Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 13 : Students Summer Holidays Activities

 Day - 13 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:13 Activities
Day:13 Activities

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

All = అన్నీ,అంతా.

Were = కలిగి ఉండెను.

We = మేము, మనము.

When = ఎప్పుడు.

Your = నీయొక్క.

Can = సాధ్యమగు, చెంబు, గిన్నె.

Said = చెప్పెను.

There = అక్కడ.

An = ఒక.

Each = ప్రతి యొక

Which = ఏది.

She = ఆమె.

Do = చేయుట.

How = ఎలా.

Their = వారియొక్క.

If = ఐతే.

Will = కోరు, ఆశపడు.

Up = పైన.

Other = మరియొక.

About = గురించి.

Out = బయట.
💎నేటి ఆణిముత్యం

పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక పరులకు హితుడై
పరుల దనుబొగడ నెగడక
పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ!

తాత్పర్యం:

పరస్త్రీలపట్ల సోదరుడిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఎంతమాత్రం ఆశపడకూడదు. తోటివారంతా తనను ఇష్టపడేలా ప్రవర్తించాలి. ఎదుటివారు పొగుడుతుంటే ఉప్పొంగిపోకూడదు. ఎవరైనా కోపగించుకొన్నప్పుడు dc తాను కూడా అదే పంథాలో ఆగ్రహాన్ని ప్రదర్శించరాదు. ఇలాంటి ఉత్తమగుణాలను కలిగివున్నవాడే శ్రేష్ఠుడుగా గుర్తింపబడతాడు.

🤘నేటి సుభాషితం

గౌరవం అనేది వయస్సు ను బట్టి ఉండదు,వ్యక్తి సంస్కారం బట్టి ఉంటుంది.

👬 నేటి చిన్నారి గీతం 

బంగారు పాప
పాపా పాపా
బందు పాపా
పాప చాయ
పసిడి చాయ
పాప నవ్వు
పారిజాత పువ్వు
పాప మోము
పగడాల కెంపు
పాప పలుకు
పంచదార చిలుక
పాప నడక
రాజ హంస సొగసు
పాప చూపు
కోటి దీపాల వెలుగు
పాప మనసు
మల్లెపూవు తెలుపు
పాప అంటె
అందుకే అంత ఇష్టం!

🤠 నేటి సామెత 

రెంటికీ చెడిన రేవడి చందాన

రేవడు అంటే చాకలి అని అర్థము. దీని వెనక ఒక చిన్న కథ ఉన్నది:-

అనగా అనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక రేవు. ఒక చాకలి అతను రోజూ ఆ రేవుకి వచ్చి బట్టలు ఉతుకుతుండేవాడు. ఒకరోజు సగం బట్టలు ఉతికి ఒడ్డున ఆరేస్తుంటే, అకస్మాత్తుగా వాగు పొంగింది. "అయ్యో! అయ్యో! నా బట్టలు" అంటూ, వాగులోనికి పరుగెత్తాడు. కానీ అప్పటికే కొన్ని బట్టలు వాగులో కొట్టుకోని పోయాయి.

ఇంతలో వాగు మరింత ఉదృతంగా పొంగినది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఒడ్డున ఉన్న మిగిలిన బట్టల్ని కూడా వదిలేసి, పరుగెత్తుకొని దగ్గరలోని గుట్ట ఎక్కాడు. వాగు ఉధృతికి మిగిలినా ఆ బట్టలు కూడా కొట్టుకు పోయాయి.

మొదటే ఒడ్డున ఉన్న బట్టలు తీసుకోని పరుగెత్తితే కనీసం అవన్నా దక్కేవి కదా! అందుకే అంటారు "రెడింటికి చెడిన రేవడి " అని.
🗣నేటి జాతీయం

ఇనుప గుగ్గిళ్ళు నమలటం

అత్యంత కష్టమైన పని చేయటం ఎంతగా ఉడికించినా అవి ఉడికేదీ లేదు, మెత్తపడేదీ లేదు. వాటిని ముందు పెట్టి తినమన్నప్పుడు ఎంత కష్టమైన పనో.


