Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 15 : Students Summer Holidays Activities

 Day - 15 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:15 Activities
Class: 1,2
15 వ రోజు 
To develop creativity skills

Q) Make a bullock cart/car/lorry with clay and dispaly it in your house.

తెలుగు:

Q) అక్షరాలలో తేడాను గుర్తిస్తూ పదాలను చదవండి. రాయండి.

కిటికి - కీటకం
గిలక - గీత
నిజం - నీడ
మిరప - మీగడ
చిలక - చీమ

English:

Q) Learn and write ' H ' words.

Hut           🛖

House      🏠

Hand        ✋

Hammer   🔨

Horse       🐎

Maths:

Q) Write the following numbers in Ascending order. ( Smallest to Biggest )

1) 8, 10, 4

2) 16, 12, 17

3) 29, 22, 27

4) 46, 70, 33

5) 57, 44, 76
ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Write = వ్రాయుట.

Go = వెళ్ళుట.

See = చూచుట.

New = క్రొత్త.

Sound = శబ్ధము.

Take = పట్టుకొను, తీసుకొను.

Only = మాత్రము.

Little = కొన్ని, చిన్న.

Work = పని.

Snow = మంచు.

Place = స్థలము.

Year = సంవత్సరం.

Live = నివసించు.

Me = నన్ను.

Back = వెనుక.
Class :3,4,5
15 వ రోజు 

Q) నిజాయితీ గల ఆవు కథను మీ సొంత మాటల్లో మీ నోటు పుస్తకం లో రాసి గ్రూప్ లో పోస్ట్ చేయండి.

Q ) Wrire the Story 'An Honest cow' in your own words in your note book and post in the group.


💎 నేటి ఆణిముత్యం 

తరువ దరువ బుట్టు దరువునందనలంబు
దరువదరువ బుట్టు దధి ఘృతంబు
తలపదలప బుట్టు తలపున తత్త్వంబు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం:
పూర్వకాలంలో అగ్గిపెట్టెలు లేనప్పుడు నిప్పు పుట్టించటానికి రెండు కర్రలను తీసుకుని వాటిని బాగా రుద్దేవారు. అడవిలో అలాగే దానంతటదే నిప్పు పుడుతుంది. దాన్ని దావానలం అంటారు. ఇప్పటికీ యఙయాగాదుల్లో నిప్పు రాజేయటానికి ప్రత్యేకమైన కర్రలనే వాడుతారు. వాటిని అరణి అంటారు. వాటిలోంచి వచ్చే నిప్పు రవ్వలను దూదిమీదకు వచ్చి మండేటట్టుగా చేసి యఙానికి వాడుతారు. 

అలా, ఒక కర్రతో మరోదాన్ని బాగా రుద్ది నిప్పు పుట్టిస్తాం, పెరుగుని బాగా చిలికి నెయ్యి వచ్చేట్టుగా చేస్తాం. అలా, మథనం చేసినప్పుడే వెన్న వస్తుంది. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను, చీజ్, విడివిడిగా ప్యాకెట్స్ లోదొరుకుతున్న ఈ కాలంలో అవన్నీ పాల ఉత్పాదనలేనని పిల్లలకు ప్రత్యేకంగా చెప్పవలసివస్తుంది. అదే విధంగా మనసులో కూడా మథనం జరిగినప్పుడే కొత్త ఆలోచనలు పుడతాయి. అందుకే విద్వత్తుల చర్చలను మేధో మథనం అంటారు. మనసులో వచ్చిన ఒక మంచి ఆధ్యాత్మిక ఆలోచనను మథించి మథించి చివరకు దాని సారాన్ని కనుగొనటం జరుగుతుంది. దాన్నే తత్త్వం అంటారు- ఒక ధర్మ సూక్ష్మం! 

అలా, మనసులో మెదిలే ఆలోచనలను సక్రమంగా ఒక పంథాలో సాగిస్తూ దాని సూక్ష్మంలోకి పోవటాన్ని ఙానయఙమంటారు.

