Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 14 : Students Summer Holidays Activities

 Day - 14 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:14 Activities
Class: 1,2

14 వ రోజు 

To develop health and well - being

Q) Practice physical exercises daily for 15 minutes.

తెలుగు:

Q) కింది అక్షరాలకు గుడి, గుడి దీర్ఘం చేర్చి రాయండి. చదవండి.

క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, క్ష

English:

Q) Write the missing letters.

G- n       🔫

G o - t      🐐

G - a s s     🍷

G r a - e s   🍇

G - r l          🤱

Maths:

Q) Circle ' ⭕ ' the Smallest Number.

1) 77, 89, 73

2) 515, 511, 516

3) 928, 721, 826

4) 405, 609, 302

5) 956, 953, 958
ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Many = చాలా.

Then =అ ప్పుడు.

Them = వారి.

These = అవి.

So = కాబట్టి.

Her = ఆమెయొక్క.

Would =

Make = చేయు.

Like =ఇష్టపడు.

Him = అతనియొక్క.

Into = లోపలికి.

Time = సమయము.

Has = కలిగఉండు.

Look = చూచు.

Two = రెండు.

More = ఎక్కువ.


Class :3,4,5
14వ రోజు 

Q) నిజాయితీ గల ఆవు కథ లోని కీలక పదాలను గుర్తించి ' సున్నా ' చుట్టండి. చదువుతూ 5 సార్లు  మీ నోటు పుస్తకం లో రాయండి. 

Q) Identify and circle the key words in the story 'An Honest cow'. Read and write the key words 5 times in your note book.


💎 నేటి ఆణిముత్యం 

మరణమునకైన సిద్ధమై వెరవకుండ
ప్రసవ వేదన నెంతొ నిబ్బరము తోడ
తాను భరియించి బిడ్డకు ప్రాణమిచ్చు;
తల్లి మించిన మరియొకదైవ మెవరు?

భావము :

మరణ భయం లేకుండా ప్రసవ వేదన ధైర్యంగా భరించి బిడ్డకు ప్రాణమిచ్చే తల్లి కంటే మరో దైవం లేదు.


🤠 నేటి సామెత 

అమ్మ కడుపు చూస్తుంది - భార్య జేబు చూస్తుంది

తల్లి తన కొడుకు వచ్చాడంటే ఎప్పుడు తిన్నాడో, ఏం తిన్నాడో నని అతని కడుపుని, అనగా ఆకలిని గమనిస్తుంది. కాని అతని భార్య...... ఇంటికొచ్చిన భర్థను ఎంత డబ్బు తెచ్చాడని అతని జేబును చూస్తుంది అని అర్థము.

👬 నేటి చిన్నారి గీతం 

అమ్మ ప్రేమ

అమ్మజోల పాటలో
హాయి ఎంతో ఉన్నది
పండు వెన్నెల వన్నెల
కన్న మిక్కిలి మిన్నది
అమ్మ అనెడి పిలుపులో
ప్రేమామృతం ఉన్నది
ఇంటిల్లిపాదికిలను
జీవజలముల ఊటది
అమ్మ చేయు సేవలో
త్యాగ గుణములున్నవి
తల్లి చల్లని మదిలో
మల్లెల తావ్ఞలున్నవి
అమ్మ గోరు ముద్దలో
అనురాగాలున్నవి
ఆమె చేయు గోములో
ఆనందాలున్నవి
అమ్మ మెత్తని ఒడిలో
పూలపాన్నులున్నవి
ఆదమరిచి నిదురించే
అవకాశాలున్నవి
అమ్మ ప్రేమ మహిలో
వర్ణింపనెవరి తరం?
అమ్మ మనకు దేవ్ఞని
అమూల్యమైన వరం
నేటి జాతీయం

అమ్మలక్కలు

చుట్టు పక్కల పరిచయమున్న అడవాళ్ళు. ("'అమ్మ"'లు + "'అక్క"'లు) అమ్మలక్కలంతా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు.

🤘నేటి సుభాషితం

ఇతరులలోని మంచిని చూడడం వల్ల మన సద్గుణాలు వికాసం పొందుతాయి.

🎯DAY-14🎯

📒WE LOVE READING📒

🦉A WISE OLD OWL🦉

💁‍♀️There was an old owl who lived in an oak tree. Every day, he observed incidents that occurred around him.

Yesterday, he watched as a young boy helped an old man carry a heavy basket. Today, he saw a young girl shouting at her mother. The more he saw, the less he spoke.

As the days went on, he spoke less but heard more. The old owl heard people talking and telling stories.

He heard a woman saying an elephant jumped over a fence. He heard a man saying that he had never made a mistake.

The old owl had seen and heard what happened to people. There were some who became better, some who became worse. But the old owl in the tree had become wiser, each and every day.

🔮The Moral : Be more observant. Talk less and listen more. This will make us wise.
✍🏼 నేటి కథ 

"అమ్మ చెప్పిన మాట"

"పెద్దలమాట, చద్దిమూట అని సామెత. పెద్దవాళ్ళు తమపై ఆంక్షలు ఎందుకు విధిస్తారో తెలీక, చిన్నపిల్లలు ఎప్పుడూ వాటిని అతిక్రమించి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారు; తమ స్వతంత్రాన్ని తల్లిదండ్రులు హరిస్తున్నారని భావిస్తారు. అలాగే అనుకొని తల్లిమాటను నిర్లక్ష్యం చేసిన పిచ్చుక పిల్ల, చివరికి ఆ తల్లి ప్రేమభావనను అర్థంచేసుకోగలిగింది. ఎలాగో ఈ కథ "అమ్మ చెప్పిన మాట" లో చదవండి."