🎯DAY-13🎯

📒WE LOVE READING📒

💁‍♀️The Brahmin’s dream

A poor Brahmin lived in a village all alone. He had no friends or relatives. He was known for being stingy and he used to beg for a living.

 The food he got as alms were kept in an earthen pot which was hung beside his bed. This allowed him to easily access the food when he got hungry.


On one day, he got so much rice gruel that even after completing his meal, there was so much leftover in his pot. That night, he dreamt that his pot was overflowing with rice gruel and that if a famine came, he could sell the food and earn silver from it. This silver could then be used to buy a pair of goats who would soon have kids and create a herd. This herd in turn could be traded for buffaloes who would give milk from which he could make dairy products. These products could be sold in the market for more money.
This money would help him get married to a rich woman and together they would have a son who he could scold and love in equal measure. He dreamt that when his son wouldn’t listen, he would run after him with a stick.

Wrapped up in his dream the Brahmin picked up the stick near his bed and started hitting  the air with the stick. While flailing about, he hit the earthen pot with the stick, the pot broke and all the contents spilled over him. The Brahmin woke up with a start only to realize that everything was a dream.

🔮Moral of the story
One should not build castles in the air.

✍🏼 నేటి కథ 

పిసనారి కాదు
 
రాజారావుకి తన పక్కింట్లో ఉండే శ్రీధర్ అంటే చాలా చిన్నచూపు. తనలాగా జల్సాలు చెయ్యడని లెక్కలేనట్టు డబ్బు ఖర్చు పెట్టడనీ లోకువగా చూస్తాడు.

ఉన్నదానికి నాలుగు రెట్లు ఖర్చుపెడుతూ ఆడంబరంగా బతికే రాజారావుని చూస్తుంటే శ్రీధర్ కి జాలి అనిపిస్తుంటుంది. ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు అతనికి. వెనకాల ఆస్తిపాస్తులేమీ లేవు. సొంత ఇల్లు కాదు.అద్దె ఇల్లే.

తనకీ ఇద్దరు పిల్లలున్నారు. సొంత ఇల్లు కాదు. అద్దె ఇల్లే. వెనక ఆస్తులేమీ లేవు. గొప్పలకోసం అక్కర్లేని అనవసర ఖర్చులు పెట్టడం తన పద్ధతి కాదు.ఇంట్లో ఎవరికీ ఏ లోటూ లేకుండానే గడుపుకొస్తున్నాడు. రాజారావు తనని చిన్న చూపు చూస్తాడని తెలిసినా తేలిగ్గానే తీసుకుంటాడు తప్ప అతని పట్ల కోపం లేదు.

"మీ నాన్న పిసినారి వాడు కదూ!" ఆ రోజు అర్జున్ని అడిగాడు రాజారావు కొడుకు పవన్. చూసిన సినిమాకే మళ్ళీ మూడోసారి చూడటానికి వాళ్ళనాన్న తనూ వెళ్తున్నారు.

శ్రీధర్ కొడుకు అర్జున్ కి రాజారావు అంకుల్ లాగా తన తండ్రి కూడా ఉంటే బావుండుననిపించింది.ఇప్పుడనిపించడం ఏమిటి గానీ ఎప్పుడూ అలాగే అనిపిస్తుంటుంది. తను ఎప్పుడూ మనసులో అనుకునేదే పవన్ అన్నాడు.....కానీ ఎందుకో వాడు అంటే మాత్రం ఉడుకుమోత్తనంగా అనిపించింది. తలొంచుకుని ఇంట్లోకెళ్ళిపోయాడు.తల్లి దగ్గిరచేరి నసగడం మొదలుపెట్టాడు.
నవ్వింది శ్యామల" ఏవిట్రా నీ బాధ?""
“అది కాదమ్మా! అసలు....నాన్నెందుకు డబ్బు ఖర్చుపెట్టడానికి ఎంతో ఆలోచిస్తాడు?చక్కగా ఆ రాజారావు అంకుల్ చూడు తనకీ పవన్ కీ ఎన్ని రకాల బూట్లో ఉండగానే ఇంకా ఇంకా కొంటూనే ఉంటాడు.జీన్స్ ప్యాంట్లు ఎన్ని ఉన్నా అస్తమానం కొని తెస్తూనే ఉంటాడు.ఎప్పుడూ హోటళ్ళకీ సినిమాలకీ తీసికెళ్తుంటాడు.మొన్న నేను జీన్స్ ప్యాంటు కొని తెమ్మంటే కిందటి నెల్లోనే కదా కొన్నాను మళ్ళీ అప్పుడే ఏమిటి అన్నాడు నాన్న. సినిమా అంటే...టీవీ లో చూస్తూనే ఉన్నావుకదా అస్తమానం బయటకెళ్ళి చూడాలంటే ఎంత డబ్బవుతుందో తెలుసా అంటాడు. నాన్నెందుకమ్మా అంత పిసినారిగా ఉంటాడు ?"

