Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 18 : Students Summer Holidays Activities

 Day - 18 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:18 Activities
Class: 1,2

18 వ రోజు 

To develop socio - emotional and presentation skills

Q) Prepare family tree with their photos.

తెలుగు:

Q) కింది అక్షరాలకు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం చేర్చి రాయండి. చదవండి.

క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, క్ష

English:

Q) Write the missing letters.

I - e  c r - a m    🍦

I - k                🔏

I r - n               🧇

I n - e c t           🐝

I s l - n d            🏝️

Maths:

Q) Write the following numbers in Descending order. ( Biggest  to Smallest )

1) 87, 99, 83

2) 615, 611, 616

3) 828, 621, 726

4) 505, 709, 402

5) 856, 853, 858

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Want =లేకయుండు, కోరిక.

Show = చూపుట.

Also = కూడా.

Around = చుట్టూ.

Form = రూపము, నమూనా.

Three = మూడు.

Small = చిన్న.

Set =వర్గము, వరుస.

Put = ఉంచుట

End = చివరి.

Does = చేయు.

Another =మరియొక.

Well = మంచి, బావి.

Large = పెద్ద, గొప్ప.

Must = తప్పనిసరిClass :3,4,5
18 వ రోజు 

Q) కుందేలు మరియు తాబేలు కథను మీ సొంత మాటల్లో మీ నోటు పుస్తకం లో రాసి గ్రూప్ లో పోస్ట్ చేయండి.

Q ) Wrire the Story  'The hare and the tortoise' in your own words in your note book and post in the group.
💎నేటి ఆణిముత్యం

వలవదు క్రూరసంగతి యవశ్యమొకప్పుడు సేయబడ్డచో
కొలదియేకాని యెక్కువలు గూడవు తమ్ములపాకులోపలం
గలసినసున్న మించుకయకాక మరించుక యెక్కువైనచో
నలుగడజుర్రుచుర్రుమని నాలుకపొక్కకయున్నెభాస్కరా

భావం:

చెడ్డవారితో స్నేహముకూడదు. తప్పనిసరైతే అంటీ అంటనట్లుండాలి. కానిచో తాంబూలములో సున్నమెక్కువైనట్లు  బాధించును.
నేటి సుభాషితం

అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చెయ్యకూడదు.

👬 నేటి చిన్నారి గీతం

వానలు వచ్చె చెల్లప్పా!

వానలు వచ్చె చెల్లప్పా!
వరదలు వచ్చె చెల్లప్పా!
చెరువులు నిండె చెల్లప్పా!
కప్పలు బెకబెక చెల్లప్పా!
ఆటలు ఆడె చెల్లప్పా!
పాటలు పాడె చెల్లప్పా!
బడికి డుమ్మా చెల్లాప్పా!
అమ్మ తిట్టె చెల్లప్పా!
నాన్న కసిరె చెల్లప్పా!
పంతులు కొట్టె చెల్లప్పా!
లెంపలు వేసుకుని చెల్లప్పా!
పలక బలపం పట్టి చెల్లప్పా!
బడికి పోదాం చెల్లప్పా!
బుద్ధిగ చదివె చెల్లప్పా!
పాఠాలు చదువుదాం చెల్లప్పా!
పెద్ద చదువులు చదువుదాం చెల్లాప్పా!
గొప్ప ఉద్యోగాలు చేద్దాం చెల్లాప్పా!
అందరికి ఆనందం అందిద్దాం చెల్లప్పా!

🤠 నేటి సామెత 

లంకలో హరి శబ్దం

హరి నామం లంకలో వినపడకూడదు అని రావణాసురుడు శాసించాడు. అందువలన 'హరి' అనే శబ్దం (పేరును బయటకు అనడం) లంకలో వినపడదు. అయితే తలవకూడని వ్యక్తి గురించి ఎవరైనా ఎక్కడైనా తలచుకుంటే దానిని 'లంకలో హరి శబ్దం'లాగ అంటాం.

🗣నేటి జాతీయం

ఈతాకిచ్చి తాటాకు గుంజినట్టు

మోసకారి వ్యవహారం మాయమాటలు చెప్పి ఎదుటివారికి ఏ కొద్దిగానో ఇచ్చి వారి నుంచి ఎక్కువ కాజేయటం,

🎯DAY-18🎯

📒WE LOVE READING📒

🐜THE ANT and the GRASSHOPPER🦗

💁‍♀️తెల్లారిన తర్వాత సాంబయ్య రెట్టింపు డబ్బులు పొందాడు. గురవయ్య సంచిలో వంద వరహాలు ప్రత్యక్షమయ్యాయి. సాంబయ్య అలవాటు ప్రకారం అడవికి పోతూ గురవయ్యను పిలిచాడు. బద్దకస్తుడైన గురవయ్య తాను రాలేనని చెప్పి ఇంటి దగ్గరే ఉండిపోయాడు. కష్టార్జితం కాని డబ్బుకు వృథా ఖర్చులెక్కువ అన్న చందాన విందులు, వినోదాలతో కాలక్షేపం చేయడం ప్రారంభించాడు.

