Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day6: Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities.

Day6: Students Summer Holidays Activities

Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:6 Activities

Class: 1,2
6 వ రోజు 
To develop communication and creativity skills:

Q) Practice One story with action and ask your parent to make a video.

తెలుగు:

Q) కింది అక్షరాలకు సున్నా ' 0 ' చేర్చి రాయండి. చదవండి.

ప - పం
ల - లం
క - కం
డ - డం
వ - వం
ఉ - ఉం
త - తం
బ - బం

English:

Q) Learn and write ' C ' words.

Cat
Car
Cow
Cap
Cup

Maths:

Q) Write the Number Names.

3 - ...….................
8 - .......................
11 - .....................
15 - .....................
20 - .....................

Class :3,4,5
6 వ రోజు 

Q) నక్క ద్రాక్ష పళ్ళు కథను మీ సొంత మాటల్లో మీ నోటు పుస్తకం లో రాసి గ్రూప్ లో పోస్ట్ చేయండి.
Q ) Wrire the Story '  The fox and the Grapes ' in your own words and post in the group.


💁‍♀️WE LOVE READING

🔮The Blue Jackal Story

Once there was an adventurous jackal who frequently strayed into the village looking for food. The Village was filled with dogs that scared the jackal. Although he was scared of the dogs, the jackal loved food and travelled to the city again and again.

One day, as he was going to enter a house, he heard barking. He was shocked to find a gang of dogs running towards the house. They looked violent and caused the jackal to panic. He ran and tumbled into a tub of blue dye. The dogs couldn’t see him and they ran another way.

Now the jackal was completely blue from head to toe. He appeared very different from any other animal. The jackal was pleased as no one would be able to recognize him and he could easily fool anyone in the jungle. Just like he had thought, everyone in the jungle was surprised to see such an unusual animal.

The small animals, the lion and the tiger all asked who he was and who had sent him.“I have been sent by God himself to look after you. I will now be the king of the jungle” The jackal said.

The lion protested saying he had always been the king of the forest. “From now, that must change and all of you must serve me” The Jackal happily said.

Some animals like the tiger protested and asked what would happen if they didn’t obey him. He replied saying God would destroy the entire jungle if they didn’t.

Scared for their lives and their jungle, the animals asked the blue Jackal what he would like them to do.
“Bring me lots of food” said the blue jackal promptly.
The animals quickly scurried and returned with lots of food for the Jackal.He had so much food that he gave his leftovers to the other animals and told them that they had to serve him fresh food every day. He even threw out the pack of jackals from the forest because he knew that they could identify him some day.

The blue Jackal was very happy with himself for fooling the entire forest and was happy to be away from the city dogs.
But one day the banned pack of jackals was walking around the forest and howling loudly. The blue jackal began howling out of habit too.
Because of this mistake, the other animals quickly identified him as a jackal and destroyed him.
🔮Moral of the story:

Be true to yourself and don’t pretend to be someone you are not

💎నేటి ఆణిముత్యం

పని బూని జనులు సంతస
    మునఁ దాలిమి సత్యశౌచములను బ్రవర్తిం
    చిన యశము నొందుచుందురు
    గనుగొను మిదె దొడ్డ నడకఁ గాగ కుమారా!

భావము:

ఓ కుమారా! ప్రజలు, తాము చేయు పనులను సత్యమార్గము, సంతోషముతో చిత్తశుద్ధితో ఓర్పు కలిగి చేయవలెను. అట్లు చేసినచో లోకమున కీర్తిని పొందుదురు. ఇదియే మంచిమార్గమని తెలుసుకొనుము.

నేటి సుభాషితం

అక్షరరూపం ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక

👬 నేటి చిన్నారి గీతం 

చిన్నారి నోట ఓ కొత్త పాట

పాడు బడిన కోట  - కోట వెనక పేట
పేట వరకు బాట   - బాట పక్క తోట
తోట లోపల మోట - మోట కోసం రాట
రాట తిరుగుచోట   - రాగాల పాట
పాట పాడు నోట   - పంచదార ఊట
అందుకే పూట పూట వినిపించు పాట
చిన్నారి నోట ఓ కొత్త పాట

🤠 నేటి సామెత 

రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?

