Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If you eat two cloves of raw garlic in the morning, there will be no such problems.

పరిగడుపున రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే ఆ సమస్యలు ఉండవు.

If you eat two cloves of raw garlic in the morning, there will be no such problems.

వెల్లుల్లి.మన భారతీయ వంటశాలలో చాలా వరకు కనిపించే ఒక సాధారణ పదార్ధం. అల్లం వెల్లుల్లి ఈ రెండూ లేని భారతీయ వంటకాలే ఉండవు. పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్లు సి, కె, నియాసిన్, థయామిన్ , ఫోలేట్ వంటి అనేక ఖనిజాలు కూడా వెల్లుల్లిలో పుష్కలంగా లభిస్తాయి.

వెల్లుల్లిని మీరు రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అయితే ప్రతిరోజూ ఉదయం పడిగడుపున ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే కొన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం.

గుండె జబ్బులకు:

వెల్లుల్లి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారు వెల్లుల్లిని తీసుకోవాలి. వెల్లుల్లి సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. మీ గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. గుండెపోటు, పక్షవాతం రాకుండా ఉండాలంటే వెల్లుల్లి తినడం తప్పనిసరి చేసుకోవాలి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

నిత్యం వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులోని పురుగులు నశిస్తాయి. వెల్లుల్లి పేగు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

బరువు తగ్గటానికి:

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్ కొలెస్ట్రాల్ ను వేగంగా అదుపు చేయడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే లేదా మీరు తరచుగా జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లకు గురవుతుంటే, మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవాలి. మీరు ఖాళీ కడుపుతో వెల్లుల్లిని నమిలి తినవచ్చు. ఇది మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది:

వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడానికి ఇది అద్భుతమైనదిగా పనిచేస్తుంది.

చర్మ సమస్యలు:

వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వెల్లుల్లిని మొటిమలపై అప్లై చేయడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.

అధిక రక్తపోటును నియంత్రించడానికి:

వెల్లుల్లి BP-తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంది. ఇది రక్తనాళాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా బీపీని కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If you eat two cloves of raw garlic in the morning, there will be no such problems."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0