Data Science Job
Data Science Job: డేటా సైన్స్ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్.. 2023లో టాప్ జాబ్ రోల్స్‌వివరాలు.
ఈరోజుల్లో డేటా (Data) చాలా పవర్‌ఫుల్‌గా మారింది. చాలా రకాల బిజినెస్‌లు, రీసెర్చ్‌లు డేటా ఆధారంగానే పని చేస్తున్నాయి. స్మార్ట్ ఫ్యాక్టరీలు, రియల్ టైమ్ డేటా జనరేషన్ కీలకమైన ఇండస్ట్రీ 4.0 యుగంలో డేటా సైన్స్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
డేటా సైంటిస్ట్ జాబ్ రోల్స్ 14 శాతం పెరుగుతాయని, 2026 నాటికి దాదాపు 11 మిలియన్ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని అంచనా. ఈ డిమాండ్ ఆకర్షణీయమైన శాలరీ ప్యాకేజీలతో పాటు డేటా సైన్స్‌ను లాభదాయకమైన కెరీర్ ఆప్షన్‌గా మార్చింది. ఈ నేపథ్యంలో డేటా సైన్స్‌లో ఉన్న జాబ్స్, రాణించేందుకు అవసరమైన స్కిల్స్, నాలెడ్జ్ గురించి పూర్తి తెలుసుకుందాం.
డేటా ఇంజనీర్
స్కేలబుల్ డేటా పైప్‌లైన్స్, APIలను అభివృద్ధి చేయడం, మెయింటెన్ చేయడం డేటా ఇంజనీర్ల బాధ్యత. వారు డేటా రిపోజిటరీలు, మౌలిక సదుపాయాలు, నిర్మాణాలను మేనేజ్ చేస్తారు. వారి జాబ్ హార్డ్‌వేర్‌ను నిర్మించడం, మెయింటైన్ చేయడం, అలాగే డేటా సైంటిస్ట్‌లు, నిర్వాహకులతో కలిసి పనిచేయడం.
ఎంటర్‌ప్రైజ్ డేటా ఆర్కిటెక్ట్
ఎంటర్‌ప్రైజ్ డేటా ఆర్కిటెక్ట్‌లు స్ట్రాటెజిక్ డేటా మేనేజ్‌మెంట్ సేవలను అందిస్తారు. డేటా క్వాలిటీ, యాక్సెసిబిలిటీ, సెక్యూరిటీని నిర్ధారిస్తారు. వారు డేటా మేనేజ్‌మెంట్ కోసం బ్లూప్రింట్‌లను సృష్టిస్తారు, డేటాబేస్ సామర్థ్యాన్ని నిర్ణయిస్తారు, డేటా సరైన వినియోగాన్ని నిర్ధారించడానికి డేటా ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటర్స్‌తో కొలాబరేట్ అవుతారు.
ఉద్యోగాలు .
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ / మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్
AI ఇంజనీర్లు స్పెసిఫిక్ టాస్క్‌ల కోసం AI మోడల్స్‌ను అభివృద్ధి చేయడానికి సిస్టమ్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యూమన్-సెంటర్డ్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఉపయోగిస్తారు. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు డెప్లాయ్‌మెంట్ కోసం ML-బేస్డ్ లేదా డీప్ లెర్నింగ్- బేస్డ్ మోడల్స్ అభివృద్ధి చేయడంపై దృష్టి పెడతారు. ఈ పాత్రలకు AI టెక్నిక్స్, రోబోటిక్స్, ఆటోమేషన్, MLలో ప్రావీణ్యం కీలకం.
బిజినెస్ అనలిస్ట్ / బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్లు
బిజినెస్ మోడల్స్‌ను అనలైజ్ చేయడం ద్వారా లాభాలను పెంచుకోవడం లేదా ఖర్చులను తగ్గించుకోవడంలో బిజినెస్ అనలిస్ట్‌లు ప్రత్యేకత కలిగి ఉంటారు. వారు సంస్థ వివిధ అంశాలలో సమస్యలను గుర్తించి పరిష్కారాలను అందిస్తారు. బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్‌లు వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి డాష్‌బోర్డ్‌లు, డేటా విజువలైజేషన్‌లు, రిపోర్ట్‌లతో సహా బిజినెస్ ఇంటర్‌ఫేస్‌లను సృష్టించడం, నిర్వహించడం వంటివి చేస్తారు.
డేటా అనలిస్ట్
రా డేటాను యాక్షనబుల్ ఇన్‌సైట్స్‌గా మార్చడంలో డేటా అనలిస్ట్‌లు కీలక పాత్ర పోషిస్తారు. వారు డెసిషన్ మేకర్‌కు ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయడానికి డేటాను డేటా అనలైజ్, విజువలైజ్ స్కిల్స్‌ను ఉపయోగిస్తారు. టెక్నికల్ స్కిల్స్, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు, పైథాన్, R ప్రోగ్రామింగ్, SQL, డేటా అనలిటిక్స్, డాష్‌బోర్డింగ్ వంటి టూల్స్‌లో స్కిల్స్ అవసరం. గత దశాబ్దంలో డేటా అనలిస్ట్‌ల డిమాండ్ ఏడు రెట్లు పెరిగింది.
డేటా సైంటిస్ట్
డేటా సైంటిస్ట్‌లు స్ట్రాటెజిక డెసిషన్ తీసుకోవడానికి సైంటిఫిక్ ఐడియాలు, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ టెక్నిక్స్ ఉపయోగిస్తారు. వారి నైపుణ్యం కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, అనలిటికల్ టెక్నిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉంది. డేటా సైంటిస్ట్ రోల్‌కి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి విభిన్న విభాగాల నుంచి తీసుకుంటారు. ప్రాసెస్‌లను ఆటోమేట్ చేయడం, డెప్లాయింగ్ మోడల్స్, డేటా సైన్స్ సొల్యూషన్‌ల కోసం క్లౌడ్ టెక్నాలజీలు, ML Opsతో పని చేయడం వంటి వాటికి బాధ్యత వహిస్తారు.
0 Response to "Data Science Job"
Post a Comment