"పొదుపరికీ పిసినారికీ తేడా తెలుసుకోరా నువ్వు ముందు. మనకేవన ్నాఇంట్లో ఎందులోనన్నా లోటు చేస్తున్నారా? లేదు కదా! నీకు కావలసినన్ని బట్టలున్నాయి. ఎవరినో చూసి..." తల్లి మాటలు పూర్తికాకుండానే కోపంగా లేచి వెళ్ళిపోయాడు అర్జున్ "నువ్వంతే ఎప్పుడూ నీతి పాఠాలు చెప్తావు" అంటూ.

........ ..................
ఎప్పుడూ తమ ఇంటివైపే చూడని రాజారావు అంకుల్ ఆ రోజు పొద్దున్నేకళ్ళల్లో నీళ్ళతో రావడం నాన్నచేతులు పట్టుకోడం వింతగా ఉంది అర్జున్ కి.

"ఇలా కూచోండి ముందు. ఏంజరిగింది?" శ్రీధర్ నెమ్మదిగా ఆయన్ని కూచోపెట్టాడు.
"శ్రీధర్ గారూ మీరే నాకు సాయం చెయ్యాలి. కొంచెం డబ్బు కావాలి... అప్పుగానే... జీతాలు రాగానే తిరిగి ఇస్తాను. మా బావమరిదికి యాక్సిడెంట్ అయ్యిందిట. పక్కింటివాళ్ళు ఫోన్ చేశారు.
మేము వెంటనే వెళ్ళాలి. మేము తప్ప ఎవరూ లేరతనికి. కానీ... కానీ... ఒకటో తేదీ జీతం వచ్చే దాకా నాదగ్గిర డబ్బు లేదు.
ముగ్గురు నలుగురిని అడిగాను. ఎవ్వరూ ఇవ్వలేదు. వాళ్ళదగ్గిర ఇప్పటివరకూ తీసుకున్న అప్పులు తీర్చకుండా మళ్ళీ అడిగితే వాళ్ళు మాత్రం ఎలా ఇస్తారు? నాకు భగవంతుడు మంచి గుణపాఠం నేర్పించాడు."

అర్జున్ అంకుల్ వైపు చూశాడు జాలిగా... నాన్న పిసనారి కదా ఒక్క రూపాయి కూడా ఇవ్వడు... ఔను... మొన్న తనకి జీన్స్ ప్యాంటు బూట్లు కొనలేదుగా! నిన్న హోటల్ కి తీసికెళ్ళమని అడిగితే పదిహేను రోజులే కదా అయ్యింది హోటల్ కి వెళ్ళి వొచ్చేనెల్లో చూద్దాం అన్నాడు. అలాంటి నాన్న అంకుల్ కి సాయం చేస్తాడా!
"రాజారావు గారూ కంగారు పడకండి.... తప్పకుండా సాయం చేస్తాను." అంటూనే లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి ఇచ్చాడు.

అర్జున్ నమ్మలేనట్టుగా చూశాడు. రాజారావు వెళ్ళిపోయాక కొడుకుని దగ్గిరకి పిలిచాడు శ్రీధర్.
"అనవసరపు ఖర్చులు పెట్టకుండా కాస్త ఆలోచించి నడుచుకుంటే ప్రతిరోజూ అప్పులు చెయ్యడం.... అత్యవసరం వొచ్చినప్పుడు ఎవరూ అప్పు ఇవ్వకపోవడం జరగదు.... ఔనా కాదా..."

