Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 20 : Students Summer Holidays Activities

 Day - 20 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేస
వి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:20 Activities
Class: 1,2
20వ రోజు 

To develop locomotor and  management skills

Q) Water the plants in your garden 


తెలుగు:

Q) కింది ఖాళీలలో సరియైన అక్షరాన్ని రాయండి.

తు - కీ 

తూ - గ

బు - ద 

బూ - ద

రూ - యి

English:

Q) Write the missing letters.

J - g          🏺 

J - r           🫙

J o - e r       🃏  

J u - c e       🧃

J a - k - t     🧥

Maths:

Q) Write the Short form.

20 + 0 = 20

20 + 1 = 21

20 + 2 = .....

20 + 3 = .....

20 + 4 = .....

20 + 5 = .....

20 + 6 = .....

20 + 7 = .....

20 + 8 = .....

20 + 9 = .....

30 + 0 = .....

30 + 3 = .....

30 + 4 = .....

30 + 5 = .....

30 + 6 = .....

30 + 7 = .....

30 + 8 = .....

30 + 9 = .....

40 + 0 = .....

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Use = ఉపయోగం.

Move = కదులుట.

Try = ప్రయత్నించు.

Every = ప్రతి.

Near = దగ్గర.

Add = కూడుట, కలుపుట.

Food = ఆహారము.

Between = మధ్యన

Own = సొంతం.

Below = దిగువ.

Country = దేశం.

Planet = గ్రహం.

Last = చివర.

School = బడి.

Father = తండ్రి.









Class :3,4,5
20వ రోజు 

Q) ఒక చీమ మరియు పావురం కథ లోని కీలక పదాలను గుర్తించి ' సున్నా ' చుట్టండి. చదువుతూ 5 సార్లు  మీ నోటు పుస్తకం లో రాయండి. 

Q) Identify and circle the key words in the story  'The Ant and the Dove'. Read and write the key words 5 times in your note book.
👇👇👇



💎నేటి ఆణిముత్యం

మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత,
యెండిన యూళ్ల గోడెఱిగింప డెవ్వడు, బండిన యూళ్లకు బ్రభువులంత,
యితడు పేదయటంచు నెఱింగింప డెవ్వడు, గలవారి సిరులెన్నగలరు చాల,
దన యాలి చేష్టలదప్పెన్న డెవ్వడు బెఱకాంత తప్పెన్న బెద్దలంత,
యిట్టి దుష్టు కధికార మిచ్చినట్టి
ప్రభువు తప్పులటంచును బలుకవలెను
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

తాత్పర్యం:

భూములిచ్చే వారొక్కరైనా ఉండరు కానీ, ఆక్రమణకైతే సిద్ధం. బంజర్ల గోడు ఎవరికీ పట్టదు కానీ పండిన పంటలకైతే ముందుంటారు. పేదవారిని పట్టించుకొనే వారుండరు కానీ సంపన్నుల సిరులైతే కావాలి. తమ భార్యల తప్పులు పట్టవు కానీ, పరస్త్రీలపట్ల చింత ఒలకబోస్తారు. ఇలాంటి వారిని అందలమెక్కించే ముందు ప్రభువులే ఆలోచించాలి కదా స్వామీ!
🤘నేటి సుభాషితం

ఆలోచన చేసేటప్పుడు ఒకరు చెప్పేది వినకూడదు అనే అహంకారం పనికి రాదు.---చాణుక్యుడు

👬 నేటి చిన్నారి గీతం

గురువు మేలు

గడప లన్నింటిలోను ఏ గడప మేలు
మహ లక్ష్మి నర్థించు మా గడప మేలు
అరుగు లన్నింతిలోను ఏ అరుగు మేలు
అథితులందరుజేరు మా గడప మేలు
వీధు లన్నింటిలోన ఏ వీధి మేలు
విధ్వాంసులుండేటి మా వీధి మేలు
ఊరుల్లంతిలోనూ ఏ ఊరు మేలు
పాది పంటలు విరసిల్లు మా ఊరు మేలు
గురువు లందరిలో ఏ గురువు మేలు
వేదసారము తెల్పు మా గురువు మేలు
🤠 నేటి సామెత 

రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరువ తగునా?

రోట్లో తల పెట్టితే రోకటి పోటుకు సిద్ద పడి నట్లే. అందు చేత భయ పడ కూడదు. ఏదైనా పని ప్రారంబించేటప్పుడు దాని పర్వవసానంగా వచ్చే కష్టాలకు వెరవ కూడదు. ఆ సందర్భంలో ఈ సామెత చెప్తారు.

