Day - 30 : Students Summer Holidays Activities
Day - 30 : Students Summer Holidays Activities
Summer Holidays Activities - - Summer vacation- summer activities
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు వేస
వి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:30 Activities
Class: 1,2
30 వ రోజు
To develop humanity values:
Q) Keep water for birds infront of your house
తెలుగు:
Q) కింది ఎత్వం ఉన్న పదాలు చదువుతో రాయండి.
కెరటం
గెల
చెరకు
తెలుపు
తెలుగు
పెరుగు
నెమలి
మెరుపు
English:
Q) Write the missing lettes.
O - i o n 🧅
O r - n g e 🍊
O - e 1️⃣
O - l 🦉
O c t - b e r
Maths:
Q) Write the expanded form.
18 = .... + ......
34 = .... + ......
72 = .... + ......
286 = .... + ...... + .........
155 = .... + ...... + .........
400 = .... + ...... + .........
29 = .... + ......
90 = .... + ......
889 = .... + ...... + ........
999 = .... + ...... + ........
ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు
Money = డబ్బు.
Map = పటము.
Done =చేసెను.
English = ఆంగ్ల భాష.
Road = దారి, మార్గము.
Half = సగము.
Ten = పది.
Fly = ఎగురుట
Gave = ఇచ్చెను.
Box =పెట్టి
Finally =చివరగా.
Wait = కాచుకొనియుండు.
Correct = నిజమైన, సరియైన.
Oh = ఓ, అయ్యో.
Quickly = త్వరగా.
Class :3,4,5
30 వ రోజు
Q) సింహం మరియు ఎలుక కథను మీ సొంత మాటల్లో మీ నోటు పుస్తకం లో రాసి గ్రూప్ లో పోస్ట్ చేయండి.
Q ) Wrire the Story 'The Lion And The Mouse ' in your own words in your note book and post in the group.
💎నేటి ఆణిముత్యం
ఎటుల బ్రతికితి మన్నదే యేరికైన
లక్ష్యమౌటయె మానవ లక్షణంబు
వ్యర్ధమౌనట్టి బ్రతుకు నిరర్ధకంబు
కాకి నూరేండ్లు బ్రతుకుట గనమె మనము?
తాత్పర్యం :
ఏ విధంగా బ్రతికామనే లక్ష్యముంచుకొనుట మానవుని ధర్మం. కాకి వలె నూరేళ్ళు బ్రతుకుట వ్యర్ధం.
👬 నేటి చిన్నారి గీతం
మన పండుగలు
దసరా పండుగ వచ్చినది
దర్జా లెన్నో తెచ్చినవి
దండిగ డబ్బుల్లు వచ్చినవి
కోరికలన్నీ తీరినవి
సంక్రాంతి పండుగ వచ్చినది
సరదా లెన్నో తెచ్చినది
కొత్త బట్టలి కట్టాము
బహుమతులెన్నో పొందాము
దీపావళి పందుగ వచ్చినది
దివిటీ లెన్నో వెలిగించినది
చీకటి నంతా ప్రారద్రోలి
చిరంజీవిగా నిలచింది
ఉగాది పండుగ వచ్చింది
జగాన వెలుగు నిందింది
చేదు వగరు తీలి గుర్తులతో
జీవిత మంత సాగింది.
🤘నేటి సుభాషితం
సోమరి దొరికిన దాన్ని కూడా రక్షించుకోలేడు.
🤠 నేటి సామెత
శంఖులో పోస్తేగాని తీర్థం కాదని
దేనికైనా స్థానం, సమయం, సందర్భం లాంటి వాటిని బట్టి వాటి విలువ వుంటుందని అర్థం. చెంబులో వున్నప్పుడు నీళ్లు అంటారు. అదే నీరు శంఖంలో పోస్తె తీర్థం అవుతుంది ఆ నీరుకు భక్తి ఆపాదించబడుతుంది.
🗣నేటి జాతీయం
ససేమిరా!
పూర్వం ఒక రాకుమారుడు అడవికి వెళ్లాడట. అక్కడ పులిని చూసి భయపడి చెట్టు ఎక్కాడట. అప్పటికే ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటి ఉంది. ‘రాకుమారా... నీవేమీ భయపడకు’ అని ధైర్యం చెప్పింది. మరోవైపు చెట్టుకింద ఉన్న పులి... రాకుమారుడికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘నువ్వు ఆ ఎలుగుబంటిని కిందికి తోసేయ్. నిన్నేమీ చేయను’ అంది పులి. ఇదేదో బాగుందే అనుకొని రాకుమారుడు ఎలుగుబంటిని కిందికి తోసేశాడట. దాని అదృష్టం బాగుండి, చెట్టు కొమ్మలను పట్టుకొని కింద పడకుండా ఉండిపోయింది. ‘కృతజ్ఞత లేని మనిషీ... ఈ క్షణం నుంచి నువ్వు గతమంతా మరిచి పోతావు’ అని శపించింది ఎలుగుబంటి. రాకుమారుడి అదృష్టం బాగుండి రెండో రోజే సైనికులు అతడి ఆచూకిని కనుక్కుని కోటకు తీసుకువెళ్లారు.