రాజు తలుచుకొంటే ఏమైనా చేస్తాడు అని అర్థం, అలాగే ఉన్నవాడు తలుచు కుంటే కూడా ఎమైనా చేస్తాడు,,,, అని అర్థము

✍🏼 నేటి కథ

వినయం విజయానికి చిహ్నం.

పూర్వం ఒక అడవిలో ఒక నదీ తీరాన చాలా వృక్షాలు ఉండేవి. వాటన్నింటిలోకీ చాలా పొడవైనది బూరుగు చెట్టు. నదీ తీరంలో పచ్చని పచ్చిక ఉండేది. నీటి అలలు వచ్చినప్పుడల్లా ఆ గడ్డి పోచలు తలలు వంచి అవి పోయాక లేస్తుండేవి. ఒక రోజున వర్షం పడటంతో నదికి ప్రవాహ వేగం పెరిగింది. దాంతో గడ్డి పోచలు తలలు వంచి నీటి ప్రవాహం వాలుకు ఉండి పోవలసి వచ్చిం ది. సాయం కాలానికి నదీ ప్రవాహం తగ్గింది.అప్పుడు పచ్చిక మొక్కలు హాయిగా తల లెత్తి నవ్వు కుంటూ చుట్టూ చూడ సాగాయి.
నది గట్టు పక్కనే ఉన్న బూరుగు చెట్టు వాటి వైపు చూసి ఫక్కున నవ్వింది. ఆ సవ్వడికి గడ్డి మొక్క లన్నీ తలలు తిప్పి ఆ సవ్వడి వచ్చిన వైపు చూశాయి. వాటిని చూసి బూరుగు చెట్టు తిరిగి పక పకా నవ్వింది.

పక్కనే ఉన్న మిగిలిన చెట్లు దాని వైపు చూసి , "ఎందుకు నవ్వుతున్నావ్?" అని అడిగాయి.

దాని కి బూరుగు చెట్టు " గమనిస్తే మీరంతా కూడా ఫక్కున నవ్వు తారు.చూడండీ ఉదయం నుండీ ఈ గడ్డి పోచలు నీళ్ళకు భయ పడి తలలు వంచుకుని ఉన్నాయి . ఇప్పుడు నీరు తగ్గాక తల లెత్తాయి. వాటిని చూస్తే నవ్వు కాక మరే మొస్తుందీ! పాపం చిరుప్రాణులు! వాటి భయం చూసి నాకు ఆగని నవ్వు వస్తున్నది " అంటూ ఇంకా నవ్వ సాగింది బూరుగు చెట్టు.

మిగతా చెట్లు " తప్పుకాదూ ? ఇతరులను చూసి అలా నవ్వడం ! అవి వింటే ఏమను కుంటాయి. చెట్ల జాతి మన మంతా ఒక్కటే కదా!"అన్నాయి.

"ఏంటీ! ఆ గడ్డి పోచలూ మనమూ ఒక్కటేనా! ఆ గడ్డి పోచలు మన జాతా? మాట్లాడకండి , నాకు అసహ్య మే స్తుంది." అంది ఠీవిగా తలెత్తి.

"గడ్డిపోచలూ మన జాతే ! పెద్ద చిన్న అంతే తేడా! మనలో వట వృక్షం ఎంత పెద్దదీ! మనం కేవలం చెట్లమే, వృక్షాలం కాదు కదా! అలాగే ఆ గడ్డి పోచలూనూ, ఎవరి గొ ప్పవారిదే!" అంది వేప చెట్టు.

" గడ్డిపోచలన్నీకలిసి ఏనుగునే కట్టేస్తాయి అనే విషయం నీవు విన్నట్లు లేదు." అంది రాగిచెట్టు.

