PM Kisan Scheme
PM Kisan Scheme: రైతులకు అలర్ట్... ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోని (PM Kisan Scheme) రైతులకు అలర్ట్.
పీఎం కిసాన్ స్కీమ్ నిబంధనలు కఠినతరం అవుతున్నాయి. అన్నీ పక్కాగా ఉంటేనే డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 27న రైతులకు పీఎం కిసాన్ 13వ ఇన్‌స్టాల్‌మెంట్ (PM Kisan 13th Installment) విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2022 డిసెంబర్-2023 మార్చి విడతకు సంబంధించిన డబ్బులు ఇవి. త్వరలోనే పీఎం కిసాన్ 14వ ఇన్‌స్టాల్‌మెంట్ (PM Kisan 14th Installment) డబ్బులు జమ కానున్నాయి. ఇది 2023 ఏప్రిల్-జూలైకి సంబంధించిన వాయిదా. ఈ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులు అప్రమత్తం కావాల్సిందే. వివరాల్నీ సరిగ్గా ఉంటేనే పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు వస్తాయని గుర్తుంచుకోవాలి.
పీఎం కిసాన్ 14వ ఇన్‌స్టాల్‌మెంట్ మే లేదా జూన్ నెలలో విడుదల చేయొచ్చని అంచనా. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అంతకన్నా ముందు రైతులు వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. అప్పుడే అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి. ఇ-కేవైసీ, ఆధార్ సీడింగ్, ల్యాండ్ సీడింగ్ చేసిన రైతులకే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి. ఇవి చేస్తే సరిపోదు. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర డాక్యుమెంట్స్‌లో పేరు తప్పుగా లేకుండా చూసుకోవాలి. గతంలో పేరు మ్యాచ్ కాకపోవడం వల్ల లక్షలాది మంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు జమ కాలేదు.
పీఎం కిసాన్ ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడానికి గతంలో చివరి తేదీ ఉండేది. కానీ ఇప్పుడు చివరి తేదీ ఏమీ లేదు. రైతులు ఎప్పుడైనా ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. https://pmkisan.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఇ-కేవైసీ లింక్ యాక్టీవ్‌గానే ఉంది. మరి రైతులు ఇ-కేవైసీ ఎలా చేయాలో తెలుసుకోండి.
పీఎం కిసాన్ ఇకేవైసీ ప్రాసెస్
రైతులు ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో eKYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
ఆ తర్వాత ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Get Mobile OTP పైన క్లిక్ చేయాలి.
మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి, Consent Given పైన టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ చేయాలి.
ఇ-కేవైసీ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.
ఒకవేళ ఆధార్ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయకపోవడం వల్ల గతంలో పీఎం కిసాన్ డబ్బులు రానట్టైతే ఆ వివరాలు ఎడిట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
ముందుగా https://pmkisan.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Farmers Corner సెక్షన్‌లో Edit Aadhaar Failure Records పైన క్లిక్ చేయాలి.
ఆధార్ నెంబర్ , అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫార్మర్ నేమ్‌లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలి.
వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
ఆ తర్వాత రైతు పేరు, ఇతర వివరాలన్నీ సరిచూసుకోవాలి.
వివరాల్లో తప్పులు ఉంటే Edit పైన క్లిక్ చేసి సరిచేసుకోవచ్చు.
గత మూడు విడతలుగా చూస్తే పీఎం కిసాన్ లబ్ధిదారులు తగ్గిపోతున్నారు. గతేడాది ఏప్రిల్-జూలై విడతలో 11.27 కోట్లు, ఆగస్ట్-నవంబర్ విడతలో 8.99 కోట్లు, 2022 డిసెంబర్-2023 మార్చి విడతలో 8.53 కోట్ల రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యాయి.
0 Response to "PM Kisan Scheme"
Post a Comment