Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 11 : Students Summer Holidays Activities

 Day - 12 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:12 Activities

Class: 1,2
12 వ రోజు 

To develop Numaracy Skills:

Q) Collect the Sticks and make  bundles of  Ten

తెలుగు:

Q) కింది దీర్ఘం ఉన్న వాక్యాలు చదువుతూ రాయండి.

👉 మనం వాన పాట పాడుదాం.
👉 మనం సాయంకాలం ఆటలు ఆడుదాం.
👉 పాపా, చందమామ కావాలా?
👉 పాపా, పానకం తాగావా?
👉 తాత తలపాగా అందంగా ఉందా?

English:

Q) Write the missing letters.

F - s h     🐠

F - x      🦊

F a - e     😈

F - r e       🔥

F - o w - r   🌹

Maths:

Q) Circle ' ⭕ ' the Biggest Number.

1) 77, 89, 73

2) 515, 511, 516

3) 928, 721, 826

4) 405, 609, 302

5) 956, 953, 958

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

I = నేను

At = వద్ద.

Be = ఉండు, అగు, సంభవించు.

This = ఇది.

Have = కలిగి ఉండు.

From = నుండి.

Or = లేదా.

One = ఒకటి.

Had = కలిగుండెను.

By = చేత, వలన.

Word = పదము.

But = కాని.

Not = కాదు,లేదు.

What = ఏమిటి.









Class :3,4,5
12 వ రోజు:
Q) సింహం మరియు ఎద్దులు కథను మీ సొంత మాటల్లో మీ నోటు పుస్తకం లో రాసి గ్రూప్ లో పోస్ట్ చేయండి.

Q ) Wrire the Story '  The lion and the bulls ' in your own words in your note book and post in the group.



💎నేటి ఆణిముత్యం
పసరంబు పంజైన బసులకాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు,
భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన దండ్రి తప్పు,
సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు,
అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు,
ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చ వచ్చి
నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!!

తాత్పర్యం:
పశువులు దారితప్పితే కాపరిది, ప్రజలు చెడ్డవారైతే రాజుది, భార్య గయ్యాళితనానికి భర్తది, కొడుకు దుడుకుతనానికి తండ్రిది, కూతురు చెడునడతకు తల్లిది, సైన్యం పిరికిదైతే సైన్యాధిపతిది, గుర్రం ఆగిపోతే రౌతుది.. తప్పవుతుంది. ఎవరికి వారు ఇలా తమ తప్పుల్ని తెలుసుకోక ఇష్టం వచ్చినట్లు వుంటే ఎలా? నీవైనా వారికి జ్ఞానోదయం కలిగించు స్వామీ!!

🤘నేటి సుభాషితం

ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఇతరులను తనవెంటనడిపింప జేసే నాయకుడు అవుతాడు.

👬 నేటి చిన్నారి గీతం 

దీపాలు... దీపాలు

దీపాలూ - దీపాలూ
చీకటి చీల్చే దీపాలు
రమ్యమైన దీపాలు
ఇంటికి అందం దీపాలు
వీధిలో వెలిగే దీపాలు
దారులు చూపే దీపాలు
లోకాలకు వెలుగు దీపాలు
దేవుని గుడిలో దీపాలు
పాపాయికి దీవెనలిచ్చె దీపాలు
దీపాలు - దీపాలు

🗣నేటి జాతీయం

ఇంటికి జ్యేష్ఠాదేవి పొరుగుకు లక్ష్మీదేవి

పని చేసిన వ్యక్తికి నష్టం, పొరుగువారికి లాభం. కొందరు ఇంట్లోని విషయాలను పట్టించుకోకుండా.... పొరుగు వారికి ఉపయోగించే పనులు చేస్తుంటారు. వారి గురించి ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
🤠 నేటి సామెత 

రెక్కాడితే గానీ డొక్కాడదు

రోజూ కాయ కష్టం చేస్తేగానీ కడుపు నిండని పరిస్థితిలో ఎవరైనా ఉన్నప్పుడు ఈ సామెతను వాడుతారు.

