Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Rs.3 thousand per month for farmers: Central government's new scheme.

రైతులకు నెలకు రూ.3వేలు: కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.

Rs.3 thousand per month for farmers: Central government's new scheme.

రైతులకు ఆసరా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టింది. వారికి రుణాలివ్వడం కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను ఇస్తున్నారు.

పెట్టుబడి సాయం కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే వృద్ధాప్యంలో ఉన్న సన్న, చిన్నకారు రైతులకు తోడుగా నిలవాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న మరో పథకం పేరే కిసాన్ మాన్ ధన్ యోజన. 60 సంవత్సరాలు నిండిన రైతులు దీనిద్వారా నెలకు రూ.3వేల చొప్పున పింఛను పొందొచ్చు. ఈ పథకం అర్హత ఏమిటి? నమోదు వివరాలు తెలుసుకుందాం.

అర్హత

దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల సంబంధిత భూ రికార్డుల్లో పేర్లు ఉండాలి. అందులో 2 హెక్టార్ల వరకు సాగు భూమి కలిగి ఉండాలి. 18-40 మధ్య వయసున్నవారై, వారి వయసు 60 దాటాక ఈ పథకం కింద నెలకు కనీస పింఛను రూ.3 వేలు అందుతుంది. ఒక వేళ అర్హత కలిగిన రైతు మరణిస్తే అతడి జీవిత భాగస్వామికి 50 శాతం పింఛను వస్తుంది. కేవలం జీవిత భాగస్వామికి మాత్రమే ఇలా పింఛను లభించే వెసులుబాటు ఉంటుంది. మరణించిన వ్యక్తి పిల్లలకు వర్తించదు.

ఎంత కట్టాలంటే?

అర్హుడైన రైతు తనకు 60 ఏళ్లు వచ్చేంత వరకు నెలకు రూ.55 నుంచి రూ.220 వరకు చెల్లించాలి. అర్హత కలిగిన వ్యక్తికి 60 సంవత్సరాలు నిండగానే పింఛను కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ప్రతి నెలా రైతు బ్యాంక్‌ ఖాతాలో ప్రభుత్వం ఆ పింఛను అందజేస్తుంది.

కావాల్సినవేవంటే.

ఈ పథకంలో చేరడానికి దరఖాస్తుదారుడు పేరు, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ, జీవిత భాగస్వామి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన రైతులు తమ ప్రాంతంలో ఉన్న కామన్‌ సర్వీస్‌ సెంటర్‌/ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న రైతులు 60 సంవత్సరాలు వచ్చే వరకు నెలవారీ చందాగా రూ.55 నుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పింఛన్‌ అందుతుంది.

వీరు అనర్హులు

ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌వో, నేషనల్‌ పెన్షన్‌ స్కీం (NPS) పథకం తో పాటు ఏ ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథకాల నుంచి లబ్ది పొందుతున్నవారు.. జాతీయ పింఛను పథకాన్ని ఎంచుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, రైతులకు ఈ పథకానికి అనర్హులు.




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Rs.3 thousand per month for farmers: Central government's new scheme."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0