Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

One-day classes from 3rd of this month

ఈనెల 3 నుంచి ఒంటిపూట బడులు

One-day classes from 3rd of this month

ఉపాధ్యాయ సంఘాలతోమంత్రి బొత్స

రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 3వ తేదీ. నుంచి ఒంటిపూట బడులు ప్రారంభిస్తామని ఉపాధ్యాయ సంఘాలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. మంత్రి బొత్సను యుటిఎఫ్, ఎన్టియు, ఎపిటిఎఫ్-1938, ఎపిటిఎఫ్-257 సంఘాల నాయకులు శుక్రవారం కలిసి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డారని కొంతమంది ఉపాధ్యాయులను తహశీల్దారు కార్యాలయాల్లో హాజరుకావాలని ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని మంత్రిని నాయకులు కోరారు. దీనికి మంత్రి అంగీకరించారు. పదో తరగతి పరీక్షలు జరిగే 3,349 పాఠశాలను పరీక్ష సమయంలో పూర్తి సెలవు దినంగా ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. ఆ ఐదు రోజులను తరువాత వచ్చే సెలవు దినాల్లో నిర్వహించాలని తెలిపారు. మున్సిపల్ డ్రాఫ్ట్ పై సూచనలు చేయడానికి ఈ నెల 3 వరకు గడువు ఇచ్చామని చెప్పారు. ఈ నెల 30తో ఈ విద్యాసంవత్సరం ముగుస్తుందని తెలిపారు. పాఠశాలలు పున: ప్రారంభ తేదీని తరువాత ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి, యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్, ఎపిటిఎఫ్- 1938 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి, ఎన్టియు అధ్యక్షులు సాయి శ్రీనివాస్, ఎపిటిఎఫ్-257 అధ్యక్షులు సిహెచ్ మంజుల పాల్గొన్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "One-day classes from 3rd of this month"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0