AP SCERT Text Books Class 1-10 Class
AP SCERT TEXT BOOKS Ist CLASS TO 10th CLASS
- విద్యారంగంలో విప్లవాత్మకమైన మరో మార్పునకు శ్రీకార
- ఆన్ లైన్ లో 1 నుంచి 10 వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు • ఉభయ భాషల్లో సుమారు 350 పాఠ్యపుస్తకాలు
- వెబ్ సైట్ లో ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
రాష్ట్రంలోని విద్యార్ధులకు పాఠ్యపుస్తకాల కొరత అనేది లేకుండా చూడటానికి, అవి అందరికీ అందుబాటులో ఉండేలా చూడటానికి వాటన్నిటిని పిడిఎఫ్ ఫార్మాట్ లో వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతున్నామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 1 నుంచి 10 వ తరగతి వరకు సంబంధించిన వివిధ సబ్జెక్టులన్నీ కలిపి ఉన్న సుమారు 370 రకాల పుస్తకాలను ఆన్ లైన్ ఉచితంగా అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష. ప్రాజెక్టు డైరక్టర్ శ్రీనివాసరావు, పాఠ్యపుస్తకాల ముద్రణ సంస్థ డైరక్టర్ రవీంద్రనాధ్ రెడ్డి తదితరులతో కలిసి బుధవారం నాడు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పాఠ్య పుస్తకాలను కేవలం విద్యార్ధుల వ్యక్తిగత ఉపయోగార్ధమే ఉపయోగించుకోవాలని, వీటిని ముద్రించి బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 42 లక్షల మందికి ఉచితంగానూ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న సుమారు 28 లక్షల మందికి విక్రయ పద్దతిన పాఠ్యపుస్తకాలను సమకూరుస్తున్నామని చెప్పారు. ఇకపై ఈ పుస్తకాలన్నీ ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తూ విద్యార్ధులను గ్లోబల్ సిటిజన్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా, ఆన్ లైన్ లో కూడా పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి వివరించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ ఆన్ లైన్ లో పుస్తకాలను ఉంచడం ద్వారా డిజిటల్ ప్రక్రియను విద్యాబోధనలో వినియోగించడంతో పాటు, పుస్తకాలు అందుబాటులో లేవు అనే సమస్యను అధిగమించినట్లవుతుంది
దేశంలోనే రాష్ట్ర విద్యా రంగాన్ని ప్రదను స్థానంలో నిలబెట్టడానికి, పటిష్టమైన బోధన అందించడానికి, విద్యార్ధులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి వివిధ పధకాలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. దేశంలోనే మొదటి సారిగా ద్వి భాషా పాఠ్య పుస్తకాలను రూపొందించి నూతన జాతీయ విద్యా విధాన స్పూర్తిని రాష్ట్రంలో అమలు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ V.S. జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. గుణాత్మకమైన విద్యను అందించడం కొరకు అనేక వినూత్నమైన పద్ధతులను అవలంబిస్తున్నామన్నారు.
పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ ఆన్ లైన్ లో పుస్తకాలను ఉంచడం ద్వారా డిజిటల్ ప్రక్రియను విద్యాబోధనలో వినియోగించడంతో పాటు, పుస్తకాలు అందుబాటులో లేవు అనే సమస్యను అధిగమించి నట్లవుతుంది.
దేశంలోనే రాష్ట్ర విద్యా రంగాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి, పటిష్టమైన బోధన అందించడానికి, విద్యార్ధులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి వివిధ పధకాలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. దేశంలోనే మొదటి సారిగా ద్వి భాషా పాఠ్య పుస్తకాలను రూపొందించి నూతన జాతీయ విద్యా విధాన స్పూర్తిని రాష్ట్రంలో అమలు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ V.S. జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. గుణాత్మకమైన విద్యను అందించడం కొరకు అనేక వినూత్నమైన పద్ధతులను అవలంబిస్తున్నామన్నారు. SCERT 2020-2021 విద్యా సంవత్సరం నుండి సెమిస్టర్ సిస్టమ్ ద్విభాషా పద్ధతిలో I నుండి IX తరగతులకు పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేసింది. ద్విభాషా పుస్తకాలు క్రింది భాషలలో అందుబాటులో ఉంచబడ్డాయి: English - Telugu, English Urdu, English - Tamil, English - Kannada English - Odia
ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ చరిత్రలో మొట్ట మొదటిసారిగా SCERT ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలన్నిటినీ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో జరిగింది. ఈ పాఠ్యపుస్తకాలన్నీ టినీ ఎవరైనా https://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యాపార నిమిత్తం ప్రచురించుట నిషేధము, అక్రమంగా ముద్రించినా, అమ్మినా, మార్పులు చేర్పులు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలిపారు. ఆన్ లైన్ లో ఏ పుస్తకాలు ఉన్నాయంటే.
1 నుండి 10 తరగతులకు సంబంధించి మొత్తము 371 పుస్తకాలకు గాను ఇందులో 195ద్విభాషా (BILINGUAL) పుస్తకాలు,176 భాష పుస్తకాలకు సంబంధించినవి. ఇప్పటికే 353 పుస్తకాలు వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. ఇందులో భాషేతర సబ్జెక్ట్స్ కు సంబంధించిన 178 ద్విభాషా(BILINGUAL ) పుస్తకాలు, భాషకు సంబంధించిన 175 పుస్తకాలు వెబ్సైట్ లో కలవు.
3 మిగిలిన మైనర్ మీడియాకు సంబంధించిన 18 పుస్తకాలు త్వరలో వెబ్సైట్లో ఉంచటం జరుగుతుంది. ఈ పుస్తకాలు ముఖ్యంగా ప్రధాన మాధ్యమాలైనా ఇంగ్లీష్ మరియు తెలుగు, అదే విధంగా మైనర్ మీడియాలైన ఉర్దూ, తమిళ్ కన్నడ, ఒడియా పుస్తకాలు ఉన్నాయి. ఈ పాఠ్యపుస్తకాలపై ఉన్న QR కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా కూడా మరింత ఉపయోగకరంగా ఉంటాయి.
ఈ విధంగా వెబ్సైటులో ఉంచబడిన పుస్తకాల వలన ఉపాధ్యాయునికి బోధన కోసం తయారయ్యే సమయం తగ్గుతుంది. సులువుగా పాఠ్య ప్రణాళిక తయారు చేసుకోగలుగుతారు. సెలవు లేదా ఇతరేతర దినములలో పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేకున్నా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పుస్తకాలను ఈ విధానంలో సులభంగా పాఠ్యపుస్తకాలను వినియోగించుకుంటారు.
AP SCERT Text Books Download Link ( Class 1-10)
0 Response to "AP SCERT Text Books Class 1-10 Class"
Post a Comment