శాప ప్రభావంతో అన్నీ మర్చిపోయిన ఆ వ్యక్తికి తన ఊత పదమైన ‘ససేమిరా’ ఒక్కటే గుర్తుంది. ‘నీవెవరు?’ అని అడిగితే ‘ససేమిరా’ అనేవాడు. ‘మీ తండ్రిగారి పేరేమిటి’ అంటే ‘ససేమిరా’ అనేవాడు. దాంతో కోపం వచ్చిన మంత్రి... ‘రాకుమారా... మూర్ఖంగా ప్రవర్తించకు. అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పు’ అంటే... దానికీ ‘ససేమిరా’ అనే అనేవాడు. ఈ రాకుమారుడి జ్ఞాపకశక్తి ఎలా వచ్చింది అన్న విషయం Programming... అది తర్వాత అందరికీ ఊతపదమైంది. తమకు నచ్చనిది చెప్పినప్పుడు ససేమిరా అనడం, ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు అని చెప్పాల్సి వచ్చినప్పుడూ ససేమిరా అనడం అందరికీ అలవాటయ్యింది.
✍🏼 నేటి కథ
ధ్రువనక్షత్రం
ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు. వారి పేర్లు సునీత, సురుచి. రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి. దాసికన్నా హీనంగా చూసేవాడు. సునీత కొడుకు ధ్రువుడు, ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకొనేవాడు. కాని తండ్రి, పిన తల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ద్రువునికి తండ్రి ప్రేమ కరువైంది.
ఒక రోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ద్రువుడ్ని చీదరించుకున్నాడు. తండ్రి నిరాదరణకు ద్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి అయిన సురుచి కఠినంగా "ధ్రువా! నీవు నా కడుపున పుడితే మీ తండ్రిగారి తొడపై కూర్చొనే అదృష్టం కల్గేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్ధించు. అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది" అన్నది పినతల్లి సురుచి.
జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి "నాయనా ధ్రువా! నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి ఫలితం ఉంటుంది" అన్నది తల్లి.
తల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి, తపస్సు చేయుటకు బయలుదేరాడు. దారిలో ద్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలిసుకొని నవ్వుతూ "నాయనా ధ్రువా! పసివాడివి పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు! చాలా కష్టము. నీ నిర్ణయం మార్చుకో" అన్నాడు. నారదుని మాటలకు ధ్రువుడు "మహర్షీ! పినతల్లి మాటలకు నాలో రేపిన బాధ అంత,ఇంత కాదు. ఉత్తముని కన్న నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందడానికి నేను కఠోర తపస్సు చేస్తాను" అని చెప్పాడు. "పట్టుదల గట్టిదే. నిశ్చలమైన మనస్సుతో తపస్సు చెయ్యి" అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి, దీక్షతో కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు.
అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలను స్తుతించాడు. అంతట విష్ణుమూర్తి "ధ్రువా! నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను. ఇంత వరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ, సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై, ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని 'ధ్రువ నక్షత్రం' అని పిలుస్తారు" అని వరమిచ్చి అంతర్దానమైనాడు. నేటికీ కనబడే ఉత్తర ద్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువనక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి, అనుకున్నది సాధించాడు. పట్టుదల ధృడ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించ వచ్చు అని మనందరం తెలుసుకోవాలి.
తెలుసు కుందాం
ఆవిరి పైకే ఎందుకు వెళుతుంది? Boiling vapours goes up Why?
నీటి ఆవిరి వంద డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది.దీని సాంద్రత తక్కువగా ఉంటుంది. సాధారణ గాలి వేసవి కాలంలో అయినా 45 డిగ్రీల సెల్సియస్‌కు మించదు. అందువల్ల వేడి నీటి ఆవిరి సాంద్రత తక్కువగా ఉంటుంది. ప్లవన సూత్రాల ప్రకారం తక్కువ సాంద్రత గల పదార్థాలు, ఎక్కువ సాంద్రతగల ప్రాంతాలపైకి విస్తరిస్తాయి. అందువల్ల వేడి ఆవిర్లు పైపైకే పాకుతాయిగానీ, కిందివైపునకు పడవు. పైకి పాకుతున్న క్రమంలో ఉష్ణోగ్రత సమతాస్థితి పొంది గాలిలో సమానంగా ఆవిరి కలిసిపోతుంది.
0 Response to "Day - 30 : Students Summer Holidays Activities"
Post a Comment