Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 37 : Students Summer Holidays Activities

 Day - 37 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

 Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేస
వి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:37 Activities
Class: 1,2
37వ రోజు
ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Paint = వర్ణము, రంగు.

Mind = బుద్ధి,మెదడు.

Love =ప్రేమ.

Cause =కారణము.

Rain = వర్షము.

Exercise = ఆభ్యాసము.

Eggs = గుడ్లు.

Train = రైలుబండి.

Blue = నీలిరంగు.

Wish = ఆకాక్ష, కోరిక.

Drop = వదిలివేయు.

Developed = అభివృద్ధి చేయు.

Window =కిటికి.

Difference = భేదము.

Distance = దూరము.








💎నేటి ఆణిముత్యం

ఆపదలందు ధైర్యగుణ, మంచిత సంపదలందుఁ దాల్మియున్,
భూపసభాంతరాళమునఁ బుష్కలవాక్చతురత్వ, మాజి బా
హాపటుశక్తియున్, యశమునం దనురక్తియు, విద్యయందు వాం
ఛాపరివృద్ధియున్, బ్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్

భావము:

ఆపదలు వచ్చినప్పుడు ధైర్యం, ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్పు, సభల్లో వాక్పాటవం, యుద్ధంలో
శౌర్యం చూపడం, కీర్తిమీద ఆసక్తి, విద్య నేర్చుకోవాలనే కోరిక - ఇవి ఉత్తములకు సహజ గుణాలు.


🤘నేటి సుభాషితం

"భయమనేది ఓటమికి చిరునామా
పట్టుదల అనేది విజయానికి చిరునామా
భయపడిన వారిని విజయం వరించదు.
పట్టుదల ఉన్నవారిని ఓటమి భయపెట్టదు."


👬 నేటి చిన్నారి గీతం 

బహుమతి
                                                                              
పక్క వీధిలో బొచ్చుకుక్క
చిన్న పిల్లలు పెట్టింది
ముద్దు ముద్దు గున్నాయి
కుయ్యి కుయ్యి మన్నాయి
ఎగిరి ఎగిరి దుంకాయి
కాలు చేయి నాకాయి
వెంబడి వెంబడి తిరిగాయి
కాళ్ళకు అడ్డం పడ్డాయి
నల్లమచ్చల బుజ్జికుక్క
నాకు ఎంతో నచ్చింది
అమ్మను నాన్నను బతిమలాడితే
పుట్టిన రోజుకు తెచ్చి ఇచ్చారు
బహుమతి




🤠 నేటి సామెత 

అదును లేని పైరు - ముదిమిలోని బిడ్డ ఒక్కటే

అదనుకు అనగా సమయానికి పైరు వేయక పేతే సరైన ఫలితమివ్వదు. అలాగే ముసలి వయస్సులో పిల్లలు పుడుతే వారు తల్లి దండ్రులకు సేవ చేసే వయసులో వుండరు అని ఈ సామెతకు అర్థం.
🗣నేటి జాతీయం
రావణ కాష్టం
నిరంతరం మండుతూ, ఎప్పటికి ఆరిపోకుండా వుండే పగను వెల్లడి చేసే విషయాన్ని తెలిపేటప్పుడు ఈ  రావణ కాష్టం  నానుడిని వాడుతుంటారు. ఈ నానుడి  రామాయణ కథల నుండి వచ్చింది. చాలా కాలం నుండి  వైరం ఉంటూ, ఇంకా కొనసాగుతూనే ఉంటే  వారి మధ్య శత్రుత్వం రావణ కాష్టం లా కాలుతుంది అంటారన్న మాట.   భారతదేశంలో కాశ్మీర్ సమస్య రావణ కాష్టంలా కాలుతుంది. దీన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవొచ్చు.  అసలు ఈ నానుడి ఎలా వొచ్చిందో చూద్దాం.
       రాముడి చేతిలో రావణుడు మరణించాడు.  రావణుని భార్య మండోదరి. ఆమె మహా పతివ్రత. గుణవంతురాలు. రావణుడు చితిపైకి తీసుకుపోయే ముందు ఆమె రాముడు వద్దకు  వచ్చింది. తనకు వైధవ్యం లేకుండా చేయమని అడిగింది. ఈ వింత కోరికకు రాముడు ఆశ్చర్యపోయాడు. భర్త మరణించిన తరువాత భార్య వైధవ్యం పొందవలసిందే. మరి ఆమె అడిగిన కోరికను కాదనలేక పోయాడు రాముడు.  కోరిక తీర్చటం ఎలా? మరణించిన వారిని బతికించటం అసాధ్యం. 
      రాముడు బాగా ఆలోచించాడు. ప్రస్తుతం రావణుడు మరణించి మాత్రమే వున్నాడు. ఆయన దేహం ఇంకా దహనం కాలేదు. ఈ కాయం కాష్టంపై  పూర్తిగా దహనం అయితేనే ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది.  కాష్టం బుడిదిగా మారిన తరువాతనే ఆమె నుదుటిపై బొట్టు చెరిగిపోతుంది. అందువలన రాముడు ఆమె వైధవ్యాన్ని కాపాడటం కోసం కాష్టాన్ని కాలనివ్వకుండా చేసాడు. అది ఇప్పటికి ఇంకా కాలుతూనే ఉందట.  ఈ విధంగా రాముడు మండోదరికి వైధవ్యం లేకుండా చేసాడు.
     మొదలైన పగ ఎక్కడా ఆగకుండా  ధీర్ఘంగా కొనసాగుతూ ఉంటే రావణ
కాష్టం  అనడం   అప్పటి నుండి ఆనవాయితీ అయ్యింది.
 