ఆ అడవి కూడా మేల్కొంది. అడవిలోని అన్ని ప్రాణులు మేతకు బయలుదేరి వెళ్ళాయి. జిరాఫీ కూడా ఆకులు, అలములు తింటూ తిరగసాగింది.

" హేయ్, జిరాఫీ అన్నా, నిన్నే, ఇటురా ” అనే మధురమైన పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. ఒక చెట్టుపైన గూడులోంచి చిన్న పిచ్చుక తనని పిలుస్తోంది. దాన్ని చూస్తే జిరాఫికి చాలా ముద్దొచ్చింది.

వెనక్కి వచ్చి " ఎందుకు పిలిచావు ” అని అడిగింది జిరాఫి.

"మా అమ్మ మేతకు వెళ్ళింది, నాకేమో చాలా బోర్ గా ఉంది. నాకు ఇంకా పూర్తిగా రెక్కలు రాలేదు కదా. అందుకని నన్ను అమ్మ ఎక్కడికి వెళ్ళనివ్వదు. మా ఫ్రెండ్ చింటూ ఈ చెట్టు కిందున్న తొర్రలో ఉంటాడు. వాడితో కాసేపు ఆడుకుంటాను. నన్ను అక్కడికి చేర్చవా” అని పిచ్చుక పిల్ల జిరాఫీని వేడుకుంది.

" మీ అమ్మ పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా" అంది జిరాఫీ.

"అమ్మో మా అమ్మకు తెలిస్తే అస్సలు వెళ్లనివ్వదు. ప్లీజ్ జిరాఫీ అన్నా” అంటూ పిచ్చుకపిల్ల ఏడ్చింది. పాపం పిచ్చుకను చూస్తే జాలేసింది జిరాఫీకి. పిచ్చుక పిల్లని దాని స్నేహితుని దగ్గరికి చేర్చి, మళ్ళీ ఆకులు అలములు తినడంలో మునిగిపోయింది జిరాఫీ.

కాసేపయ్యాక " రక్షించండి, రక్షించండి ” అంటూ అరుపులు వినిపించాయి జిరాఫీకి. చెట్టు మొదట్లో నక్క కనిపించింది. గబగబా చెట్టు దగ్గరికి చేరుకొనే లోపే నక్క నోటిలో పిచ్చుక పిల్లను కరచుకుంది. జిరాఫీ వేగంగా కదిలి దాని పొడువాటి కాలుతో నక్కని ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బకు నక్క నోటి నుంచి పిచ్చుక పిల్ల జారి క్రింద పడింది. నక్క పారిపోయింది.

పిచ్చుక పిల్లను తిరిగి జాగ్రత్తగా దాని గూట్లోకి చేరుస్తుండగా తల్లి పిచ్చుక వచ్చింది. వస్తూనే " ఏం జరిగింది.” అని కంగారుగా అడిగింది. జిరాఫీ జరిగిన సంగతంతా చెప్పింది. తల్లి మాట వినకుండా తను జిరాఫీ సహాయంతో కిందకు వెళ్ళినందుకు పిచ్చుకపిల్ల చాలా సిగ్గుపడింది. తల్లిని క్షమించమని కోరింది.

" నీవు చేసిన మేలు మరచిపోలేను” అంటూ జిరాఫీకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నది తల్లిపిచ్చుక, తన పిల్లను ప్రేమగా అదుముకుంటూ.
తెలుసు కుందాం

🟥మాత్రకి నొప్పి తగ్గేదేలా?, Tablet reduces Pain ..how?
🟩మనకు దెబ్బతగిలినా , ముళ్ళు గుచ్చుకున్న నొప్పి కలుగుతుంది ... వెంటనే నొప్పి తగ్గడానికి మాత్రలు , ఇంజెక్షన్లుతీసుకుంటాము . . మరి ఆ మాత్రలకు , మందులకు నొప్పిని తగ్గించే గుణము ఎలా వస్తుంది .
మన శరీరము నొప్పి కలిగిన ప్రదేశము లో 'ఫాటి యాసిడ్లు , ప్రోస్తా గ్లందిన్లు ' అనే రసాయనాలను విడుదల చేస్తాయి .. ఇవి రక్తప్రవాహం చేరి కండరాలను సంకోచింప చేయడం తో ఉష్ణోగ్రత పెరిగి శరీరానికి జ్వరము , భాదతో కూడిన నొప్పులుఏర్పడతాయి .

మనము తీసుకున్న మాత్రలు రక్తం లో చేరి ప్రోస్తాగ్లాండిన్లకు ఉత్పన్నం అయ్యే "సైక్లుక్షీ జేనేస్-2(CylcloxiGenes)"అనే ప్రోటీన్లకు అంటుకుపోయి ఆ రసాయన ఉత్పత్తికి ఆటంకం కల్పించడం తో నొప్పులకుమూలమైన గ్రాహకాలు కండరలనుండి విడిపోతాయి . ఆ విదంగా ఇలాంటి మాత్రలు నొప్పులకు కారణభూతమైనరసాయనాలను నాశనం చేయలేకపోయినా ... మెదకుకు చేరే భాధకు సంభందించిన సంకేతకాలను అక్కడకుచేరకుండా అడ్డుకుంటాయి ... తద్వారా శరీరానికి నొప్పుల వల్ల కలిగే బాధ తెలియదు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 14 : Students Summer Holidays Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0