Details of 10 free services SBI customers can avail over the phone.
SBI Quick: ఎస్‌బీఐ కస్టమర్‌లు ఫోన్‌లో ఉచితంగా పొందగలిగే 10 సేవలు వాటి వివరాలు.
టెక్నాలజీ అభివృద్ధితో చాలా రంగాల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
6 నెలల ఎస్‌బీఐ ఇ-స్టేట్‌మెంట్ : మెసేజ్ ద్వారా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ 6 నెలల ఇ-స్టేట్‌మెంట్ పాస్‌వర్డ్ ఎన్‌క్రిప్టెడ్ PDF ఫైల్ రిజిస్టర్డ్ ఇమెయిల్ IDకి వస్తుంది. ఇందుకు 917208933145 నంబర్‌కు 'ESTMT <అకౌంట్ నంబర్> అని మెసేజ్ పంపాలి.
ఎస్‌బీఐ బ్యాలెన్స్ ఎంక్వైరీ : అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవడానికి కస్టమర్లు 919223766666 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు లేదా ఇదే నంబర్‌కు 'BAL' అని SMS పంపవచ్చు.
ఎస్‌బీఐ చెక్ బుక్ రిక్వెస్ట్ అక్నాలడ్జ్‌మెంట్ : ఈ సేవలు పొందేందుకు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుంచి 917208933145 నంబర్‌కు "CHQREQ" అని మెసేజ్ పంపాలి.
ఎస్‌బీఐ చెక్ బుక్ రిక్వెస్ట్ : చెక్ బుక్ కోసం 917208933145 నంబర్‌కు "CHQREQ" అని టైప్ చేసి SMS సెండ్ చేయాలి.
ఎస్‌బీఐ ఎన్రోల్ పాజిటివ్ పే సిస్టమ్ (PPS) ఎన్రోల్ పాజిటివ్ పే సిస్టమ్ (PPS)ని ఉపయోగించే ముందు ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మొబైల్ సేవలను పొందవచ్చు.
ఎస్‌బీఐ సర్వీసెస్ లిస్ట్ : మెసేజ్ ద్వారా ఎస్‌బీఐ అందిస్తున్న సర్వీసెస్ లిస్ట్‌ను అందుకోవచ్చు. 917208933145 నంబర్‌కి HELP అని మెసేజ్ పంపాలి.
లాంగ్వేజ్ ఛేంజ్(హిందీ/ఇంగ్లీష్) : లాంగ్వేజ్ ఛేంజ్ చేయడానికి (హిందీ/ఇంగ్లీష్).. అవసరమైన లాంగ్వేజ్ పేరు టైప్ చేసి 917208933148కి మెసేజ్ పంపాలి.
ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ : ఫోన్ మెసేజ్ ద్వారా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్‌ని చెక్ చేయవచ్చు. 917208933145 నంబర్‌కు ELI <అకౌంట్ నంబర్> అని మెసేజ్ చేయాలి.
హోమ్ లోన్ ఇంట్రస్ట్ సర్టిఫికేట్ : ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హోమ్ లోన్ ఇంట్రస్ట్ సర్టిఫికేట్‌ను కూడా చెక్ చేయవచ్చు. ఇందుకు 917208933145 నంబర్‌కు HLI <అకౌంట్ నంబర్> అని SMS సెండ్ చేయాలి.
ఎస్‌బీఐ క్విక్ సర్వీస్ కోసం యూజర్లు సైన్ అప్ చేయాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. ఈ సేవలకు కచ్చితంగా అకౌంట్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్‌నే వినియోగించాలి. ఆండ్రాయిడ్, విండోస్, iOS లేదా బ్లాక్‌బెర్రీ ఫోన్‌ని కలిగి ఉంటే సంబంధిత యాప్ స్టోర్ నుంచి ఎస్‌బీఐ క్విక్ యాప్‌ను పొందవచ్చు. ఎస్‌బీఐ క్విక్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఉపయోగించవచ్చు.
0 Response to "Details of 10 free services SBI customers can avail over the phone."
Post a Comment