Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for the people of AP.. The details of 'Family Doctor' are complete from March 15.

 Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త. మార్చి 15 నుంచి పూర్తిస్థాయిలో 'ఫ్యామిలీ డాక్టర్‌' వివరాలివే.

Good news for the people of AP.. The details of 'Family Doctor' are complete from March 15.

రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

మార్చి 15వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మార్చి 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. అదే రోజు ఓ విలేజ్‌ క్లినిక్‌ వద్ద ప్రారంభించాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ పైలట్‌ ప్రాజెక్టులో ఇప్పటి వరకు 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించామని ఈ సందర్భంగా సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సర్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.

అలాగే 1,149 పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియమాకాలను పూర్తి చేశామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. దీర్ఘకాలిక సెలవుల సమయంలో సేవలకు అంతరాయం లేకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు సీహెచ్‌సీల్లో ఉన్న వైద్యులను ఇక్కడ వినియోగించుకుంటామని, దీని కోసం అదనపు నియామకాలకు కూడా చేశామని తెలిపారు.

కాగా, ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కోసం నియమించుకున్నామని అధికారులు తెలిపారు. ఇతర స్వల్పకాలిక సమయాల్లో కూడా వైద్యసేవలకు అంతరాయం లేకుండా ప్రతి 6,7 పీహెచ్‌సీలకూ ఒక డాక్టర్‌ను అదనంగా నియమించుకున్నామని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా 175 మందిని రిజర్వ్‌లో పెట్టుకున్నామన్నారు. 10,032 విలేజ్‌హెల్త్‌ క్లినిక్స్‌లో ప్రతి క్లినిక్‌కూ ఒక ఏఎన్‌ఎం చొప్పున ఉంటారు.

ఇంకా వీరితో పాటు ఒక సీహెచ్‌ఓ, ముగ్గురు లేదా నలుగురు ఆశా కార్యకర్తలు ఉంటారు. విలేజ్‌హెల్త్‌క్లినిక్స్, అలాగే 104లలో ఉంచే మందుల సంఖ్యను కూడా పెంచామని తెలిపిన అధికారులు. సీఎం ఆదేశాల మేరకు అవసరమైన అన్నిరకాలు మందులు ఉండాలన్న లక్ష్యంతో ఇదివరకు ఇస్తున్న 67రకాల మందులను 105కు పెంచామని వెల్లడించారు. అలాగే 14 రకాల డయాగ్నోస్టిక్‌ కిట్లను కూడా విలేజ్‌క్లినిక్స్‌కు అందుబాటులో పెట్టామని తెలిపారు. మందులకు, డయాగ్నోస్టిక్‌.. తదితర వాటి సరఫరాకు అంతరాయం లేకుండా వాటిని స్టాకులో కూడా ఉంచుతున్నామని.. రోగులకు అదించే సేవలను రియల్‌టైంలో నమోదు చేయడానికి టూల్స్‌ను ఏర్పాటు చేశామని.. పీహెచ్‌సీలను, 104 అంబులెన్స్‌లను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్‌కూడా పూర్తిచేశామన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for the people of AP.. The details of 'Family Doctor' are complete from March 15."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0