Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do those who have taken the vaccine get a heart attack.. The truth told by the doctor!

వ్యాక్సిన్‌ తీసుకున్న వారికే గుండెపోటు వస్తుందా.. డాక్టర్‌ చెప్పిన నిజాలు!

ఈ మధ్య కాలంలో గుండెపోటుకు గురయ్యేవారిని చూస్తే. 

ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలుగుతుంది. పట్టుమని పదేళ్లు కూడా లేని పసి పిల్లలు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. ఈమధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. అంతసేపు.. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు.. ఆకస్మాత్తుగా కుప్పకూలుతున్న ఘటనలు భయపెడుతున్నాయి. గుండెపోటు మరణాలు పెరగడంతో.. కరోనా వ్యాక్సిన్‌ కారణంగానే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి అనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే కరోనా వ్యాక్సిన్‌, పోస్ట్‌ కరోనా లక్షణాలు, కోవిడ్‌ టైంలో వాడిన స్టెరాయిడ్స్‌ కారణంగానే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయా.. అసలు వైద్యులు ఏమంటున్నారంటే..

ఓ డాక్టర్‌ సుమన్‌టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దీనిపై స్పష్టత ఇచ్చారు. ''యువతలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. వీళ్లల్లో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఉండవు. వయసు పైబడిన వారిలో రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడి.. వారికి నెమ్మదిగా క్లోజ్‌ అయి.. నిదానంగా నొప్పి రావడం జరుగుతుంది. కానీ గుండెపోటుకు గురవుతున్న యువతలో గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాలు సడెన్‌గా బ్లాక్‌ అవ్వడం వల్ల వారు కుప్పకూలుతున్నారు. గుండెపోటుకు గురైన వీరికి మూడు నిమిషాల్లో కనుక షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వగలిగితే కాపాడుకోవచ్చు. అయితే వీరిలో క్లాట్స్‌ ఎందుకు వస్తున్నాయి అంటే ఎన్నో కారణాలున్నాయి. విపరీతంగా ధూమపానం చేయడం, డ్రగ్స్‌ వినియోగం, ఆహార అలవాట్లు ముఖ్యమైనవి. ప్రసుత్తం హైదరాబాద్‌ నగరంలో మత్తు పదార్థల వినియోగం పెరిగింది. దాని వల్ల క్లాట్స్‌ పెరిగి సడెన్‌ హార్ట్‌ ఎటాక్‌లు వస్తున్నాయి'' అని డాక్టర్‌ తెలిపారు.

''అలానే కోవిడ్‌ తర్వాత, వ్యాక్సిన్‌ తీసుకున్న మూడు నెలల్లోపే ఏవైనా సమస్యలు వస్తాయి. కోవిడ్‌ బారిన పడితే ఆరు వారాల వరకే దాని ప్రభావం ఉంటుంది. కోవిడ్‌కున్న మరో ప్రధానమైన లక్షణం ఏంటంటే.. క్లాట్స్‌ ఏర్పడతాయి. గుండె, బ్రెయిన్‌లో క్లాట్స్‌ ఏర్పడి హార్ట్‌ ఎటాక్‌, పెరాలసిస్‌ వంటి సమస్యల తలెత్తుతాయి. మూడు నెలల వరకే ఈ ప్రభావం ఉంటుంది. అయితే కోవిడ్‌ నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత ఎకోస్ప్రిన్‌ ట్యాబ్లెట్‌ తీసుకుంటే ఆ సమస్యను కూడా గుర్తించవచ్చు. చాలా మంది కోవిడ్‌ తర్వాత మూడు నెలలు ఈ టాబ్లెట్స్‌ వాడకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా తగ్గి సుమారు 6 నెలలు అవుతోంది. ఇప్పుడు దాని ప్రభావం వల్ల గుండె పోటు వస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు'' అన్నాడు.

అంతేకాక ''వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల గుండెపోటు వస్తుందా అంటే కాదు. వ్యాక్సిన్‌ ఏదైనా సరే.. ముందు మన శరీరంలో లైట్‌గా ఇన్‌ఫెక్షన్‌ని క్రియేట్‌ చేసి.. దానికి వ్యతిరేకంగా పోరాడి.. మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచుతుంది. వ్యాక్సిన్‌ ప్రధాన విధి ఇదే. కరోనా వ్యాక్సిన్‌ ఏది తీసుకున్నా మైల్డ్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత 6 వారాల వరకే దాని ప్రభావం ఉంటుంది. వ్యాక్సిన్‌ వల్ల ఇలా జరుగుతుంది అనే దానికి లాజికల్‌గా, సైంటిఫికల్‌గా ఎలాంటి నిర్ధారణ లేదు. వ్యాక్సిన్‌ వల్ల ఇలాంటి సమస్యలు రావు. మన దగ్గర వ్యాక్సిన్‌ వేసుకోవడం మానేసి ఆరు నెలలకు పైగానే అవుతోంది. వ్యాక్సిన్‌ వేసుకున్న ఏడాది తర్వాత వచ్చే ఇలాంటి సడెన్‌ మరణాలకు.. టీకానే కారణం అని చెప్పడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు'' అని తెలిపారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do those who have taken the vaccine get a heart attack.. The truth told by the doctor!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0