🤘నేటి సుభాషితం

సరైన విద్యా విధానమే సమాజంలోని, దేశంలోని సమస్యలను పరిష్కరించగలదు. రేపటి భారతావనికి వివేకవంతులైన పౌరుల్ని అందించే బాధ్యత ఉపాధ్యాయులదే. - డా. సర్వేపల్లి రాధాకృష్ణన్.

👬 నేటి చిన్నారి గీతం 

కాకి కాకి గువ్వల కాకి

 కాకి కాకి గువ్వల కాకి - కాకి నాకు ఈకా ఇచ్చే
ఈకా తెచ్చీ దిబ్బకు ఇస్తే - దిబ్బా నాకూ ఎరువూ ఇచ్చె
ఎరువూ తెచ్చీ చేలో వేస్తే - చేను నాకు గడ్డీ ఇచ్చే
గడ్డీ తెచ్చీ ఆవుకు ఇస్తే  - ఆవూనాకూ పాలు ఇచ్చే
పాలు తెచ్చి పంతులు కిస్తే - పంతులు నాకూ పాఠం చెప్పే

🤠 నేటి సామెత 

అంధుడికి అద్దం చూపించినట్లు
కొంతమంది ఎంత వివరంగా విషయాన్నంతా చెప్పినా గ్రహించలేరు. అలాంటి వారి జ్ఞానాన్ని సూచించడానికి ఈ సామెత ఉపకరిస్తుంది. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఎంత శ్రమపడినా శ్రమను ఎదుటివారు గుర్తించక నిర్లిప్తంగా, నిరాసక్తంగా తోసివేసినప్పుడు కూడా ఈ సామెతను సందర్భానుసారం చెప్పటానికి ఉపయోగపడుతుంది. అంధుడికి ఎంత మాత్రమూ ఎదుటి వస్తువులు కనిపించక పోవటం సర్వసాధారణం. అటువంటిది అందాన్ని ఒకటికి పది సార్లు చూసుకోడానికి నేత్ర దృష్టి బాగా ఉన్నవారు ఉపయోగించే అద్దాన్ని అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన. 56 అంధుడికి అద్దం చూపించినట్లు

అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన..
🗣నేటి జాతీయం

ఈకలు పీకిన కోడి

కురూపిగా ఉండటం, అందహీనత, బలహీనత .కోడి ఈకలన్నీ పీకేస్తే చూడబుద్ధి కాదు. ఆ జ్వరం వచ్చిన నాటి నుంచి ఇదిగో ఇట్లా ఈకలు పీకిన కోడిలా అయ్యాడు' అంటారు.

🎯DAY-15🎯

📒WE LOVE READING📒

🥛A Glass of Milk🥛

💁‍♀️There once was a poor boy who spent his days going door-to-door selling newspapers to pay for school. One day, as he was walking his route, he started feeling low and weak. The poor boy was starving, so he decided to ask for food when he came to the next door.

The poor boy asked for food but was denied every time, until he reached the door of a girl. He asked for a glass of water, but seeing his poor state, the girl came back with a glass of milk. The boy asked how much he owed her for the milk, but she refused payment.

Years later, the girl, who was now a grown woman, fell sick. She went from doctor to doctor, but no one was able to cure her. Finally, she went to the best doctor in town.
The doctor spent months treating her until she was finally cured. Despite her happiness, she was afraid she couldn't afford to pay the bill. But, when the hospital handed her the bill, it read, 'Paid in full, with a glass of milk.'

🔮The Moral : No good deed goes unrewarded.

✍🏼 నేటి కథ 

దారి చూపిన దెయ్యాలబావి!