🗣నేటి జాతీయం

ఉంటే లిక్కి పోతే కొడవలి

రాతకోత లేవీ లేకుండా, మరేసాక్ష్యాలు లేకుండా ఇచ్చిపుచ్చుకోవటాలు.తక్కువ ఇచ్చి ఎక్కువ మొత్తాన్ని దబాయించి తీసుకోటం.కొడవలి అరిగి చిన్నదైనప్పుడు లిక్కి అంటారు. ఓ వ్యక్తి ఓ సారి తన లిక్కిని ఎదుటివారు అడిగినప్పుడు ఇచ్చాడట. ఆ తీసుకొన్న వారు ఆ లిక్కిని ఎక్కడో పారేశారట. అప్పుడు లిక్కి ఇచ్చిన వ్యక్తి ఆ విషయాన్ని తెలుసుకొని తన కొడవలిని తనకు ఇమ్మన్నాడట. అదేమిటయ్యా నువ్విచ్చింది లిక్కి కదా, కొడవలిని అడుగుతావేమిటి అనంటే నేనిచ్చింది కొడవలే అని తగాదాకు దిగితే తీసుకొన్న వ్యక్తి లిక్కి పోయింది కనుక వాస్తవమేమిటో రుజువు చెయ్యలేక కొత్త కొడవలి కొనిచ్చాడట.

🎯DAY-20🎯

📒WE LOVE READING📒

The Donkey Trapped In His Own Trick


 A villager had a donkey. He earned his living by transporting goods from place to place on that donkey. One early morning, he loaded the donkey with salt and set off to the town. A stream ran across his way to the market. As the donkey walked through the stream it slipped and fell down. A good deal of salt was washed away and the donkey felt light. The donkey thought it was quite a good trick to make the load light.

Next morning, the man again loaded it with salt. The donkey played the same trick and got light. The master saw through the game and made up his mind to teach the donkey a good lesson. Now, on the third day he put a bale of cotton on the donkey. The silly animal tried the same trick once more. Soaked with water, the cotton load became much heavier than when it was dry.

🔮Moral: Do not play foul Games

✍🏼 నేటి కథ 

నా మాటే శాసనం..!

