I have no bias against teachers
ఉపాధ్యాయులపై నాకుఎటువంటి కక్ష లేదు
ఉపాధ్యాయులంతా మనస్సాక్షిగా పనిచేయాలి
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులపై తనకు ప్రత్యేకించి ఎటువంటి కక్ష లేదని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు.ఆదివారం ఆయన ఎల్.కోట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలో గల ఏపీ మోడ్‌స్కూల్‌లో ఉన్న సామగ్రిని పరిశీలించారు. విద్యార్థులకు అందించే పుస్తకాలు, షూ, సాక్సులు, బెల్టులు, బట్టలు తదితర వస్తువులను క్షుణ్ణంగా దగ్గరుండి పరిశీలించారు. ప్రతి వస్తువును పరిశీలించి నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.
దగ్గరుండి బట్టల కొలతలు కొలిచి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వచ్చాయా లేదా అనేటువంటి విషయాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే ఏ వస్తువులో కూడా రాజీపడే ప్రసక్తి లేదని, ఎవరికైనా ఎటువంటి నష్టం జరిగినా వెంటనే తమకు ఫోన్‌చేయాలని లేదంటే మెసేజ్ పెట్టాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయులపై గతంలో నెలకొన్న వివాదానికి ఆయన తెరదించారు. కావాలని ఏ ఒక్క అధికారినీ సస్పెండ్ చేయలేదని, అక్కడున్న పరిస్థితులను బట్టి విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేశామే తప్ప కక్ష సాధింపు చర్యలు చేయలేదన్నారు.
ఉపాధ్యాయులంతా మనస్సాక్షిగా పనిచేస్తూ విద్యా వ్యవస్థ బలోపేతం చేసి విద్యార్థులకు తగిన న్యాయం చేసినప్పుడు నేను ఎందుకు చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఆయన ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడుతోందన్న భయాన్ని ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు పనుల ఏ విధంగా జరుగుతున్నాయో డీఈవో లింగేశ్వరరెడ్డిని అడిగి తెలుసుకన్నారు. ఎక్కడా పొరపాటున కూడా తప్పులు జరగరాదని ఆయన సూచించారు. ఆయన వెంట ఆర్‌జేడీ జ్యోతికుమార్, డిప్యూటీ డీఈవో వాసుదేవరావు, ఎంఈవో కూర్మారావు, సీఆర్‌పీలు, తదితరులు పాల్గొన్నారు.
0 Response to "I have no bias against teachers"
Post a Comment