Let's find out the auspicious results of lighting a lamp on betel leaves.
తమలపాకుల పై దీపాన్ని వెలిగించడం ద్వారా ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
సాధారణంగా మనం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము అయితే మనం వెలిగించే దీపానికి కింద ఎలాంటి ఆధారం లేకుండా దీపారాధన చేయటం వల్ల ఆ పూజ వ్యర్థమేనని పండితులు చెబుతున్నారు అందుకోసమే మనం దీపం వెలిగించే సమయంలో ఆ దీపానికి ఆధారంగా కనీసం ఒక ఆకునైన పెట్టి పూజించాలని పండితులు చెబుతుంటారు అయితే ఇలా దీపారాధన చేసే సమయంలో తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.మరి తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా కలిగే ఫలితాలు ఏంటి అనే విషయానికి వస్తే
తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.తమలపాకులలో లక్ష్మీదేవి సరస్వతి పార్వతి దేవి కొలవై ఉంటారని పండితులు చెబుతున్నారు. తమలపాకు కాడలో పార్వతి దేవి కొలవై ఉంటారని కొన భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అలాగే తమలపాకు మధ్య భాగంలో సరస్వతి దేవి కొలబై ఉంటుందని విశ్వసిస్తారు. అందుకే తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఈ ముగ్గురి అమ్మల ఆశీర్వాదం మనపై ఉంటుంది.
ఇక తమలపాకులను తీసుకునేటప్పుడు తమలపాకు కొన చివరలు తునిగిపోయి ఉండకూడదు ఇలాంటి ఆకులు పూజకు అనర్హం.కాడలతో సహా ఆరు తమలపాకులను కత్తిరించుకొని వాటిని నెమలి పించం ఆకారంలో తయారు చేసి ఆకు కొనభాగాన నువ్వుల నూనెలో అది దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల పిల్లలలో విద్యాబుద్ధులు కలుగుతాయి అలాగే ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని పండితులు చెబుతున్నారు అందుకే తమలపాకులో దీపం ఎన్నో శుభ పరిణామాలకు శుభసూచికమని పండితులు తెలియజేస్తున్నారు.
0 Response to "Let's find out the auspicious results of lighting a lamp on betel leaves."
Post a Comment