🎯DAY-12

WE LOVE READING

💁‍♀️The Woodcutter and The Golden Axe

🔮A long time ago, in a small village, there lived an honest woodcutter. He went into the surrounding forest every day to cut trees. He returned to the village with the woods and sold them to a merchant to get money. He was content with his modest lifestyle.

His axe slipped out of his hand and fell into the river one day while he was cutting a tree near a river. He couldn’t imagine retrieving it on his own because the river was so deep. He had only one axe, which he had lost in the river. He got really concerned about how he would be able to make a life today and prayed to the Goddess for help.

Mercury emerged as the God of Water. He enquired as to why he was crying. The woodcutter expressed his dissatisfaction. Mercury then split the water and gave him a golden axe. The woodcutter refused to accept it. Mercury returned, this time with a silver axe, but the woodcutter turned it down once more.

After that, he arrived with an iron axe. It was graciously accepted by the woodcutter. The river God blessed him with the golden and silver axe since Mercury was so pleased with the woodcutter’s  honesty.
🔮Moral of the story: Honesty is the best policy.

✍🏼 నేటి కథ 

ఎంత మంచి ఎలుకలో!

గూడులో ఉన్న పక్షి పిల్లలకు ఆహారం తేవడానికి పొద్దున్నే బయలుదేరింది పక్షుల జంట. కొంత సేపటికి గూట్లోని పక్షి పిల్లల్లో ఒకటి అటూ ఇటూ కదులుతూ గూటి నుంచి పట్టు తప్పి కింద పడిపోయింది. అదృష్టవశాత్తు ఆ బుజ్జి పిల్ల చెట్టు కింద ఉన్న ఒత్తైన గడ్డిలో పడింది. ఏం జరిగిందో అర్థంకాక అది భయంతో కిచకిచలాడసాగింది. అప్పుడే అటుగా వచ్చిన సుధ, కిరణ్‌లు ఆ పక్షి పిల్ల పరిస్థితిని గమనించి, మెల్లగా చేతిలోకి తీసుకున్నారు. తమతోపాటు ఇంటికి తీసుకెళ్లి దానికి తినడానికి ఆహారం, బుజ్జి పళ్లెంలో నీళ్లు పెట్టారు. అది ఆవురావురుమని ఆహారం తిని, కొన్ని నీళ్లు తాగింది.

కిరణ్‌ వాళ్లింట్లో పాత సామాను గదిలోకి వెళ్లి వాళ్ల తాతయ్య ఎప్పుడో కొన్న సన్న తీగల పంజరం బయటకు తెచ్చి, ఆ బుజ్జి పిట్టను అందులో పెట్టాడు. మరి దానికి కాస్త గాలి, వెలుతురు కావాలి కదా! అందుకని ఆ పంజరాన్ని వరండాలో తగిలించాడు.
మధ్యాహ్నానికి పిల్లలను చూసుకోవడానికి తల్లి, తండ్రి పక్షులు వచ్చాయి. అంతే వాటి గుండె ఆగినంత పనైంది. రెండు పిల్లల్లో ఒకటి కనిపించలేదు మరి! అవి దిగులుగా అరుస్తూ అటూ ఇటూ చెట్టు కింద వెతికాయి. అయినా ప్రయోజనం లేకపోయింది. వాటికి దగ్గర్లోనే రెండు ఎలుకలు కనిపించాయి. అవి వాటి దగ్గరికి వెళ్లి ‘మిత్రులారా.. మా బుజ్జి పిల్ల ఒకటి గూట్లో కనిపించట్లేదు. దాన్ని మీరేమైనా చూశారా?’ అని అడిగాయి.

‘ఆ చూశాం.. ఆ పిల్ల కింద పడితే, ఓ అబ్బాయి, అమ్మాయి అదిగో.. ఆ పెద్ద ఇంట్లోకి తీసుకెళ్లారు. వాళ్లింట్లో వెతకండి. మాకు పొద్దున్నుంచి సరైన తిండి దొరకలేదు. ఆ చెట్టు మీద రెండు జామపండ్లు కోసి కింద పడవేస్తే మా ఆకలి తీర్చుకుంటాం. మీకు చేతనైన సహాయం చేస్తాం’ చెప్పాయి ఎలుకలు.

