Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Have you forgotten half days?

హాఫ్‌ డేస్‌ మర్చిపోయారా ?

  • ఒంటిపూట బడులను ప్రకటించని ప్రభుత్వం.
  • విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన

 ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజులుగా పగలంతా ఎండలు మండుతుండగా, సాయంత్రానికి వర్షం కురుస్తోంది. పగలంతా ఎండకు తట్టుకోలేక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. విద్యార్థులకు వడదెబ్బ తగలకుండా హాఫ్‌ డే స్కూల్స్‌ ప్రకటిస్తారు. ఎండలు మండుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో మరమ్మతుల కోసం విద్యుత్‌ సరఫరా గంటల తరబడి నిలిపివేస్తుండడంతో తరగతి గదుల్లో ఫ్యాన్లు తిరక్క విద్యార్థులు అల్లాడిపోతున్నారు. గతేడాది ఫిబ్రవరి లో తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడ మిలీనియం మార్చ్‌ నిర్వహించారు. అప్పటి నుంచి వారిపై అగ్రహంతో ఉన్న ప్రభుత్వం హాఫ్‌ డే స్కూల్స్‌ సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. ఎన్నో విన్నపా లు, విజ్ఞాపనల తర్వాత ఏప్రిల్‌ మొదటి వారంలో హాఫ్‌ డేస్‌ ప్రకటించారు. ఈ ఏడాది ఈ విధంగా చేస్తారేమోనని ఇటు టీచర్లు అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా రు. ఇప్పటికే వైరల్‌ ఫీవర్స్‌ పెరగడంతో అనారోగ్యంతో ఉం టే పాఠశాలలకు రావద్దని ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో మార్చి 15 నుంచి హాఫ్‌ డే స్కూల్స్‌ ప్రకటించింది. మన ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణితో మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. దీనివల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

సెలవులు ఇవ్వాలని డిమాండ్‌

‘ఉదయం పది గంటల నుంచే ఎండ మండుతోంది. విద్యార్థులు ఉక్కపోత తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఉడుకు జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. పిల్లలు, ఉపాధ్యాయుల ఆరోగ్యం దృష్ట్యా ఒంటి పూట బడులు ప్రకటించాలి’ అని డెమోక్రటిక్‌ పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు అధికారులను కోరుతున్నారు. ‘తెలంగాణలో మార్చి 15 నుంచే హఫ్‌డేస్‌ ఇచ్చారు. ఉక్కపోతతో పిల్లలకు మీజిల్స్‌, గవద బిళ్లలు వచ్చే అవకాశం ఉంది. టీచర్లు అస్వస్థతకు గురవుతున్నారు. ఒంటి పూట బడులు ప్రకటించాలి’ అని ఏపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి షేక్‌ రంగావలి డిమాండ్‌ చేశారు. ‘మార్చి ప్రారంభం నుంచే ఎండ వేడిమి పెరిగింది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఆరోగ్యమే మాకు ముఖ్యం. ప్రభుత్వం హాఫ్‌ డేస్‌ ప్రకటించాలి’ ఓ విద్యార్థి తండ్రి కె.దుర్గానరసింహారావు కోరుతున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Have you forgotten half days?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0