Day - 23 : Students Summer Holidays Activities
Day - 23 : Students Summer Holidays Activities
Summer Holidays Activities - - Summer vacation- summer activities
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు వేస
వి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:23 Activities
Class: 1,2
23 వ రోజు
Class: 1,2
23 వ రోజు
To distinguish the sizes.
Q) Collect the leaves and arrange them from small to big and big to small.
తెలుగు:
Q) కింది పదాలలో అవసరమైన చోట ' కొమ్ము దీర్ఘం ' ఉంచి రాయండి. చదవండి.
1. తనీగ: ..........
2. కతురు: ..........
3. గడు: .........
4. యరియా: .........
5. పజారి: .........
English:
Q) Learn and write ' L ' words.
Lion 🦁
Lamp 🪔
Lock 🔒
Lips 👄
Ladder 🪜
Maths:
Q) Write the Short form.
80 + 0 = 80
80 + 1 = 81
80 + 2 = .....
80 + 3 = .....
80 + 4 = .....
80 + 5 = .....
80 + 6 = .....
80 + 7 = .....
80 + 8 = .....
80 + 9 = .....
90 + 0 = .....
90 + 1 = .....
90 + 2 = .....
90 + 3 = .....
90 + 4 = .....
90 + 5 = .....
90 + 6 = .....
90 + 7 = .....
90 + 8 = .....
90 + 9 = .....
100 + 0 + 0 = .....
ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు
Both = రెండూనూ.
Paper = కాగితం.
Together = కలసిమెలసి.
Got = పొందు.
Group = సమూహము.
Often = తరచుగా.
Run = పరుగెత్తు.
Important = ముఖ్యమైన.
Until = అంత వరకు
Children = పిల్లలు.
Side = ప్రక్కన.
Feet = పాదము, అడుగు.
Car = కారు.
Mile = మైలు.
Night = రాత్రి.
💎నేటి ఆణిముత్యం
తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా
చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై
గదుదెగ జూచుగా మఱుగగాగిన తైలము నీటిబొట్టుపై
బదునెడ నాక్షణం బెగసి భగ్గు మండకయున్నె భాస్కరా!!
తాత్పర్యం:
దుష్టులకు దూరముండడమే మంచిది. ఎందుకంటే, వారి గుణమే అంత. దుర్జనులని తెలిశాక ఏ మాత్రం వారికి నీతులు చెప్పే సాహసానికి పూనుకోకూడదు. ఎలాంటి హితవాక్యాలూ వారి చెవి కెక్కవు. పైగా, కోపంతో మంచిమాటలు చెప్పిన వారికే చెడు తలపెడతారు. బాగా కాగిన నూనె నీటిబిందువును ఎలాగైతే దహించి వేస్తుందో అలాగ!
🤘నేటి సుభాషితం
మెరిసేదంతా బంగారం కానట్లే, మధురంగా వినిపించేదంతా మంచిది కాకపోవచ్చు.
👬 నేటి చిన్నారి గీతం
గోరంత దీపం
గోరంత దీపం కొండంత వెలుగు
మాయింటి పాపాయి మా కంటి వెలుగు
వెచ్చని సూరీడు పగలంతా వెలుగు
చల్లని చేంద్రుడు రాత్రంతా వెలుగు
ముత్యమంతా పసుపు ముఖమంతా వెలుగు
ముత్తైదు కుంకుమా బ్రతుకంతా వెలుగు
గురువు మాట వింటె గుణమంత వెలుగు
మంచి చదువులు నీకు భవిషత్తు వెలుగు
🗣నేటి జాతీయం
ఉండనీడనిస్తే పండ మంచం అడిగినట్లు
కొద్దిగా సహాయం చేస్తే ఇంకా ఇంకా సహాయం చేయమని వెంబడి పడటం.కష్టాల్లో నుంచి బయటపడ్డ తర్వాత కూడా ఇంకా ఆ చేరదీసిన వారి దగ్గరే ఉంటూ వారికి ఇబ్బందులు కలుగచేయటం. అలాంటి వరినుద్దేశించి ఈ మాటను వాడుతారు.
🤠 నేటి సామెత
వస్తే కొండ పోతే వెంట్రుక
ఒక వెంట్రుకతో కొండను లాగడానికి ప్రయత్నించినప్పుడు వస్తే కొండ వస్తుంది, పోతే ఒక వెంట్రుక పోతుంది. చిన్న పెట్టుబడితో దాదాపుగా అసాధ్యమైనంత పెద్ద లాభం సంపాయించడానికి ఎవరైనా ప్రయత్నించినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు
✍🏼 నేటి కథ
పడవా.. పద పద!
