Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

house Buying: Buying a house in Hyderabad, Vizag, Tirupati? 8 documents that must be seen and their details.

House Buying: హైదరాబాద్, వైజాగ్, తిరుపతిలో ఇల్లు కొంటున్నారా? కచ్చితంగా చూడాల్సిన 8 డాక్యుమెంట్లు వాటి వివరాలు.

house Buying: Buying a house in Hyderabad, Vizag, Tirupati? 8 documents that must be seen and their details.

కొత్తగా ఇల్లు కొంటున్నారా?

లేదంటే ప్రాపర్టీ, ఫ్లాట్ వంటివి కొనేందుకు సిద్ధం అవుతున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రాపర్టీ లేదా ఇల్లు వంటివి కొనేటప్పుడు అన్ని

వివరాలను కరెక్ట్‌గా చెక్ చేసుకోవాలి. డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయా? లేదా చూడాలి. తర్వాతనే ముందుకు వెళ్లాలి. ఇల్లు లేదా ప్రాపర్టీ కొనేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్లను పరిశీలించాలో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఇల్లు లేదా ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ముందు కొనుగోలుదారులు పొందాల్సిన మొదటి డాక్యుమెంటు అమ్మకపు ఒప్పందం. ఈ డాక్యుమెంటులో విక్రయిస్తున్న ప్రాపర్టీ గురించి మొత్తం సమాచారం ఉంటుంది. ఇది కొనుగోలుదారు, విక్రేత ఏం అంగీకరించారు? ప్రాపర్టీని ఎంతకు అమ్మేస్తున్నారు? వంటి వాటిని తెలియజేస్తుంది.

సేల్ డీడ్ లేదా టైటిల్ డీడ్ అనేది మీకు కావలసిన ముఖ్యమైన డాక్యుమెంటు. ఆ ప్రాపర్టీ మీకు చెందినదని ఈ డాక్యుమెంటు మాత్రమే తెలియజేస్తుంది. మీరు సేల్ డీడ్‌ను అఫీషియల్ చేయడానికి ప్రభుత్వ కార్యాలయమైన సబ్-రిజిస్ట్రార్‌కి వెళ్లి అక్కడ దాన్ని రిజిస్టర్ చేయించాలి. అప్పుడు అది టైటిల్ డీడ్ అవుతుంది. దాంతో ఆ ప్రాపర్టీ ఓనర్‌షిప్ మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

అలాగే ఛానల్ డాక్యుమెంట్ కూడా చూడాలి. ఏ అనే వ్యక్తి బీకి, బీ అనే వ్యక్తి సీకి ప్రాపర్టీ అమ్మితే.. అప్పుడు అందరి వివరాలు ఛానల్ డాక్యుమెంట్‌లో ఉంటుంది. దీని వల్ల అసలు ప్రాపర్టీ ఎవరితో తెలుస్తుంది.

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటుంది. బిల్డర్ నుంచి ఈ డాక్యుమెంట్ కచ్చితంగా తీసుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని జారీ చేస్తుంది. బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉందంటూ ఈ సర్టిఫికెట్ తెలియజేస్తుంది. ఆక్యుపెన్నీ సర్టిఫికెట్ వచ్చిందంటే.. మీరు ఇంట్లోకి చేరడానికి రెడీగా ఉన్నారని అర్థం. ఎప్పుడైనా చేరొచ్చు.

పొసెషన్ లెటర్ కూడా ఉంటుంది. ఇది కొనుగోలుదారుడి పేరుపై ఉండాలి. ఇందులో ప్రాపర్టీని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారో ఉంటుంది. మీరు హోమ్ లోన్ పొందాలని భావిస్తే.. ఈ లెటర్ కచ్చితంగా కావాలి.

ఇంకా మోర్ట్‌గేజ్ లోన్ ఉందేమో చూడాలి. ఎందుకంటే చాలా మంది ప్రాపర్టీ ద్వారా లోన్ పొందుతూ ఉంటారు. అందుకే ఈ విషయాన్ని మీరు కూడా చెక్ చేసుకోవాలి.

ట్యాక్స్ పేమెంట్ చూడాలి. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లోకల్ మున్సిపాలిటీ ఆఫీస్‌కు వెళ్లి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలి.

ఖాతా సర్టిఫికేట్ అనేది ఇల్లు ఏ మున్సిపాలిటీలో ఉందో.. అక్కడి రికార్డులలో జాబితాలో నమోదైందో లేదో చూపించే ఒక డాక్యుమెంటు. దీనిని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.

మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాపర్టీ/ఇంటిపై ఎలాంటి రుణాలు లేవు అని చెప్పే డాక్యుమెంటు 'నో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్'. ఇంటిని తాకట్టుగా ఉపయోగించి బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ డాక్యుమెంటు తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆస్తిపై జరిగిన అన్ని లావాదేవీల గురించి ఈ సర్టిఫికెట్‌లో సమాచారం ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "house Buying: Buying a house in Hyderabad, Vizag, Tirupati? 8 documents that must be seen and their details."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0