రోజులు గడుస్తున్న కొద్దీ మరింత బద్ధకం పెరిగిన గురవయ్య జబ్బులపాలయ్యాడు. మహిమగల సంచి రోజువారీ ఇచ్చే వరహాలు మందుల ఖర్చులకూ సరిపోవడం లేదు. కదల్లేని స్థితికి రావడంతో వరహాలు తీయలేక ఆదాయం తగ్గింది.

తన దురాశే కొంపముంచిందని తెలుసుకుని పశ్చాత్తాప పడి మంచంలోనే ఉండి, వనదేవతను స్మరించాడు. వెంటనే వనదేవత ప్రత్యక్షమైంది. ‘పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకోటి లేదు. ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించు. షరతులు లేని సాంబయ్య దగ్గర ఉన్నలాంటి సంచిని ప్రసాదిస్తున్నాను’ అంటూ గురవయ్యను ఆరోగ్యవంతుడిగా చేసి మాయమైంది దేవత. అప్పటి నుంచి అడవిని కంటికిరెప్పలా చూసుకుంటూ సాంబయ్యలాగే కష్టపడి బతకడం నేర్చుకున్నాడు గురవయ్య.

తెలుసు కుందాం

🟥ఈగలు , చిన్న పురుగులు నున్నని గోడల పైన , గాజు పలకల పైన జారిపడిపోకుండా ఎలా నడవగలుగుతాయి ?

🟩కారణము : వాటి పాదాల కింద ఉండే అసంఖ్యాకమైన , బిరుసెక్కిన అతిచిన్న , సన్నని వెంట్రుకలే . పైకి నున్నగా కనిపించే ఇంటి గోడలు , పైకప్పుల కిందిభాగాలు , గాజు తలుపులు నిజానికి మన కంటికి కనిపించని అతి సూక్ష్మ మైన ఎగుడు దిగుడులు , బీటల మయమై ఉంటాయి . ఇవి ఈగలు , చిన్న పురుగుల పాదాలకింద ఉండే అతి సూక్ష్మమైన వెంత్రుకులకు కావలసిన పట్టు నిస్తాయి. .. అంతే కాకుండా ఆ జీవుల పదాల చివరి భాగాలలో ఉండే గొల్లలాంటి నిర్మాణము ఆయా ఉపరితలాలపై అస్తవ్యస్తం గా ఉండే అతిస్వల్పమైన ప్రదేశాలను గట్టిగా పట్టుకోవడం తో అవి జారకుండా ముందుకు పోగలుగుతాయి . కొన్ని పురుగులు నడుస్తున్నప్పుడు వాటి పదాల్లో కలిగే వత్తిడి వల్ల ఓ రకమైన జిగురులాంటి ద్రవం విడుదల అవుతుంది . వెంట్రుకల గుండా స్రవించే ఆ ద్రవం వల్ల కుడా అవి పడిపోకుండా నడవగలుగు తాయి .

✍🏼 నేటి కథ 
ఆశకూ ఓ హద్దుండాలి!

రామాపురం అనే గ్రామంలో సాంబయ్య, గురవయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. సాంబయ్యది కష్టపడే మనస్తత్వం. అడవికి పోయి ఎండు పుల్లలు ఏరుకుని వచ్చి గ్రామంలో అమ్మి బతుకుతుండేవాడు. బద్ధకస్తుడైన గురవయ్య మాత్రం పనీపాటా లేకుండా అప్పులు చేసి బతికేయడానికి ప్రయత్నిస్తుండేవాడు.

అందరూ ఈసడించుకోవడంతో సాంబయ్యను ఆశ్రయించి బతుకు దారి చూపమని వేడుకున్నాడు. అప్పుచేసి పప్పు కూడు తినడం శ్రేయస్కరం కాదు. శ్రమించేతత్వం అలవరుచుకునే వారికి జీవితం ఎప్పుడూ బంగారు బాట అవుతుందని ఓదారుస్తూ.. తనతోపాటు అడవిని నమ్ముకుంటే చాలని సూచన చేశాడు.
రోజుకారోజే తీసెయ్యాలి. అలా తీయకపోతే మర్నాటికి వంద వరహాలు రావు. అంతేకాదు.. ఆ సంచిని ఇతరులు తాకితే దాని మహిమ పోతుందని కొన్ని షరతులు పెట్టింది వనదేవత.