"చాలించండి ! మీ మాటలు మన వృక్ష జాతికే అవమానం . పసి పిల్లలు వేలితో తుంపితే తెగే ఈ గడ్డి పోచలూ మనమూ ఒక జాతా!" అంటూ అట్ట హాసంగా అరిచింది బూరుగు చెట్టు.

ఇంతలో గాలి వీచడం మొదలైంది. రాను రానూ క్షణాల్లో గాలి వేగం హెచ్చింది. చూస్తుండ గానే తీవ్రమైన గాలి గా మారింది .ఆ గాలి తాకిడికి చెట్ల తలలన్నీ ఊగసాగాయి .ఆకులు తెగి పడ సాగా యి. రెమ్మలు విరగ సాగాయి , కొన్ని చెట్ల కొమ్మలు సైతం తెగి క్రింద పడ సాగాయి. ఉన్నట్లుండి బూరుగు చెట్టు మధ్యకు విరిగి పడి మొండెం మాత్రమే మిగిలింది. మరి కాస్సేపటికి గాలి తగ్గింది. చెట్లన్నీ తెప్పరిల్లి చూట్టూ చూశాయి. అన్నిచెట్లకూ కేవలం కొన్నికొమ్మలూ రెమ్మలూ మాత్రమే పోగా బూరుగు చెట్టు సగానికి తెగి ఉండటం చూసి , సానుభూతిగా పలక రించాయి.

"బూరుగు వృక్షమా! క్షేమమేకదా! " .బూరుగు విచారంగా ,బలహీన స్వరంతో , " గర్వించిన దాని ఫలితం వెంటనే తగిలింది. చిన్న తనంలో మా అమ్మ 'గర్వం తీయనైన విషం.ఎవ్వడూ దేనికీ గర్వించకు, పెద్ద వారి ముందు, మన కన్నాశక్తి వంతుల ముందూ తలవంచడం మంచిది. డాంబికం చేటు చేస్తుంది, గొప్పలకు పోకు, వినయంగాఉండు ' అని చెప్పింది, నేనే మీ అందరి కంటే ఎత్తుగా ఉన్నానని గర్వించి , మిమ్మూ , ఆ గడ్డి పోచ లనూ తక్కువ చేసి మాట్లాడాను. నేను మధ్యకు విరిగాను కానీ,ఆ గడ్డి పోచ ల లాగే తలలు ఊపు కుంటూ ఉన్నాయి.అంతా నన్ను , నా గర్వాన్నీ మన్నించండి." అంది.
మిగతా చెట్లన్నీ' మిత్రమా! తెలీక జరిగిన పొరపాటు మర్చిపో. పశ్చాత్తాపమే దానికి విరిగిడు. కొద్ది రోజు ల్లోనే తిరిగి చిగురిస్తావులే ,కొమ్మలు తొడుగు తావులే దిగులుపడకు.. బాధపడకు." అంటూ బుజ్జ గించాయి.

నదీ తీరం లోని గడ్డి పోచలు మాత్రం ఎప్పటిలా అలాగే హాయిగా నవ్వుకుంటూ, నీరు వచ్చినపు డు తల లు వంచు కుంటూ ,తర్వాత ఎత్తుకుంటూ ఉన్నాయి. వినయం విజయానికి చిహ్నం కాదూ!

నీతి- గర్వం విష తుల్యం.

ప్రశ్నలు:

1. బూరుగుచెట్టు ఎలాంటిది?
2. గడ్డిపోచలు ఎలాఉండేవి?
3. మిగతా చెట్లు బూరుగు చెట్టుకు ఎమి చెప్పాయి?
4.పెనుగాలికి ఎమి జరిగింది?
5. విరిగిన బూరుగు స్నేహితులతో ఏమంది?

తెలుసు కుందాం

🟥స్వచ్చమైన నీటికి రంగు ఉండదు కాని అదే నీటి తో తయారైన ఐస్ క్యూబ్ లు తెల్లగా ఉంటాయి ఎందుకు ?