హంసానందిని రాజ్యాన్ని పరిపాలించే చిత్రసేన మహారాజుకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది. తన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఒక నెల రోజుల పాటు మారువేషంలో ఒంటరిగా రాజ్య పర్యటన చేయాలని అనుకున్నాడు. తాను వచ్చేంత వరకు రాజ్యపాలన చూడమని మంత్రిని ఒప్పించి గుర్రాల వ్యాపారి వేషంతో అర్ధరాత్రి ఎవరి కంటాపడకుండా అంతఃపురాన్ని విడిచి ఒంటరిగా వెళ్లాడు. ఇలా మహారాజు మారువేషంలో చాలా ఊర్లు తిరిగాడు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూశాడు. అధికారుల అవినీతినీ గమనించాడు.
ఒక రోజు ఉదయానికి రామాపురం అనే గ్రామానికి చేరుకున్నాడు. ధర్మవేదిక దగ్గర చాలా మంది గుమిగూడారు. వాళ్లను చూసి తాను కూడా అక్కడకు వెళ్లాడు. వేదిక మీద ధర్మాధికారి కూర్చున్నాడు. ‘ఈ రోజు సమస్య చెప్పండి’ అన్నాడు అధికారి. జనాల మధ్య నుంచి గోపయ్య ధర్మ వేదిక దగ్గరకు వచ్చి తన సమస్యను చెప్పాడు. ‘మా నాన్న గుర్రాల వ్యాపారం చేసేవారు. నేను పుట్టినప్పుడు మాకు రెండు గుర్రాలుండేవి. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు పుట్టారు. మా ఆస్తి పంపకాల నాటికి గుర్రాల సంఖ్య వందకు చేరింది. మా నాన్న మా ముగ్గురికి తలా ముప్ఫై గుర్రాలు పంచేసి, మిగిలిన పది గుర్రాలు నాకు అదనంగా ఇచ్చాడు’
నీకే ఎందుకు ఎక్కువ ఇచ్చాడు’ ప్రశ్నించాడు అధికారి. ‘నేను మా నాన్నను అడగలేదు. నేను పెద్దోడినని, నాన్నకు వ్యాపారంలో సహకరించి, గుర్రాల సంఖ్య పెంచినందుకు ఇచ్చాడు’ అని చెప్పాడు గోపయ్య.
‘ఇది అన్యాయం. తండ్రి ఆస్తి మీద మా ముగ్గురికి సమాన హక్కు ఉండాలి. కాబట్టి ఆ పది గుర్రాల్లోనూ మాకు వాటా కావాలి’ అన్నారు గోపయ్య తమ్ముళ్లు. ‘నిజమే కదా!’ అన్నాడు అధికారి. ‘అయ్యా! గుర్రాల పంపకం రోజున మా తమ్ముళ్ల అంగీకారంతోనే మా నాన్న ఇచ్చారు. నెల రోజుల కిందటే ఆయన చనిపోయారు. ఇప్పుడు ఇలా బెదిరించి గుర్రాలను తీసుకెళ్లడం న్యాయమా?’ అడిగాడు గోపయ్య.
ముగ్గురూ వారి వాదనలు వినిపించారు. ఇదంతా ఆసక్తిగా గమనిస్తున్న మహారాజుకు ముగ్గురి వాదనల్లోనూ న్యాయం ఉందనిపించింది. తీర్పు ఎలా చెబుతాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ధర్మాధికారి కొద్దిసేపు ఆలోచించి తీర్పు రేపు చెబుతాను అని చెప్పి వెళ్లిపోయాడు.
రోజుకు రెండు, మూడు గ్రామాలు పర్యటించే మహారాజు ఈ తీర్పేంటో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ రోజు అక్కడే బస చేశాడు. మరుసటి రోజు ధర్మవేదిక దగ్గర పంచాయతీ ప్రారంభమైంది. ధర్మాధికారి తీర్పు చదవడం ప్రారంభించారు.
‘గోపయ్య వ్యాపారంలో అడుగుపెట్టి తండ్రికి సహకరించే నాటికి వారి ఆస్తి ముప్పై గుర్రాలు. రెండో కొడుకు వ్యాపారం ప్రారంభించే నాటికి వారి గుర్రాలు అరవైకి చేరాయి. చివరి కొడుకు తండ్రికి సహకరించే నాటికి గుర్రాల సంఖ్య డెబ్బయ్‌. పంపకం నాటికి వంద అని నా విచారణలో తెలిసింది. ముగ్గురు సోదరులు అవునని ఒప్పుకొన్నారు.
‘తండ్రి ఆస్తిలో కొడుకులకు సమాన వాటాలు ఇవ్వడమే న్యాయం. గోపయ్య వ్యాపారంలోకి రావడానికి ముందున్న ముప్పై గుర్రాల్లో తలా పది గుర్రాలు తీసుకోవాలి. చిన్న కొడుకు వ్యాపారం ఆరంభించిన నాటి నుంచి పంపకాల వరకు సంపాదించిన ముప్పై గుర్రాల్లో తలా పది గుర్రాలు తీసుకోవాలి. మిగిలిన గుర్రాలు వ్యాపారంలో వారి వారి సామర్థ్యాన్ని బట్టి సంపాదించారు కాబట్టి అవి వారికే చెందుతాయి. గోపయ్యకు ఉమ్మడి ఇరవై గుర్రాలతో పాటు తాను సంపాదించిన ముప్పై గుర్రాలు, పెద్ద సోదరుడితో కలిసి సంపాదించిన పది గుర్రాల్లో అయిదు ఇవ్వాలి. ఇదే నా తీర్పు’ అని చెప్పాడు ధర్మాధికారి.
గోపయ్యకు యాభై అయిదు, రెండో వాడికి ఇరవై అయిదు. చివరి వాడికి ఇరవై గుర్రాలు వచ్చినట్లుగా అందరూ లెక్కలు వేశారు. గోపయ్య సోదరులు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ తాము కోల్పోయిన గుర్రాలను తలచుకుని బాధపడుతున్నారు. తనకు అదనంగా వచ్చిన పదిహేను గుర్రాలు తన సోదరులకే ఇవ్వమని తమ్ముళ్ల పరిస్థితికి జాలి పడి గోపయ్య ధర్మాధికారితో చెప్పాడు. ‘నా మాటే శాసనం. నా తీర్పు పాటించి తీరాలంతే’ అని ధర్మాధికారి ఖరాఖండిగా చెప్పేశాడు.
తండ్రి నిర్ణయాన్ని అత్యాశతో అవమానించి, గోపయ్యను పంచాయతీకి తీసుకువచ్చిన సోదరులిద్దరికి తగిన శిక్ష పడిందని ప్రజలు సంతోషించారు. మహారాజు ధర్మాధికారిని మనసులోనే అభినందించాడు. పర్యటన పూర్తైన తర్వాత ఆయన్ను రాజదర్బారుకు పిలిపించుకుని సత్కరించాడు. చిత్రసేన మహారాజు ధర్మాధికారిని తన న్యాయసలహాదారుగా నియమించాడు.
తెలుసు కుందాం

🟥How @ sign originated?, @ గుర్తు ఎలా ఆవిర్భవించింది?

🟥మెయిల్ ఎకౌంట్లని తెలియజేయడానికి వాడే @ గు ర్తు . 1885 వ సంవత్సరము నుండే వాడుకలో ఉన్నది . అప్పటిలో ఎకౌంట్ అవసరాలకోసం at the rate of అనే పదాన్ని సూచించడానికి దీన్ని వాడేవారు . ఆ తర్వాత కాలములో 1971 వ సంవత్సరములో కంప్యూటర్ నెట్ వర్క్ అడ్రస్ లకు మధ్య @ సింబల్ సెపరేటర్ మాదిరి గా వాడడం మొదలైనది . 1885 లో ఈ సింబల్ ని కీ బోర్డ్ లో " అమెరికన్‌ అండర్ వుడ్ (American Underwood)" మొదటిగా ప్రవేశపెట్టినది . . . కొంతకాలము కనుమరుగై 1971 లో " రేమాండ్ టోమిలిసన్‌(Raymond Tomlinson )‌ ఈ మెయిల్ మెసేజ్ లో నేచురల్ డివిజన్‌(Natural Division) గా వాడినారు . ఒక్కోక్క దేశము లో @ ని ఒక్కోక పేరుతో పలుకుతారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 20 : Students Summer Holidays Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0