Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagananna Vidya Deevena

విద్యార్థులకు శుభవార్త.రేపే ఖాతాల్లోకి ఆ సొమ్ము.

Jagananna Vidya Deevena

విద్యార్ధులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి సొమ్మును రేపు అనగా ఈ నెల 19న విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు సీఎం జగన్‌.. ఈ రోజే విద్యా దీవెన నిధులు విడుదల చేయాల్సి ఉన్నా.. సీఎం సభా వేదికకు పక్కనే వున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతోన్న నేపథ్యంలో.. 19వ తేదీకి వాయిదా వేశారు.. ఇక, సీఎం పర్యటనపై అసెంబ్లీ మీడియా పాయింట్‌ మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.. రేపు తిరువూరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది.. జగనన్న విద్యాదీవెన నాల్గో విడత కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలిపారు.

గతంలో పేదలకు చదువు భారంగా మారింది.. ప్రభుత్వ విద్యను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశాడు.. ప్రైవేట్ విద్యాసంస్థల బలోపేతం చేసే దిశగా పనిచేశాడు.. కానీ, వైఎస్‌ జగన్ సీఎం అయిన తర్వాత చదువుల్లో విప్లవం తెచ్చారు అని తెలిపారు వెల్లంపల్లి.. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు . కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు.. చంద్రబాబు కేవలం 16 లక్షలు మందికి ఫీజులరీయింబర్స్ మెంట్ ఇచ్చారు.. వైఎస్ జగన్ ఈ మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన చేరువ చేశారని తెలిపారు. రేపు 11 లక్షల మందికి 700 కోట్ల రూపాయలు అందించనున్నారని వెల్లడించారు.. చదువు ద్వారానే అన్నీ సాధ్యమని నమ్మిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.. అందుకే విద్యకు పెద్దపీట వేశారని తెలిపారు వెల్లంపల్లి శ్రీనివాస్‌.

ఇక, విద్యాదీవెన కార్యక్రమం రేపు తిరువూరులో సీఎం ప్రారంభిస్తారు.. పేదలు సైతం కార్పొరేట్ స్కూల్స్ లో చదవాలనేది సీఎం ఆలోచన.. ఇంగ్లీష్ మీడియానికి ప్రాధాన్యత ఇచ్చారు అని తెలిపారు ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను.. మాజీ సీఎం చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నా న్యాయం మా వైపు ఉందన్న ఆయన.. 700 కోట్లు రేపు నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వేయనున్నారు అని వెల్లడించారు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి తరహాలో ఎవరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు.. ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్ ను చూసి ఆశ్చర్యపోతున్నాయి.. ఏపీ తరహాలో తమ రాష్ట్రాల్లోని స్కూల్స్ ను తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్నాయి అని తెలిపారు ఉదయభాను.. మరోవైపు.. 2841 కోట్లు బడ్జెట్ లో విద్యకు కేటాయించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దే అని ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. అక్షర క్రమంలోనే కాదు విద్యలోనూ ఏపీ టాప్ లో ఉండాలనేది సీఎం ఆలోచన.. అందుకే విద్య పై స్పెషల్ ఫోకస్ పెట్టారు .. ఈ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ అంటే వైఎస్సార్ గుర్తుకొస్తారు.. తండ్రిబాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారు.. మూడేళ్లలో విద్యమీద 53 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేశారని తెలిపారు మల్లాది విష్ణు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jagananna Vidya Deevena"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0