2000 Notes: Rs. 2 thousand notes.. RBI said sweetly!
2000 Notes: రూ.2 వేల నోట్లు.. తీపికబురు చెప్పిన ఆర్‌బీఐ!
దేశీ కేంద్ర బ్యాంకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా తీపికబురు అందించింది. రూ. 2 వేల నోట్ల (2000 Notes) ఉపసంహరణ అంశంపై కీలక ప్రకటన చేసింది.
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ రూ. 2 వేల నోట్ల అంశంపై స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ మీద రూ. 2 వేల కరెన్సీ నోట్ల (Currency Notes) ఉపసంహరణ వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
'ఒక్క విషయాన్ని అయితే కచ్చితంగా చెప్పగలను. రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు' అని శక్తికాంత్ దాస్ తెలిపారు. కాగా ఆర్‌బీఐ గత నెలలో రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రూ. 2 వేల నోట్లు ఎవరి వద్ద అయినా ఉంటే.. వాటిని వెంటనే మార్చుకోవచ్చు. దీనికి సెప్టెంబర్ నెల చివరి వరకు అవకాశం ఉంటుంది.
దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి ప్రజలు వారి వల్ల ఉన్న రూ.2 వేల నోట్లను ఇతర కరెన్సీ నోట్లతో మార్చుకోవచ్చు. లేదంటే వారి బ్యాంక్ అకౌంట్లలో రూ. 2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. ఎలా అయినా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అందువల్ల మీ వద్ద రూ. 2 వేల నోట్లు ఉంటే.. వెంటనే ఎక్స్చేంజ్ చేసువచ్చు. లేదందే డిపాజిట్ చేసుకోవచ్చు. కాగా ఇప్పటికే చాలా వరకే రూ. 2 వేల నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు వచ్చాయని చెప్పుకోవచ్చు.
ఆర్‌బీఐ రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయానికి ముందే వ్యవస్థలో ఈ కరెన్సీ నోట్ల చెలామణి బాగా తగ్గిపోయింది. ఏటీఎంలలో కూడా రూ. 2 వేల నోట్లు వచ్చేవి కాదు. కేవలం రూ. 500 నోట్లు వచ్చేవి. అలాగే ప్రజల వద్ద కూడా చాలా తక్కువగా రూ. 2 వేల నోట్లు కనిపించేవి. అందువల్ల ఆర్‌బీఐ రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించడం వల్ల ఎవరిపై కూడా ప్రతికూల ప్రభావం పడలేదు. అలాగే వీటిని మార్చుకోవడానికి చాలా గడువు కూడా ఇచ్చారు. దీని వల్ల ప్రజలపై కూడా ఎలాంటి ప్రభావం లేదని చెప్పుకోవచ్చు.
0 Response to "2000 Notes: Rs. 2 thousand notes.. RBI said sweetly!"
Post a Comment