Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 27 : Students Summer Holidays Activities

 Day - 27 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

 Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేస
వి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:27 Activities

Class: 1,2
27 వ రోజు 

To develop drawing skills:

Q) Colour the symbol of a rupee coin

తెలుగు:

Q) కింది అక్షరాలను సరి చేసి పదాలను రాయండి.

రుపుఎ: .......
ఏగును: .......
కలుఎ: ........
ఎరువ: ........
రాఐతంవ: ......

English:

Q) Learn and write ' N ' words.

Nose         👃

Net            🥅

Nine           9️⃣

Nails           💅

Note book   📖

Night           🌃

Maths:

Q) Write the expanded form.

40 = 40 + 0
41 = 40 + 1
42 = 40 + 2
43 = .... + ......
44 = .... + ......
45 = .... + ......
46 = .... + ......
47 = .... + ......
48 = .... + ......
49 = .... + ......
50 = .... + ......
51 = .... + ......
52 = .... + ......
53 = .... + ......
54 = .... + ......
55 = .... + ......
56 = .... + ......
57 = .... + ......
58 = .... + ......
59 = .... + ......
60 = .... + ......
ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Door = తలుపు.

Pure = శుద్ధమైన.

Become = అగు, తగు, సంభవించు.

Top = కొన, శిఖరము,బొంగరము.

Ship = ఓడ,నావ.

Across = అడ్డముగా.

Today = ఈరోజు.

During = కాలమున, అప్పుడు.

Short = పొట్టి, తక్కువైన.

Better = మంచిదైన, మేలైన.

Best = ఉత్తమమైన.

However = ఎట్లయినను, అయినప్పటికి.

Low = తక్కువైన, పల్లమైన.

Hours = గంట.

Black =నల్లని.










Class :3,4,5
27 వ రోజు 

Q) కోతి మరియు మొసలి కథను మీ సొంత మాటల్లో మీ నోటు పుస్తకం లో రాసి గ్రూప్ లో పోస్ట్ చేయండి.

Q ) Wrire the Story 'The monkey and the crocodile' in your own words in your note book and post in the group.
👇👇👇




💎నేటి ఆణిముత్యం

 డెన్నాళ్ళు తిరిగిన
బాదమైన ముక్తి పదవి గనడు
మనసు నిల్పునతడు మహనీయ మూర్తిరా!
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
మనసులో మలినము పెట్టుకుని ఎన్ని యాత్రలు చేసినా ముక్తి రాదు. నిశ్చలమైన మనసు కలవాడే ఉత్తమోత్తముడు. కాబట్టి మనలోని చెడుని తొలగించి మంచిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.

🤘నేటి సుభాషితం

విద్య, వివేకం, పరిజ్ఞానం బావిలో నీళ్లు లాంటివి. అవి తరగని నిధులు. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి.
                                                                                  
👬 నేటి చిన్నారి గీతం

చిన్ని కృష్ణయ్య

నల్లని వాడయ్య ఆ చిన్ని కృష్ణయ్య
అందుకోబోతేను అందరాడమ్మ
కళీయమర్ధనం చేసినాడమ్మ
వేణునాదపు విద్య నేర్చినాడమ్మ
ఉట్టిపై వెన్నను కృష్ణయ్య తీస్తేను
ఉట్టిలో టెంకాయ మీరు కొట్టండి
ఉల్లాసమొప్పంగ ఉట్టికెగరండయ్య
ఉట్టిలో టెంకాయ ఎగిరి కొట్టండయ్య
కొట్టి తినండైయ్య కొబ్బరి బెల్లాలు
ఉట్టి అదిగో వేగము ఉరికి రారంది
🤠 నేటి సామెత 

వీపు విమానం మోత మోగుతుంది

పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తుంటే పెద్దవారు కొట్టడానికి ముందు భయపెడుతూ వీపు విమానం మోత మోగిపోతుంది అని అంటారు. దీని అర్థం విమానం బయలు దేరేటప్పుడు చాలా శబ్దం చేస్తుంది. ఇప్పుడు అల్లరి ఆపక పోతే నే వీపు మీద వేసే దెబ్బలు, అంత గట్టి శబ్దం చేస్తూ, బాధ కలిగిస్తాయి అనే అర్థం ఆధారంగా వచ్చిన సామెత వీపు విమానం మోత మోగుతుంది.

🗣నేటి జాతీయం
ఊ అన్నా... ఆ అన్నా... తప్పే

మాటమాటకీ, తరచుగా అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ప్రత్యేకించి ఏ భావమూ వ్యక్తపరచకపోయినా ఏమాత్రం మాట్లాడినా ఆ మాటలకు కొంతమంది పెడార్థాలను చెప్పుకున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. "వాడితో అసలు మాట్లాడలేము. వూ అన్నా.. కోపమే, ఆ అన్నా.. కోపమే, ఆ ఇంట్లోవాళ్ళు ఎలా భరిస్తున్నారో మరి" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

