Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Pushkar secret. Let's find out which river gets pushkaras when.

పుష్కర రహస్యం . ఏ నదికి ఎప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసుకుందాం.

Pushkar secret. Let's find out which river gets pushkaras when.

భారతదేశంలో గంగా, యమున, నర్మద, కావేరి, భీమరథి, సరస్వతి, గోదావరి, కృష్ణ, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత వంటి 12 జీవనదులు ప్రవహిస్తున్నాయి.

వీటినే పుష్కర నదులు అంటారు. ఈ 12 పుష్కర నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒక్కసారి పుష్కరాలు వస్తుంటాయి. ఈ పుష్కరాలు కూడా రాశులకు అనుగుణంగా వస్తుంటాయి. ఒక్కోనదికి ఒక్కో రాశి అధిష్టానమై ఉంటుంది. ఈ పుష్కరాలు కూడా 12 రోజుల పాటు జరుగుతుంటాయి. పుష్కర సమయంలో నదిలో సకల దేవతలు కొలువై వుంటారు. అందుకే పుష్కరాల సమయంలో నదీ స్నానం చేస్తే పాపాలు అన్ని తొలగి పుణ్యం వస్తుందని భారతీయ ప్రజల నమ్మకం.

అయితే ఏ నదికి ఏ సమయంలో పుష్కరాలు వస్తాయి అనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. అలాగే మనందరికి నవగ్రహాల గురించి తెలుసు. అయితే వాటిలో గురుగ్రహం ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలో ప్రవేశిస్తుంది. అలా 12 సంవత్సరాలు 12 రాశుల్లో తిరుగుతుంది. అలా ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. మరి ఏ రాశిలో గురుగ్రహం ప్రవేశిస్తే ఏ నదికి పుష్కరాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి -గంగానది

వృషభరాశి -నర్మదానది

మిథునరాశి -సరస్వతి నది

కర్కాటక రాశి -యమునా నది

సింహరాశి -గోదావరి నది

కన్యారాశి -కృష్ణానది

తులారాశి -కావేరి నది

వృశ్చిక రాశి భీమరథీ నది

ధనూరాశి -పుష్కరవాహిని (తపతి) నది

మకర రాశి - తుంగభద్ర నది

కుంభరాశి -సింధూనది

మీనరాశి - ప్రాణహితనదికి పుష్కరాలు వస్తాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Pushkar secret. Let's find out which river gets pushkaras when."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0