✍️ నేటి కథ

ఆదర్శబాలుడు - వికాస్

ఒక ఊళ్లో వికాస్ అనే అబ్బాయి ఉన్నాడు. అతని వయస్సు ఎనిమిది సంవత్సరాలు. తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి మంచి మార్కులతో పాసయ్యాడు. వారి గ్రామంలో ఉన్నత పాఠశాల లేదు. వాళ్ళ నాన్న రామారావు అతడిని
పట్టణంలోని ఉన్నత పాఠశాలలో చేర్చాలను కున్నాడు.వేసవి సెలవుల తరువాత పాఠశాలలు
తెరిచారు. వికాస్ ను విద్యారణ్య ఉన్నత పాఠశాలలో చేర్చాలని తండ్రి రామారావు నిశ్చయించుకున్నాడు. ఆ పాఠశాల చాలా పేరు పొందినది. పట్నానికి బస్సులో బయలు దేరారు. పోను పోను ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. చాలా మంది నిలబడే ఉన్నారు. నిలబడిన వారిలో ఒక యాభై ఏళ్ళ ఆవిడ బస్సులో ఉసూరంటూ మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ నిలబడటానికి చాలా ఇబ్బంది పడుతోంది. వికాస్ ఆమెను చూశాడు. వెంటనే లేచి నిలబడి ఆమెని పిలిచి “ఇక్కడకు వచ్చి కూర్చోండి" అన్నాడు. ఆమె తటపటాయించింది.