వేసవి వచ్చిందంటే చాలు రాజ్య సరిహద్దు గ్రామాల్లో ప్రజలను క్రూరమృగాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. జనం విన్నవించడంతో రాజ్యాధిపతైన రఘువర్మ వాటిని వేటాడాలనుకున్నారు. ప్రతి ఏడాదిలాగే ఆ సంవత్సరమూ దానికి ఏర్పాట్లు చేయమని పరివారాన్ని ఆదేశించాడు.
ప్రభూ! ఏటా వేట పేరున ఎన్నో కొన్ని మృగాలు మీ చేతిలో మరణిస్తున్నాయి. అయినా సమస్య అలాగే ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కొంటే బాగుంటుందని సూచన చేశాడు మంత్రి.
‘మొత్తం జంతువులన్నింటినీ వేటాడటమే శాశ్వత పరిష్కారమనేది నా అభిప్రాయం. ఈ సారి అడవుల్ని జల్లెడ పట్టేయాలి. ప్రజా సంక్షేమం కోసం ఈ పని తప్పదు’ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు రఘువర్మ. ‘ప్రభూ! రాజ్యంలో ప్రజల సంక్షేమం పర్యావరణంతో ముడిపడి ఉంటుంది. ప్రకృతిని పరిరక్షించుకుంటేనే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు’ అని వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేశాడు మంత్రి.
‘మంత్రి వర్యా! మానవులు మైదాన ప్రాంతంలో, క్రూర జంతువులు అడవుల్లో ఉండడం అనేది ప్రకృతి ధర్మం. క్రూర జంతువులు హద్దులు దాటి జనావాసాల్లోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం. ప్రజలను రక్షించాల్సిన బాధ్యత నా మీద ఉందిగా’ అని తన వాదనను వినిపించాడు రఘువర్మ.
మంత్రి ఇక చేసేది లేక రాజుతోపాటే వేటకు బయలుదేరాడు. గుర్రాల మీద చాలా దూరం వెళ్లాక ఒక గ్రామం వచ్చింది. అక్కడ కొంత మంది మహిళలు కుండలు పట్టుకుని నీటికోసం వెళుతూ కనిపించారు.
రఘువర్మ ఆగి గ్రామంలో మంచి నీటి సౌకర్యం గురించి ఆరా తీశాడు. రహదారి విస్తరణ, కలప కోసం చాలా చెట్లు నరికేశారు. చల్లని మా పల్లె వేడెక్కిపోయింది. అప్పటి నుంచి నీటి కొరత ప్రారంభమైంది. అందుకే దెయ్యాల బావి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం’ ఉసూరుమంటూ చెప్పింది ఓ మహిళ.
‘మరి ఆ దెయ్యాలబావి దగ్గరకు వెళ్లాలంటే మీకు భయమనిపించలేదా?’ అని మంత్రి ఆ స్త్రీని అడిగాడు. ‘నీటి కొరత మాలో తెగింపును తెచ్చింది’ ఆవేశంతో చెప్పింది ఇంకొక మహిళ. మీ ఐకమత్యం చూస్తుంటే ముచ్చటేస్తుందని ప్రశంసించాడు మంత్రి. ఇదే స్ఫూర్తితో మీ గ్రామంలో వన పెంపకం చేపట్టి సంరక్షించుకుంటే మీ కష్టాలు తీరిపోతాయి. ఈ విషయంలో రాజుగారి సహకారం సంపూర్ణంగా ఉంటుందని సలహా ఇచ్చాడు.
మహిళల కష్టాలను విని చలించిపోయిన రఘువర్మ తొందరలో నీటి కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు.
అనంతరం మంత్రిని తనతోపాటు వెనుదిరగమని చెప్పాడు. మంత్రి ఆశ్చర్యపోయాడు. ‘ప్రభూ! మీ నిర్ణయంలో దాగిన రహస్యం ఏమిటో సెలవీయగలరా?’ టక్కున  అడిగాడు. ‘ఈ మహిళల ద్వారా రెండు విషయాలు తెలుసుకున్నాను. అడవిలో నీటి కొరత కారణంగా వేసవిలో జంతువులు జనావాసాల మధ్యకు రావడం జరుగుతుందనేది ఒకటి. అడవిలోనే నీరు లభిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లే. ఇక మనుషులు వెళ్లని చోట మాత్రమే చెట్టు, చేమ వృద్ధి చెందుతున్నాయి. అక్కడ మాత్రమే నీటి నిల్వలు పుష్కలంగా ఉంటాయన్న నిజం రెండోది. అడవుల్లో చెట్టు, చేమ వృద్ధి  చెందితేనే క్రూరమృగాలకు నీటి కొరత ఉండదు. లేని దెయ్యాల భయంతో దెయ్యాల బావి చుట్టూ చిట్టడవి పెరిగినప్పుడు ఉన్న క్రూర మృగాల సంచారమే మనుషుల భయానికి కారణమై అడవిలో పచ్చదనం పరుచుకుంటోంది. జంతువులను వేటాడటం కన్నా.. వాటి సంరక్షణే సమస్యకు అసలు పరిష్కారం. అందుకే వేటకు వెళ్లకుండా వెనుదిరుగుతున్నాం’ అని తన మనసులో మాట చెప్పాడు రఘువర్మ.
‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు మీరు’ అంటూ రఘువర్మను పొగడ్తలతో ముంచెత్తాడు మంత్రి.
తెలుసు కుందాం