ఔను అన్నట్టుగా తల ఊపాడు అర్జున్.

"ఒప్పుకుంటావా ఆపదలో ఉన్నవాళ్ళకి సాయం చేసేందుకు వెనకాడని స్వభావం మీ నాన్నగారిదని... పొదుపుగా ఉండే మనస్తత్వమనీ....." అమ్మ మాట పూర్తి కాకుండానే అందుకున్నాడు అర్జున్ "పిసనారి కాదని కూడా ఒప్పుకుంటాను."

అంటూనే నాన్నని వాటేసుకున్నాడు. ఆ ముఖంలో చెప్పలేనంత సంతోషం వెల్లివిరిసింది.

తెలుసు కుందాం

🟥ఆహార పదార్థాలను చూడగానే మన నోటిలో లాలాజలం ఎందుకు వస్తుంది?
(ఇష్టమైన ఆహారము చూడగానే నోరు ఊరుతుంది ఎందుకు ?)
🟩మనకు ఇష్టమైన పదార్ధము వాసన వచ్చినా , కనిపించినా ... నోటిలో లాలాజలం ఊరి ఆపదార్దము తినాలనిపిస్తుంది .ఇది అప్రయత్నం గా జరిగే చర్య . మనిషికి కలిగే అనుభవాలు మెదడులో నమోదవుతుంటాయి . ఒక సారి తిని బాగా ఇస్టపడిన వంటకము రుచి , వాసన , చూపు , మెదడులో నమోదు అవుతాయి . మరోసారి ఆ వాసన తగిలినా , ఆ పదార్ధము కనిపించినా గత అనుభవాన్ని మెదడు నెమరు వేసుకుంటుంది ... దీని ఫలితం గా మనకు నోరు ఊరుతుంది .

మన నాడీ వ్యవస్థలో భాగంగా స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థ (autonomous nervous system) ఒకటుంది. పంచేద్రియాల ద్వారా గ్రహించే అవగాహనకు అనుకూలంగా మన శరీరం, మనసు స్పందించే తీరుతెన్నులు ఈ నాడీవిభాగం అజమాయిషీలోనే ఉంటాయి. దీనికి సంబంధించిన ఎన్నో వివరాలను ఇవాన్‌ పెట్రోవిచ్‌ పావలోవ్‌ (1849-1936) అనే రష్యా శాస్త్రవేత్త కుక్కలపై ప్రయోగాలు చేసి నిరూపించడం విశేషం. ఆకలితో ఉన్న కుక్కకి రోజూ నిర్ణీత సమయానికి ఆహారం ఇస్తూ, అదే సమయంలో ఒక గంట శబ్దం వినిపించేలా చేసేవాడు. అలా చాలా రోజులు జరిగిన తర్వాత గంట శబ్దం వింటే చాలు కుక్క నోట్లో లాలాజలం ఊరడాన్ని గమనించాడు. అంటే ఆహారాన్ని చూడకపోయినా గంట శబ్దానికి కుక్క నోట్లో అసంకల్పితంగా లాలాజలం ఊరిందన్నమాట. ఇలా అనేక ప్రయోగాలు చేసి విశ్లేషించిన తర్వాత శరీరం, ఆలోచన, నాడీ ప్రక్రియలు ఉత్తేజితం కావడాన్ని సిద్ధాంతీకరించాడు. దాన్నే ఇప్పుడు మనం పావలోవ్‌ ప్రతీకార చర్య (pavlov's reflex), లేదా సాంప్రదాయ నియంత్రణ(classical conditioning)గా పాఠాల్లో చదువుకుంటున్నాం. ఈ పరిశోధనలకు గాను పావ్‌లోవ్‌కు వైద్యరంగంలో 1904లో నోబెల్‌ బహుమతి లభించింది. మనకు నచ్చే ఆహారాన్ని చూడగానే నోరూరడం ఈ అసంకల్పిత చర్యలో భాగమే. మనకు అలవాటు లేని కొత్త ఆహారాన్ని చూస్తే ఇలా జరగదు.SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 13 : Students Summer Holidays Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0