RJD Pratap Reddy is not allowed to leave the headquarters
ఆర్‌జేడీ ప్రతాప్‌రెడ్డి హెడ్‌క్వార్టర్ విడిచి వెళ్లడానికి వీల్లేదు
- ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ ఉండాలి
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ఆదేశం
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ కడప ఇన్‌ఛార్జి, ఆర్‌జేడీ బి.ప్రతాప్‌రెడ్డి హెడ్‌క్వార్టర్స్‌ను విడిచిపెట్టి వెళ్లడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశించింది. సెలవుపై, అధికారిక పర్యటన నిమిత్తం కూడా వెళ్లరాదని స్పష్టం చేసింది. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి పొంది వెళ్లాలని తెలిపింది. ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొననని ఆయన హామీ ఇవ్వాలని పేర్కొంది. ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని ప్రతాప్‌రెడ్డికి మెమో జారీ చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా గురువారం ఆదేశాలిచ్చారు. ప్రతాప్‌రెడ్డి భార్య కల్పలతారెడ్డి ఎమ్మెల్సీగా ఉంటూ వైకాపాకు మద్దతిస్తున్నారని, ప్రతాప్‌రెడ్డి అధికారిక పర్యటనల పేరిట వైకాపా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.®️👆
0 Response to "RJD Pratap Reddy is not allowed to leave the headquarters"
Post a Comment