🟩తెలుగుపు అనేది ఒక రంగు కాదు ... అన్ని రంగుల మేలు కలయికే తెలుపు . ఒక వస్తువుగుండా దృశ్య కాంతి లోని ఏడు రంగులు యధేచ్చగా తరిగిపోకుండా పతనమైన (incident) దిశలోనే ప్రసరిస్తే ఆ వస్తువు ను పారదర్శక వస్తువు (TransparentBody) అంటాము . అదే వస్తువు ముక్కలు ముక్కలు గా ఉన్నప్పుడు గానీ .. ఒకే విధమైన అంతర్గత నిర్మాణము లేనపుడు గానీ దాని మీదపడే కాంతి (IncidentLight) పలు దిశల్లో వక్రీభవనం (Refraction) చెంది వివిధ మార్గాల ద్వారా బయటకు వస్తుంది . ఇలా అన్ని వైపూలనుండి తెలుపు కాంతి రావడం వల్ల ఎటు నుంచి చూసినా ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది .

గాజు పలక పారదర్శకం గ కనిపించినా దాన్ని పొడిగా నూరితే సుద్ద పోడిలా తెల్లగా కనిపిస్తుంది . ఇందుకు కారణమూ శ్వేత కాంతి (WhiteLight)పలు దిశల్లో వెదజల్లు కోవడమే (ScatteredLight) . ఐస్ క్యూబ్లలో కుడా వక్రీభవన దిశలు మారి తెల్లని కాంతి పలు మార్గాల్లో బయట కు వస్తుంది . . . అందుకే తెల్లగా కనిపిస్తుంది .
🟥మంచు తెల్లగానే ఎందుకు ఉంటుంది?
🟩తెలుపు ఓ నిర్దిష్ట వర్ణం (specific colour) కాదు. ఇది ఎన్నో వర్ణాల కలయిక. సాధారణంగా ఏదైనా పదార్థంలోని అణువులు (molecules)లేదా పరమాణువులు (atoms) దృశ్య కాంతిలో ఉన్న ఏ రంగు కాంతినీ శోషించుకోలేనట్లయితే ఆ పదార్థం తెల్లగా గానీ, పూర్తి పారదర్శకంగాగానీ కనిపిస్తుంది. ఒకవేళ అలాంటి పదార్థంలో ఉన్న పరమాణువులు స్వచ్ఛమైన స్ఫటికాకృతిలో (crystal structure) ఉన్నా, అణువులు లేదా పరమాణువుల మధ్యన ఖాళీ ప్రదేశం (ద్రవాలు, అణువులలో లాగా) బాగా ఎక్కువగా ఉన్నా ఆ పదార్థాలు పారదర్శకం (transparent) గా ఉంటాయి. కానీ అదే పదార్థంలో ఉన్న అణువులు, పరమాణువులు చిందరవందరగానో, శకలాల్లాగానో (polycrystalline or defective crystalline)ఉన్నట్లయితే ఆ పదార్థాల మీద పడ్డ తెల్లని కాంతి అన్ని వైపులకు పరావర్తనం (reflection) లేదా వ్యాపనం (diffusion) లేదా పరిక్షేపణం (scattering)అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఏ వైపు నుంచి చూసినా మనకు అంతో ఇంతో తెలుపు కాంతి కంటికి చేరడం వల్ల ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది. సాధారణంగా మంచుగడ్డలు నిర్దిష్ట స్ఫటికాకృతిలో కాకుండా చెల్లా చెదురుగా ఏర్పడ్డ బహుస్పటిక శకలాలు (poly crystalline segments)గా ఉంటుంది. ఇటువంటి శకలాలమీద పడ్డ కాంతి పరిక్షేపణం చెందడం వల్ల ఆ మంచు ముక్కలు తెల్లగా అగుపిస్తాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day6: Students Summer Holidays Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0