🟥"శూన్యం లో మంట ఎలా ప్రవర్తిస్తుంది ?, How fire behaves in the Space?"

🟩గురుత్వాకర్షణ శక్తి శూన్యం గా ఉన్న ప్రదేశం లో మంటలు వ్యాపించవు ... సరికదా ఆరిపోవును . మంట నుంచి కాంతి , ఉష్ణము , కార్బండై ఆక్శైడ్(carbondiaxide) ,నీటి ఆవిరి వెలువడుతాయి . ఉష్ణం వల్ల కలిగిన దహన చర్య తో కార్బండై ఆక్శైడ్ , నీటి ఆవిరి వ్యాకొచిస్తాయి . . . దాంతో వాటి సాంద్రత తగీ అవే తేలికై మంట పైభాగం నుంచి వాతావరణం లోకి చేరుకుంటాయి. ఈ ప్రక్రియలో ప్లవనము(buoyancy), సంవహనము (convection) అనే భౌతిక చర్యలు ఉంటాయి . ఆ విధంగా మంట లోపలి భాగం లో ఖాళీ ఏర్పడటం తో ఆ ప్రదేశానికి వాతావరణం లోని ఆక్షిజన్ తో కూడుకున్న గాలి చేరుకుంటుంది . ఆక్షిజన్ వల్ల మంట తీవ్రత మరీ ఉద్రుతమవుతుంది . . కాని సాన్ద్రతల తేడాల వల్ల తేలికైన పదార్ధాలు పైకి పోవడానికి గురుత్వశక్తి తోడ్పాటు అవసరము . కాబట్టి శూన్య గురుత్వం ఉన్నా ప్రదేశం లో ప్లవన, సంవహన చర్యలు జరుగవు ...
ఫలితంగా వేడెక్కి వ్యాకోచించిన కార్బండై ఆక్శైడ్ , నీటిఆవిరి మంట పైభాగం నుంచి వాతావరణం లోకి పోకుండా మంట చుట్టూ గుమికూడడం వల్ల వాతావరణం లోని ఆక్షిజన్ తో కూడిన గాలి మంటను చేరుకోలేదు ... దాంతో దహన చర్య సరిగా జరగకపోవడం తో చివరకు మంట కాస్తా ఆరిపోవును . అతి తక్కువగా గురుత్వ శక్తి ఉండే ప్రదేశాలలో మంట ఒక చిన్న గోళాకార రూపం లోకి కుచించికొని పోవడం తో వంట వ్యాపించదు . అందువల్లే రోదసీలో పయనించే అంతరిక్ష నౌక లో అగ్ని ప్రమాదాలు సంభవించిన అవి నలుమూలలకు వ్యాపించవు .
SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 15 : Students Summer Holidays Activities"

Post a Comment