Whatsapp: వాట్సప్‌లో వాయిస్ స్టేటస్ ఫీచర్ వచ్చింది గమనించారా.? ఎలా ఉపయోగించుకోవాలో వివరణ.
యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయంచేస్తూ వస్తోంది వాట్సప్. పెరుగుతోన్న పోటీని సైతం తట్టుకొని వాట్సప్ తన ఆధిపత్యాన్ని చాటుతుండడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు.
ఇప్పటికే పలు ఆసక్తికరమైన ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాయిస్ స్టేటస్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు వాయిస్ స్టేటస్‌ను షేర్ చేసుకోవచ్చు. దీంతో వాయిస్‌ను స్టేటస్‌గా సెట్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ స్టేటస్‌ను ఎలా ఉపయోగించుకోవాలి..? వాయిస్‌ను మెసేజ్‌ను స్టేటస్‌గా ఎలా సెట్ చేసుకోవచ్చు లాంటి వివరాలు మీకోసం.
సెట్ చేసే విధానం
- మొదటగా మీ స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి.
- అనంతరం స్టేటస్ విభాగంలోకి స్లైడ్ చేయాలి.
- తర్వాత కుడిపైపు కనిపించే పెన్సిల్ సింబల్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే మైక్ సింబల్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి మాటలు రికార్డ్ చేయొచ్చు.
- వెంటనే మైక్ సింబల్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి మాటలు రికార్డ్ చేయొచ్చు.
- నొక్కి పట్టుకొని 30 సెకండ్ల వరకు ఆడియోను రికార్డ్ చేసుకోవచ్చు.
- అనంతరం రికార్డ్ అయిన వాయిస్‌ను సెండ్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. వెంటనే మీ స్టేటస్‌గా ఆడియో క్లిప్ చూపిస్తుంది.
0 Response to "Whatsapp"
Post a Comment