Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration

పది ఫెయిలైనా కలెక్టర్‌. ఎంబీబీఎస్‌ తప్పినా డాక్టర్‌

  • స్ఫూర్తిగా నిలుస్తున్న వారి జీవిత ప్రస్థానాలు
  • ఓటమిని గెలుపు సోపానంగా మార్చుకుని ఉన్నత స్థాయికి
  • విద్యార్థులు తొందర పడొద్దని సూచన

మన చుట్టూ ఉన్న ఎంతోమంది విజయవంతమైన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, వైద్యులు, ఉన్నతాధికారులందరి జీవితాలు వడ్డించిన విస్తరేమి కాదు. ఎన్నో ఓటములను దాటుకునే ఈ దశకు చేరుకున్నారు. పది, ఇంటర్‌ ఫెయిల్‌ అయినా కుంగిపోకుండా పట్టుదలతో చదివి ఐఏఎస్‌ స్థాయికి ఎదిగిన వారూ ఉన్నారు. వీరు కూడా ఇప్పుడు బలవన్మరణాలకు పాల్పడుతున్న పిల్లల మాదిరి తొందరపడితే గొప్ప విజయాలకు దూరమయ్యే వారని సైకాలజిస్టులు అంటున్నారు. అలాంటి వారిలో కొందరితో 'ఈనాడు' మాట కలపగా.. తమ అనుభవాలను చెప్పారు.


నా జీవితంలో అదే మేలి మలుపు..

నేను పదో తరగతిలో పరీక్ష తప్పాను. అందుకు రకరకాల కారణాలున్నాయి. ఇప్పటిలాగా అప్పుడు సప్లిమెంటరీలు లేవు. నిజానికి ఫెయిల్‌ కావడమే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏం కావాలనే దానిపై స్పష్టత వచ్చింది. నాకు పది పాస్‌ కావడానికి రెండేళ్లు పట్టింది. తర్వాత ఇంటర్‌, ఆపై చదువులు పూర్తిచేశాను. ఇష్టంతో చదివాను. ఐఏఎస్‌ అయ్యాను. కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా చేసి పదవి విరమణ చేశాను. పిల్లలకు నేను చెప్పేది ఒకటే.. తప్పటడుగుల నుంచే మంచి అడుగులు పడతాయి.

ఎల్‌. శర్మన్‌, హైదరాబాద్‌ జిల్లా మాజీ కలెక్టర్‌


నాలుగు సార్లు రాశా.. ఆరు నెలలు వెనుకబడిపోయా

వ్యవస్థలోని లోపాలు, పోటీతత్వం పిల్లలను అంతులేని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. పది, ఇంటర్‌ పరీక్షలు అనేవి జీవితంలో మలుపులు మాత్రమే. అవే ఆఖరు కాదని విద్యార్థులు గుర్తించాలి. నా ఇంటర్‌ పూర్తయ్యాక ఎంబీబీఎస్‌లో సీటు రావడానికి నాలుగేళ్లు పట్టింది. ప్రతిసారి ఒకటి రెండు మార్కులతో పోయేది. ఆ రోజుల్లో కాకినాడ మెడికల్‌ కళాశాలలో డొనేషన్‌ రూ.22వేలు ఉండేది. డబ్బు చెల్లించే స్తోమత అప్పుడు లేదు. అందుకే పట్టువదలని విక్రమార్కుడిలా సీటు వచ్చేదాక వదిలిపెట్టలేదు. ఎంబీబీఎస్‌లో చేరిన తర్వాత మొదటి సంవత్సరంలో బయోటెక్నాలజీ పరీక్షలో తప్పాను. అది పాసైతే తప్ప ముందుకెళ్లడానికి లేదు. మరో ఆరునెలలు వెనకబడిపోయాను. అకడమిక్స్‌లో తప్పినా జీవితంలో పాసయ్యాను. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చదువు, ప్రేమ, కెరీర్‌ ఇలా ఏదో ఒకదాంట్లో ఫెయిల్‌ అయితే మనిషికి పరిపూర్ణత వస్తుందనేది నా అభిప్రాయం. లేదంటే హఠాత్తుగా ఓటమి ఎదురైతే తట్టుకోలేరు.

డాక్టర్‌ గురువారెడ్డి, చీఫ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌, కిమ్స్‌-సన్‌షైన్‌ ఆసుపత్రి


పిల్లలకు చిన్నతనం నుంచే జీవిత నైపుణ్యాలను నేర్పాలి

- గీత చల్లా, చైల్డ్‌, అడోలసెంట్‌ సైకాలజిస్టు

యుక్త వయసు పిల్లలు ఎక్కువగా సున్నిత మనస్కులు. ఇదే ఇంటర్‌ దశలో శాపంగా మారుతోంది. క్లిష్ట విషయాలు ఎదురైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు.
పిల్లలు కష్టమంటే తెలియకుండా పెంచుతున్నారు. ఫలితంగా గెలుపోటములను ఎలా తీసుకోవాలో తెలియడం లేదు. ఆట ఆడితే గెలవాలి.. పరీక్ష రాస్తే పాసై పోవాలనే భావనతో.. అందుకు భిన్నంగా జరిగితే తట్టుకోలేక ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు.
ఒకరికి ఎక్కువ మార్కులు వచ్చి.. మరొకరికి తక్కువ వస్తే తట్టుకోలేరు. పోల్చుకోవడం కూడా ఈ వయసులో ఒక సమస్య.
ఏ పరిస్థితులైనా ఎదుర్కొనే ధైర్యం, ఆత్మవిశ్వాసం పిల్లల్లో పెంపొందించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0