‘స్వర్ణ సింధు’ అనే నదికి ఇరువైపులా సిరిపురం, జింకల మిట్ట అనే గ్రామాలున్నాయి. అన్ని సౌకర్యాలున్న పెద్ద ఊరు సిరిపురం. చిన్న చిన్న పల్లెల సముదాయం జింకల మిట్ట. ఆ పల్లెల ప్రజలు అనేక అవసరాల నిమిత్తం సిరిపురానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రాకపోకల్లో స్వర్ణ సింధు నదిని దాటించడానికి ఒకే ఒక పడవ ఉంది. ఆ పడవ నడిపే వాడి పేరు వరదయ్య.
ఒకరోజు సిరిపురం నుంచి జింకల మిట్టకు ఆఖరి ప్రయాణంలో పరిమితికి సరిపడే జనం చేరుకున్న తరువాత ఓ వృద్ధుడు కొడుకు సహాయంతో వచ్చాడు. అతడు తీవ్ర జ్వరంతో స్వయంగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు. అతడు సిరిపురంలోని వైద్యుడి దగ్గర పరీక్ష చేయించుకుని, మందులు తెచ్చుకున్నాడు. అతడు త్వరగా ఇంటికి వెళ్లి మందులు వేసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అదే విధంగా వైద్యుడి దగ్గర పరీక్షలు చేయించుకుని ఒక గర్భిణి తన తల్లి సహాయంతో వచ్చింది.
పడవా.. పద పద!
ఆ నలుగురిని పడవలోకి రానివ్వకుండా వరదయ్య అడ్డుకున్నాడు. కారణం రాజ శాసనం. పడవ ప్రమాదాలు నివారించడానికి పరిమితికి మించి జనంతో పడవ నడిపిన సరంగులకు వంద కొరడా దెబ్బల శిక్ష విధిస్తానని రాజుగారు శాసనం చేశారు.
రాజ శాసనం ప్రకారం వరదయ్య పడవకు నిపుణులు నిర్ణయించిన సంఖ్య ముప్ఫై. పడవలోకి ముప్ఫై మంది చేరుకున్న తరువాతే వరదయ్య ఆ నలుగుర్ని అడ్డుకున్నాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వృద్ధుడి, గర్భిణి దుస్థితి చూశాక పడవలో ఉన్న వారికి జాలి కలిగింది. కానీ ఎవరూ నోరు మెదపలేక పోయారు. జింకల మిట్టకు చెందిన ప్రవీణుడనే యువకుడు మాత్రం సహించలేక పోయాడు. విద్యాభ్యాసం ముగించుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.
అతడు పైకి లేచి వరదయ్య దగ్గరికి వచ్చి ‘ఆ నలుగురిని పడవలోకి అనుమతించవలసిందే. లేకుంటే నేను పడవ కదలనివ్వను. ఇదే ఆఖరి ప్రయాణం కాబట్టి పడవ మరోసారి వచ్చే అవకాశం లేదు. తెల్లవారే వరకూ ఇక్కడ వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. మనలో మానవత్వం లేదా?’ అన్నాడు ఆవేశంగా.
‘చట్టం మాటేమిటి? దేశంలోని ఏ చట్టాన్నైనా అతిక్రమించిన వారిని పట్టుకోవడానికి గూఢచారులు సంచరిస్తుంటారు. వారు ఏ క్షణంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ రూపంలోనైనా ప్రత్యక్షం కావచ్చు. వాళ్ల చేతుల్లో చిక్కి నన్ను కొరడా దెబ్బలు తినమంటావా?’’ అంటూ అశక్తతను తెలియజేశాడు వరదయ్య.
‘శాసనాన్ని ధిక్కరించడమంటే తిరుగుబాటు చెయ్యడమే, నీలో ఉన్న ఉడుకు నెత్తురు నాలో లేదు. ఇంత వాదనెందుకు పడవలోంచి ఓ నలుగురు దిగిపోతే ఆ నలుగుర్ని చేర్చుకోగలను’ అన్నాడు వరదయ్య.
పడవ నుంచి దిగిపోయి నది ఒడ్డున రాత్రంతా గడపడానికి ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే అక్కడ రాత్రి గడపటానికి ఎటువంటి సౌకర్యం లేదు. ముళ్లపొదలు పరచుకుని ఉన్న ప్రదేశం అది. పైగా చలి, చీకటి.
