CRPF Recruitment 2023: Apply for 9212 Constable Posts Details
సీఆర్పీఎఫ్ 9212 కానిస్టేబుల్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.21,700 - రూ. 69,100.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 9212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్మ్యన్) ఖాళీల నియామకాలు చేపడుతోంది. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై పురుష/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 27న ప్రారంభమై ఏప్రిల్ 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్): 9,212 (పురుషులకు 9105; మహిళలకు 107 ఖాళీలు ఉన్నాయి)
పురుషుల పోస్టులు: డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్మన్, బార్బర్, సఫాయి కర్మచారి.
మహిళా పోస్టులు: బగ్లర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రస్సెర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్.
అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు/ విశ్వవిద్యాలయం నుంచి పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత, హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు కలిగిఉండాలి.
వయోపరిమితి: 01.08.2023 నాటికి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. డ్రైవర్ పోస్టులకు 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.21,700 - రూ. 69,100.
టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: సీబీటీ 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో 100 మార్కులకు ఉంటుంది. హిందీ/ ఇంగ్లిష్ భాష(25 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్(25 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్ నెస్(25 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథ్స్(25 మార్కులు) అంశాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్షకు రెండు గంటల వ్యవధి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో సీబీటీ పరీక్ష కేంద్రాలు: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపుం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 27/03/2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25/04/2023.
సీబీటీ అడ్మిట్ కార్డ్ విడుదల: 20/06/2023 నుంచి 25/06/2023 వరకు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 01/07/2023 నుంచి 13/07/2023 వరకు.
NOTIFICATION
WEBSITE
0 Response to "CRPF Recruitment 2023: Apply for 9212 Constable Posts Details"
Post a Comment