Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC Exams 2023

 SSC Exams 2023: ఈరోజు నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు!

SSC Exams 2023

అంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది.

సీబీఎస్ఈ పరీక్షల తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు. అలానే ఈ ఏడాది ఆరు సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు అధికారుల పలు కీలక సూచనలు చేశారు.

ఈ ఏడాది జరగనున్న పదో తరగతి పరీక్షలో విద్యాశాఖ అధికారులు పలు మార్పులు చేశారు. తొలిసారిగా ప్రశ్నపత్రాలకు సీరియల నెంబర్ ఇవ్వనున్నారు. 24 పేజీల బుక్ లేట్ రూపంలో సమాధాన పత్రం ఉంటుంది. అదనంగా కావాలంటే 12 పేజీల మరో బుక్ లేట్ ఇస్తారు. విద్యార్థులు సమాధానాలను బుక్ లేట్ లోనే రాయలి. అలానే విద్యార్థులు గ్రాఫ్, మ్యాప్ పాయిటింగ్ మీద పేరు రాయకూడదు. సీరియల్ నెంబర్ మాత్రమే వేయాలి. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం ప్రశ్నలను వేర్వేరు సమాధాన పత్రాల్లో రాయాల్సి ఉంటుంది. పరీక్ష ముగిసే వరకు ఎగ్జామ్ సెంటర్‌ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి లేదు.

నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని ఇప్పటికే అధికారులు తెలిపారు. అలానే పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించారు. ఇన్విజలేటర్లు, చీఫ్ సూపరిండిండెంట్లు, ఇతర అధికారులు సైతం పరీక్షా కేంద్రాలకి సెల్ ఫోన్ తీసుకురాకుండా నిషేధించారు. గతంలో మాదిరి ఎటువంటి లీకేజీ ఆరోపణలు రాకుండా విద్యా శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ 18వ వరకు జరగనున్నాయి. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకి 6.64 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. 3449 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

సమస్యాత్మకమైన 104 పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలానే మరో వంద కేంద్రాలలోనూ సీసీ కెమెరాలతో అధికారులు పర్యవేక్షించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 156 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. అలానే వేసవి తీవ్రత నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద తాగు నీరు, టెంట్లను అధికారులు ఏర్పాటు చేశారు. మరి.. రేపటి నుంచి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు మీ ఆల్ ది బెస్ట్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC Exams 2023"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0