పర్వాలేదు బాబూ, నువ్వు కూర్చో,నువ్వూ చిన్న పిల్లవాడివే కదా” అంది ఆవిడ.వికాస్ “లేదండీ, నిలబడి ప్రయాణించడం నాకేమీ కష్టం కాదు.” అని గట్టిగా అన్నాడు.ఆమె వచ్చి కూర్చుంది.వికాస్ వాళ్ళు దిగి, విద్యారణ్య పాఠశాల వైపు నడిచారు. వికాస్ వాళ్ళు ఆ పాఠశాలకి చేరుకుని, స్కూలు ఆఫీస్కు వెళ్ళారు. అక్కడ ఆఫీసులో గుమస్తాని సీటు అడగగా “ఆరవ తరగతిలో అడ్మిషన్లు పూర్తి అయ్యాయి. ఇక ఖాళీ లేదు. మీరు చాలా ఆలస్యంగా వచ్చారు” అని సమాధానం ఇచ్చాడు. రామారావు ఎంత బతిమాలినా గుమస్తా ఏమీ లాభం లేదన్నాడు. చేసేది ఏమీలేక నిరాశతో బయటకు వస్తున్నారు వికాస్, రామారావు. వరండాలో నడుస్తున్న వారికి ఇందాక బస్సులో కలిసినావిడ ఎదురు పడింది. ఆవిడ వారిని చూసి "ఏమిటీ? మీరిక్కడికి ఎందుకొచ్చారు?” అని అడిగింది.అప్పుడు రామారావు ఆవిడతో “నా పేరు రామారావు. వీడు మా అబ్బాయి వికాస్. వీడిని ఆరవ తరగతిలో చేర్చడానికి వచ్చాం.
ఆఫీసులో గుమస్తా ఆరవ తరగతిలో సీటు ఖాళీ లేదని చెప్పారు. హెడ్మాష్టర్ గారిని కలిసినా లాభం ఉండదని అన్నారు." అని బాధగా చెప్పాడు. ఇదంతా విని ఆమె “నాతో రండి” అని వాళ్ళని తన గదికి తీసుకెళ్ళింది. ఆవిడ గది ముందర హెడ్ మిస్ట్రెస్ అని బోర్డు కన్పించింది వికాస్ తండ్రికి,వాళ్ళను కూర్చోమని చెప్పి, ఒక జవానును పిలిచి “నీవు ఆఫీసుకు వెళ్ళి ఒక
అడ్మిషన్ ఫారం పట్టుకురా” అని పంపింది.జవాను తెచ్చాడు. దానిని వికాస్ తండ్రికి ఇచ్చి పూర్తి చెయ్యమన్నారు హెడ్మాస్ట్రెస్.వికాసికి ఐదవ తరగతిలో వచ్చిన మార్కులు తెలుసుకుని ఆవిడ వికాస్ని అభినందించింది.“ఆఫీస్ క్లర్క్ చెప్పింది నిజమే. సీట్లు ఖాళీ లేవు. అయినా హెడ్మాస్ట్రెస్ని కాబట్టి నా కోటాలో నేను ఇద్దరిని చేర్చుకునే వీలుంది. 
మీ అబ్బాయి వికాస్ చాలా మంచి నడవడిక కలవాడు. పెద్దల పట్ల గౌరవం,ఇంత చిన్న వయస్సులోనే అతడిలో ఉన్నాయి. అలాంటి వాడిని మా పాఠశాలలో చేర్చుకోవడం మాకూ ఆనందమే" అని వికాస్ కి ఆరవ తరగతిలో సీటిచ్చింది. వికాస్ మంచి ప్రవర్తనే అతనికి సీటు తెచ్చిపెట్టింది.

తెలుసు కుందాం

🛑బ్యాక్టీరియా, వైరస్‌ల మధ్య తేడా ఏమిటి? What is difference between Bacteria and Virus?
బ్యాక్టీరియా, వైరస్‌ల మధ్య ప్రధానమైన ఒక తేడా వాటి పరిమాణం. బ్యాక్టీరియా వ్యాసం ఒక మైక్రోమీటర్‌ (మిల్లీమీటర్‌లో వెయ్యో వంతు) ఉంటే, వాటి పొడవు 1 నుంచి 3 మైక్రోమీటర్లు ఉంటుంది. అదే ఒక వైరస్‌ పొడవు 0.02 నుంచి 0.3 మైక్రోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక బ్యాక్టీరియా స్వతంత్రంగా సంతానోత్పత్తి చేయగల సూక్ష్మజీవి. వైరస్‌ వాటి పునరుత్పత్తికి జీవమున్న వేరే కణాలపై ఆధారపడతాయి. వైరస్‌లలో ఒక రకమైన న్యూక్లియక్‌ యాసిడ్‌ మాత్రమే ఉండి, వాటి ప్రాజనిక రూపం (genotype) అయిన వాటి సంతతి డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ మాత్రమే కలిగి ఉంటుంది. బ్యాక్టీరియా డీఎన్‌ఏలో జన్యు సంబంధిత సమాచారం పూర్తిగా ఉండడమే కాక, ఇతర జీవ ప్రక్రియలను కొనసాగించడానికి కావలసిన అన్ని రకాల ఆర్‌ఎన్‌ఏను కలిగి ఉంటుంది. బ్యాక్టీరియాను ఎదుర్కోవడం సులభం. ఎందుకంటే వాటి జీవప్రక్రియ (metabolism)ను యాంటీబయోటిక్స్‌ మందులతో అంతమొందించి చంపవచ్చు. వైరస్‌ల ఉత్పత్తి వేరే కణాల జీవ ప్రక్రియపై ఆధారపడి ఉండడంతో, వాటిపై యాంటీబయోటిక్స్‌ పనిచేయవు. ప్రస్తుత కాలంలో వైరస్‌లను అంతమొందించడానికి ఏవో కొన్ని మందులను మాత్రమే కనిపెట్టగలిగారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 37 : Students Summer Holidays Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0