Bhagavad Geeta
Bhagavad Geeta: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి సెంట్రల్ సిలబస్‌లో భగవద్గీత.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సెంట్రల్ సిలబస్ లో భగవద్గీతను బోధించనున్నారు.
సెంట్రల్ సిలబస్ లోని ఆరు, ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చుస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఆరు, ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చనున్నారు.
మోడీ ప్రభుత్వం తీసుకుని వస్తున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇక నుంచి భగవద్గీతను బోధించనున్నారు. అంతేకాదు భగవద్గీతలోని శ్లోకాలను పదకొండు, పన్నెండవ తరగతులలో (ఇంటర్మీడియట్) సంస్కృత పుస్తకాలలో పాఠ్యాంశాలుగా చేరచనున్నట్టు కేంద్ర మంత్రి “అన్నపూర్ణాదేవి” పార్లమెంట్ లో తెలియజేశారు.
భగవద్గీత:
మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలు భగవద్గీతగా ప్రసిద్ధి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గీత ఒక ప్రత్యేక గ్రంథంగా విశిష్టతను సొంతం చేసుకుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు మానవాళికి అందించిన జ్ఞానం. భగవద్గీతలో భగవంతుని తత్వం, ఆత్మ తత్వం,, జీవన గమ్యం, గమ్యసాధనా యోగాలు బోధించారు.భగవద్గీత హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. గీతలో వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి.
0 Response to "Bhagavad Geeta"
Post a Comment