✍🏼 నేటి కథ 

మంచి స్నేహితుడెవరు?
చాలాకాలం క్రిందట మంచితెలివితేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతరరాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికంపొందేదుకూతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమతెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. తాను తయారుచేసిన మూడుబొమ్మలనుకూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆమూడు బొమ్మలనూ రాజు ముందు ఉంచుతూ "రాజా ఈ మూడుబొమ్మలనూ, , జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైనబొమ్మో, ఏది వికారమైనబొమ్మో, ఏది అందంగా కాక, వికారంగాకాక ఉన్నదో పరిశిలించి చెప్పండి." అని ప్రార్ధించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆమూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆమూడుబొమ్మలూ ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులోకూడా సమంగా ఉండటం, అన్నింటిపోలికలూ ఒకేలాఉండటం రాజు గమనించాడు.
ఆ మూడుబొమ్మల్లో ఎల్లాంటివ్యత్యాసాన్ని అతడు. ఆమూడుబొమ్మలనూ జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒకబొమ్మ రెండుచెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒకసూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలొ ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరోచెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది. మరొబొమ్మచెవిలో మరియూ నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడుదూరచినసూది నోటిగుండా బయటకు వచ్చినది. మూడవబొమ్మకు ఒక్కచెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేడలేకపోయడు ఆచెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తానుచేసిన తెలుసుకొనిన చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి "మీరు చాలాతెలివిగలిగిన కళాకారులు" అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈమూడు బొమ్మలద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ మూడుబొమ్మల మూడురకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మనకష్టాలను సహనుభూతితో వింటూ, మనరహస్యాలను కాపాడుతూ, మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనము ఆశించాలి.
ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డస్నేహితుడను గురించి చెబుతుంది. మీరు మీకష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటిని వింటున్నాట్టూ అభినయిస్తాడు. కానీ అతడు నిజంగా వినడు. అతడు ఏఒక్కరికీ ఎలాంటి సహాయం చేయడు. చెవిద్వారా విన్నది మరో చెవిద్వారా వదిలి వేస్తాడు. రెండవరకం
స్నేహితుడికి ఈ రెండవరకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీరహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కాని ఇతడు చాలా ప్రమాదకరమైనవ్యక్తి మీరహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడుతనలో మనరహస్యాలను దాచడు. ఈ మూడవబొమ్మే చాలా ఉత్తమమైనది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పేమాటలను అతడు చాలా ఓపికతో శ్రధతో వింటాడనీ మీరునమ్మకంగా నమ్మవచ్చును. మీరహస్యాలను అతడు తనలో భధ్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు, విశదీకరణ ఆ కళాకారుడికి బాగానచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు.

నీతి: మీస్నేహితుల రహస్యాలను బయటపెట్టకండి.

తెలుసు కుందాం

🌩️మేఘాలు కింద పడవా⛈️

🌧️ఒక వస్తువు గాలిలో తేలుతుందా లేక పడిపోతుందా అన్న విషయం బరువును బట్టి ఆధారపడదు. శాస్త్రీయంగా బరువు అంటే భారం (Weight). దీని విలువ వస్తువు ద్రవ్యరాశి, గురుత్వ త్వరణాల (Acceleration due to gravity)లబ్దానికి సమానం. దీన్ని బట్టి కాకుండా వస్తువుల సాంద్రతను (Density) బట్టి వస్తువు తేలడం, కిందపడటం ఆధారపడుతుంది. గాలికన్నా మేఘాల సాంద్రత తక్కువ. మేఘాల్లో నీటి శాతం ఎక్కువ ఉన్నపుడు మేఘాల సాంద్రత కొంచెం పెరగడం వల్ల కిందకు రావడానికి ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో అవి తక్కువ ఉష్ణోగ్రత ప్రాంతానికి దిగడం వల్ల నీటి బిందువులు వర్షించి మేఘాల సాంద్రత తిరిగి తగ్గి అలాగే ఉండిపోతాయి. కాబట్టి మేఘాలు కింద పడవు.

మేఘాలు వాయు రూపంలోను, కొన్ని కొన్ని అణువులు బృందాలుగా కొల్లాయిడల్‌ రూపంలోను ఉన్న భౌతిక పదార్థాలు. భూమికి ఆకర్షణ ఉన్నంత మాత్రాన భూమ్మీద ఉన్నవన్నీ నేల మీదకు పడవు. ఆ మాటకొస్తే మేఘాలే కాదు. భూ వాతావరణంలో కొన్ని వందల కిలోమీటర్ల పైవరకు విస్తరించి ఉన్న ఆక్సిజన్‌ నైట్రోజన్‌ వంటి రూప పదార్థాలు కూడా భూమి మీద పడటం లేదు. అణువుల మధ్య పరస్పర తాడనాలు, వికర్షణలు ఎపుడూ ఉంటాయి.

భూమికి చేరువగా ఉన్న గాలి పొరల కన్నా కొంచెం పైనున్న పొరల సాంద్రత తక్కువగా ఉండటం వల్ల పైపొరల్లోని పదార్థాలు కింది పొర మీద తేలి ఉంటాయి. మేఘాల సాంద్రత, మేఘాల కింద ఉన్న గాలి సాంద్రత కన్నా తక్కువ కాబట్టి మేఘాలు గాల్లో పైపొరలో ఉంటాయి. మేఘాలలోని నీటి అణు బృందాల్లో అణువుల సంఖ్య పెరిగినా, వాతావరణ ఉష్ణోగ్రత తగ్గినా మేఘాల సాంద్రత పెరుగుతుంది. అపుడవి నేలకు మరింత దగ్గరవుతాయి. కొన్ని పర్వత ప్రాంతాల్లో మేఘాలు కొండల నేలల్ని తాకుతూ ప్రయాణిస్తుంటాయి. ఉష్ణోగ్రత మరీ తగ్గినట్లయితే ఆ మేఘాల్లో ఉన్న నీటి తుంపర్లే నీటి బిందువులుగా మారి వర్షపు చినుకుల్లా వాన కురుస్తుంది. అపుడిక మేఘాలు భూమి మీద రూపం మార్చుకుని పడ్డట్టే!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 27 : Students Summer Holidays Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0