ఆ.. ఏముందిలే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. హాయిగా సుఖపడొచ్చు అనుకున్నాడు గురవయ్య. వంద వరహాలిచ్చే సంచిని తీసుకున్నాడు. దారిలో నడుస్తూ ఎండుపుల్లలు సేకరిస్తున్న సాంబయ్యను చూసి బిగ్గరగా నవ్వాడు గురవయ్య. సుఖపడే దారి తెలియని నిన్ను చూస్తే నవ్వొస్తోందని దెప్పిపొడిచాడు.

పని ఆరోగ్యాన్నిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.. అని చెప్పి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు సాంబయ్య. చాలాదూరం నడిచాక ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. సాయంత్రం కట్టెలమ్మగా వచ్చిన డబ్బులను మహిమగల సంచిలో వేసి నిశ్చింతగా నిద్రపోయాడు సాంబయ్య. ఎవరి కంటా పడకుండా సంచిని పెట్టెలో భద్రపరిచాడు గురవయ్య.
తెల్లారిన తర్వాత సాంబయ్య రెట్టింపు డబ్బులు పొందాడు. గురవయ్య సంచిలో వంద వరహాలు ప్రత్యక్షమయ్యాయి. సాంబయ్య అలవాటు ప్రకారం అడవికి పోతూ గురవయ్యను పిలిచాడు. బద్దకస్తుడైన గురవయ్య తాను రాలేనని చెప్పి ఇంటి దగ్గరే ఉండిపోయాడు. కష్టార్జితం కాని డబ్బుకు వృథా ఖర్చులెక్కువ అన్న చందాన విందులు, వినోదాలతో కాలక్షేపం చేయడం ప్రారంభించాడు.

రోజులు గడుస్తున్న కొద్దీ మరింత బద్ధకం పెరిగిన గురవయ్య జబ్బులపాలయ్యాడు. మహిమగల సంచి రోజువారీ ఇచ్చే వరహాలు మందుల ఖర్చులకూ సరిపోవడం లేదు. కదల్లేని స్థితికి రావడంతో వరహాలు తీయలేక ఆదాయం తగ్గింది.

తన దురాశే కొంపముంచిందని తెలుసుకుని పశ్చాత్తాప పడి మంచంలోనే ఉండి, వనదేవతను స్మరించాడు. వెంటనే వనదేవత ప్రత్యక్షమైంది. ‘పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకోటి లేదు. ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించు. షరతులు లేని సాంబయ్య దగ్గర ఉన్నలాంటి సంచిని ప్రసాదిస్తున్నాను’ అంటూ గురవయ్యను ఆరోగ్యవంతుడిగా చేసి మాయమైంది దేవత. అప్పటి నుంచి అడవిని కంటికిరెప్పలా చూసుకుంటూ సాంబయ్యలాగే కష్టపడి బతకడం నేర్చుకున్నాడు గురవయ్య.

తెలుసు కుందాం

🟥ఈగలు , చిన్న పురుగులు నున్నని గోడల పైన , గాజు పలకల పైన జారిపడిపోకుండా ఎలా నడవగలుగుతాయి ?

🟩కారణము : వాటి పాదాల కింద ఉండే అసంఖ్యాకమైన , బిరుసెక్కిన అతిచిన్న , సన్నని వెంట్రుకలే . పైకి నున్నగా కనిపించే ఇంటి గోడలు , పైకప్పుల కిందిభాగాలు , గాజు తలుపులు నిజానికి మన కంటికి కనిపించని అతి సూక్ష్మ మైన ఎగుడు దిగుడులు , బీటల మయమై ఉంటాయి . ఇవి ఈగలు , చిన్న పురుగుల పాదాలకింద ఉండే అతి సూక్ష్మమైన వెంత్రుకులకు కావలసిన పట్టు నిస్తాయి. .. అంతే కాకుండా ఆ జీవుల పదాల చివరి భాగాలలో ఉండే గొల్లలాంటి నిర్మాణము ఆయా ఉపరితలాలపై అస్తవ్యస్తం గా ఉండే అతిస్వల్పమైన ప్రదేశాలను గట్టిగా పట్టుకోవడం తో అవి జారకుండా ముందుకు పోగలుగుతాయి . కొన్ని పురుగులు నడుస్తున్నప్పుడు వాటి పదాల్లో కలిగే వత్తిడి వల్ల ఓ రకమైన జిగురులాంటి ద్రవం విడుదల అవుతుంది . వెంట్రుకల గుండా స్రవించే ఆ ద్రవం వల్ల కుడా అవి పడిపోకుండా నడవగలుగు తాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 18 : Students Summer Holidays Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0