AP Sarkar good news for employees
ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 31 లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.
భేటీ అనంతరం.. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలతో పెండింగ్ సమస్యలపై చర్చించామన్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమని, ఉద్యోగుల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని పేర్కొన్నారు. సుమారు రూ.3 వేల కోట్ల మేర చెల్లింపులు ఈ నెలాఖరులోగా చెల్లిస్తామన్నారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని నిర్ణయించామని సజ్జల వెల్లడించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ఉద్యోగులకు చెందిన పెండింగ్ క్లెయిమ్స్ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తాం. ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 లోపల చెల్లిస్తాం. అందరి ఉద్యోగులకు సంబంధించిన చెల్లింపులు చేస్తాం. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, మెడికల్ ఎరియర్స్ అన్నీ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
0 Response to "AP Sarkar good news for employees"
Post a Comment