ప్రవీణుడు తన మాటల నైపుణ్యంతో పడవ దిగడానికి ఓ ముగ్గురు యువకుల్ని ఒప్పించగలిగాడు. తనతోపాటు నలుగురు పడవ దిగిపోవడంతో ఆ నలుగురికి చోటు లభించింది. పడవ వెళ్లిపోయింది.
ప్రవీణుడు ఎండు పుల్లలు తెచ్చి చలిమంట వేశాడు. మంచి కబుర్లతో ఆ ముగ్గురికి కాలక్షేపం అయ్యేలా చేశాడు. మరుసటి ఉదయం పడవ రావడంతో ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. నాలుగు రోజుల తర్వాత రాజు విజయ శేఖరుడి నుంచి ప్రవీణుడికి పిలుపు వచ్చింది. ప్రవీణుడితోపాటు పడవ దిగిన ముగ్గురిలో ఒకడు రాజుగారి గూఢచారి. అతడు పడవ దగ్గర జరిగిన సంఘటన గురించి సమస్తం రాజుకు వర్తమానం పంపాడు. దీంతో రాజుగారి నుంచి ప్రవీణుడికి ఆ పిలుపు వచ్చింది. రాజశాసనాన్ని ధిక్కరించినందుకు ప్రవీణుడికి శిక్ష తప్పదని అందరూ అనుకున్నారు.
కానీ ఆశ్చర్యకరంగా రాజు ప్రవీణుడిని రవాణా శాఖ పర్యవేక్షణాధికారిగా నియమించి సత్కరించాడు. దీనుల పట్ల జాలి, దయ ఉండి వారి తరఫున పోరాడగల ధైర్యం ఉన్నందుకు అతడికి ఆ పదవి దక్కింది. లోపాలతో ఉన్న ఆ చట్టానికి ఒక సవరణ చేశాడు. వృద్ధులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్థులకు ఎప్పుడూ ప్రథమ ప్రాధాన్యం ఉంటుందనేది ఆ సవరణ. ఆ చట్టం ప్రజలకు ఎంతో నచ్చింది.
తెలుసు కుందాం
🟥ఉదయము నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు . ఎందుకు?
🟩మానవుని శాస్త్ర జ్ఞానము అంతగా అభివృద్ధి చెందని కాలములో ఋషులు , మునునులు ఆన్ని అరోగ్య సూత్రాలను ఆధ్యాత్మికము గా రూపొందించారు . వైద్య రంగము అంతగా అభివృద్ధి చెందని కాలములో శుచి , శుభ్రత , వ్యాధినిరోధకత అన్నీ దైవకార్యాలరూపములో ఉండేవి . పుణ్యము , పురుషార్ధము వస్తుందంటే సామాన్యప్రజలు ఆనురిస్తాననేదే ముఖ్యాంశము . " అది చేస్తే ఆరోగ్యము ... ఇది చేస్తే అనారోగ్యము--- అలా చెబితే చాదస్తము గా కొట్టిపారేస్తారు " కాని అందులో ఎంతో ఆరోగ్యము , ఉత్సాహము దాగిఉన్నాయి . నిద్రలేవగానే రెండుచేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతులలో్ని ఉష్ణశక్తి , వేడి కళ్ళకు తగిలి కళ్ళలోని రక్త ప్రసరణ ఎక్కువై ఆరోగ్యవంతంగా తెజోవంతము గా ఉంటాయి. కళ్ళజబ్బులకు దూరముగా ఉండవచ్చును . కళ్ళ అద్దాల అవసము అంతతొందరగా రాదు . ఇది వైద్యశాస్త్రము చెప్పిన ఆరోగ్యసూత్రము .
కాని ఋషులు ఏమిచెప్పారు : చేతులు రుద్దుకునేటప్పుడు బ్రహ్మ రాసిన చేతిగీతలు అనుకోకుండా చూడడం ద్వారా బ్రహ్మను పూజించినంత ఫలితము ఉంటుందని , బ్రహ్మజ్ఞానము కలుగుతుందని ... అలా ప్రతిరోజూ చేయడము వల్ల కోటి పుణ్యక్షేత్రాలు సందర్శించినంత పుణ్యము సంప్రాప్తిస్తుందని లింకు పెట్టేరు .
0 Response to "Day - 23 : Students Summer Holidays Activities"
Post a Comment