వెంటనే జామ చెట్టుకున్న రెండు పండ్లు కోసి కింద పడవేశాయి పక్షులు. ఎలుకలు కృతజ్ఞతలు చెప్పి వాటిని తిన్నాయి. తల్లి, తండ్రి పక్షులు ఎగురుకుంటూ ఆ పెద్ద ఇంటి వైపు వెళ్లాయి. బుజ్జి పక్షి అరుపు వాటికి వినపడింది.

‘మేమున్నాం భయపడకు’ అన్నట్టుగా అరుస్తూ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే వరండాలో పంజరంలో ఉన్న వాటి బుజ్జి పిల్ల కనిపించింది. దాని ముందు ఆహారం, నీళ్లు చూసి ఆ ఇద్దరు పిల్లలకు అవి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాయి.
వెంటనే తల్లి, తండ్రి పక్షులు వాటి పక్షి స్నేహితుల్ని కలిసి విషయమంతా చెప్పాయి. తమ పిల్లను వెనక్కు తీసుకురావడానికి సహాయం అడిగాయి. ‘మనలో మనం సహాయం చేసుకోకపోతే ఎలా? తప్పక సహాయం చేస్తాం’ అని అవి మాటిచ్చాయి.

తల్లి, తండ్రి పక్షులతో మరో ఆరు పక్షులు కలిసి ఆ ఇంటి దగ్గరకు వెళ్లాయి. మరి పంజరం జాగ్రత్తగా తీసుకురావాలి కదా! తండ్రి పక్షి పొడవైన గట్టి కొమ్మ తెచ్చింది. దాన్ని పంజరం పైన ఉన్న కొక్కీలో పెట్టి ఇటు మూడు అటు మూడు కలిసి జాగ్రత్తగా పట్టుకుని గూడున్న చెట్టు దగ్గరకు తీసుకెళ్లాయి. దూరం నుంచి ఎలుకలు పంజరాన్ని చూసి పరుగెత్తుకుని వచ్చాయి.

‘మా పిల్ల ఉన్న బోనునైతే ఎలాగోలా కష్టపడైతే తెచ్చాం కానీ.. దాన్ని బయటకు ఎలా తీసుకురావాలో తెలియడం లేదు’ అని విలపించాయి పక్షులు.
‘మీరేం భయపడకండి, పిల్లను బయటకు తెచ్చే బాధ్యత మాది’ అని ఎలుకలు పంజరం తలుపుకున్న కొక్కీని అతి కష్టం మీద తీశాయి. పిల్ల పక్షి సంతోషంతో కిలకిలలాడుతూ తల్లి, తండ్రి పక్షులను చేరింది. మంచి మనసుతో మేలు చేసిన ఎలుకలకు కృతజ్ఞతలు చెప్పాయి. వీలున్నప్పుడల్లా వాటికి పండ్లు తెచ్చి ఇచ్చేవి.


తెలుసు కుందాం

🟩ఓడ నీళ్ళమీద ఎలా తేలుతుంది ?,Ship float on sea How?

🟥చిన్న రాయి నీళ్ళలో మునుగుతుంది . . కాని టన్నుల బరువు మోసే ఓడ మాతము నీటిమీద తేలుతుంది ... దీనికి కారణము ఆయా వస్తువులు నీటిని ఏ మేరకు పక్కకు నేడతాయి అనే సూత్రము .

వస్తువు పరిమాణం ,సాంద్రత అధిక మైనపుడు అవి ఎక్కువగా నీటిని పక్కకు నేడతాయి . నీరు ఆ వస్తువును పైకి నెట్టడం తో అది పైన తేలుతుంది . ఓడల రూపము , దాని నిర్మాణం , దాని ఉపరితలం వల్ల ఓడ నీటిపై తేలుతూ వెళ్ళుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 11 : Students Summer Holidays Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0