Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Reduce the pressure on teachers

టీచర్లపై ఒత్తిడి తగ్గించండి

Reduce the pressure on teachers

  • పొద్దున్న కాకుండా ఇంటర్వెల్లో రాగిజావ పంపిణీ చేయండి
  • వేసవి సెలవుల్లో బదిలీలు, పదోన్నతులు కల్పించండి
  • ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లకు మంత్రి బొత్స సానుకూల స్పందన

ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించే చర్యలు చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలతో స్పష్టం చేశారు. ఉపాధ్యా యులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించడానికి సోమవారం టీచర్ల సంఘాలతో ఆయన సమగ్రశిక్ష కార్యాలయంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పెండింగ్ ఉన్నటు వంటి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వేసవి సెలవులలో నిర్వహిస్తామని, రేపటి నుంచి పంపిణీ చేయనున్న రాగి జావా విషయం లో ఉదయము ఎనిమిదిన్నర గంటలకు కాకుండా ఇంటర్వెల్ సమయంలో అనగా ఉదయం 10:40కి పంపిణీ చేయడానికి మంత్రి సానుకూలంగా స్పందించారని. ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.

ఉపాధ్యాయుల బోధనేతర యాపు ల విషయంలో కేవలం ఉపాధ్యాయుల, విద్యార్ధుల, హాజరుకు సంబంధించిన యాష్లే కాక మిగిలిన అన్ని యాపులకు ఇతర సిబ్బందిని కేటాయించడానికి మంత్రి బొత్స ఆమోదించినట్లు చెప్పాయి. ఎంఈఓ2 పదోన్నతుల విషయంలో పెండింగ్ ఉన్నటువంటి కోర్టు కేసులు పరిష్కారం కాగానే చేపడుతారు దానితోపాటే ఎంఈఓ ల బదిలీలు కూడా నిర్వహిస్తామని, రంజాన్ మాసం పురస్కరించుకొని మైనారిటీ విద్యాసంస్థలకు హాఫ్ డే స్కూల్స్ గంట పర్మిషన్ మంగళవారం సాయంత్రంలోగా ఉత్తర్వులు ఇస్తామని మంత్రి బొత్స సమావేశంలో చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి మండలంలో రెండు ఉన్నత పాఠశాలలో ప్లస్ 2 విధానము అమలు చేస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు అన్ని వేసవి సెలవుల్లో పదోన్నతులు కల్పిస్తామన్నారు. పాఠశాలల విజిట్ పేరుతో అధికారులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయకుండానియంత్రణ చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయ సంఘ నాయకులకు అక్రమంగా ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులను ఉపసంహరించడానికి పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు నాణ్యమైన బ్యాగు,బూట్లు, జెవికె కిట్లు సకాలంలో అందించే ఏర్పాటు చేస్తామని, అన్ని వస్తువులను పాఠశాల స్థాయికి చేరవేసే పని అధికారులు చేస్తారని చెప్పారు. మున్సిపల్ ఉపాధ్యా యులకు సర్వీసులు విషయంలో డ్రాఫ్ట్ రూల్స్ ను ఉపాధ్యాయ సంఘాలకు ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచి అందరి సలహాలు సూచనలు స్వీకరించిన తర్వాత ఫైనల్ గా సర్వీస్ నిబంధనలు ఆమోదిస్తారు. ఉపాధ్యాయులకు పెండింగ్ ఉన్నటువంటి భవిష్య నిధి జీవిత భీమా బకాయిలు గత డిసెంబర్ వరకు చెల్లింపులు చేశామని, అదేవిధంగా సంపాదిత సెలవు నగదీకరణ బిల్లులు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు చెల్లించే ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. కాగా గతంలో కంటే చాలా సానుకూలంగా స్పందించారని, అయితే ఇచ్చిన హామీలన్ని ఆచరణలోకి రాకుంటే మరో 15 రోజుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఎ.పి.ఉపాధ్యాయ సంఘం తెలిపాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Reduce the pressure on teachers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0