 సైడ్ లోయర్ బెర్త్, 1 సైడ్ అప్పర్ బెర్త్ ఉంటాయి. ఒకవైపు 6 బెర్తులు, మరోవైపు 2 బెర్తులు ఉంటాయి. 6 బెర్తులు ఉన్నవైపు 2 లోయర్ బెర్త్‌లల్లో ఆరుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు.
5. కాబట్టి మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు లోయర్ బెర్త్‌లో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే అవకాశం ఉంటుంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్రపోయే సమయం ఎవరి బెర్త్‌లో వారు నిద్రపోవాలి. అయితే సైడ్ లోయర్ బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులకు ఆర్‌ఏసీ టికెట్స్ ద్వారా కేటాయిస్తే, సైడ్ అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు ఎక్కడ కూర్చోవాలి అన్న డౌట్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ రూల్స్ వర్తిస్తాయి.
6. సైడ్ లోయర్ బెర్త్ ఒకరికే కేటాయిస్తే సదరు ప్రయాణికుడు ఆ బెర్త్‌లో నిద్రపోతారు. పగలు సైడ్ అప్పర్ బెర్త్‌లో ఉన్న ప్రయాణికుడు వచ్చి కూర్చోవచ్చు. ఒకవేళ సైడ్ లోయర్ బెర్త్‌ను ఇద్దరు ఆర్ఏసీ ప్రయాణికులకు కేటాయిస్తే, వారి అనుమతితో సైడ్ అప్పర్ బెర్త్‌లోని ప్రయాణికుడు కింది బెర్త్‌లో కూర్చోవచ్చు. లేకపోతే అప్పర్ బెర్త్‌లోనే అడ్జెస్ట్ కావాలి.
7. ఇక మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్, సైడ్ అప్పర్ బెర్త్‌లోని ప్రయాణికులు రాత్రి సమయంలో లోయర్ బెర్త్ వాడుకోవాలనుకుంటే లోయర్ బెర్త్ బుక్ చేసుకున్న ప్రయాణికుల సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ రూల్స్ వర్తిస్తాయి.
0 Response to "Upper Berth Rules"
Post a Comment