Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 39 : Students Summer Holidays Activities

 Day - 39 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

 Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేస
వి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:39 Activities
Class: 1,2
39వ రోజు
To develop imitating skills

Q) Imitate the sounds of birds and animals.

తెలుగు:

Q) కింది అక్షరాలకు ఐత్వం, ఔత్వం చేర్చి రాయండి. చదవండి.

క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, క్ష

English:

Learn and write ' T ' words.

Tiger        🐅

Train       🚂

Tongue   👅

Ten           🔟

Tree         🌲

Maths:

Q) Do the following Subtractions.

              5   6   7
           -  3   2   8
           ................
           ................


              4   9   3
           -  1   6   9 
           ................
           ................


              2   5   4
           -  1   2   6
           ................
           ................
ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Kept = ఉంచెను.

Interest = వడ్డీ, ఆసక్తి.

Arms = చేయి, ఆయుధము.

Brother =సోదరుడు.

Race = జాతి,పందెం.

Present = ప్రస్తుతము.

Beautiful =అందమైన.

Store = నిల్వయుండునది,అంగడి.

Job = పని.

Edge = అంచు.

Past =జరిగిపోయిన.

Sign =సంతకము, గుర్తు.

Record =వ్రాసిపెట్టు, భద్రపరచు.

Finished = పూర్తిచేసెను.

Discovered = కనిపెట్టెను.


3,4,5
39 వ రోజు 

Q) నక్క మరియు మేక కథను మీ సొంత మాటల్లో మీ నోటు పుస్తకం లో రాసి గ్రూప్ లో పోస్ట్ చేయండి.

Q ) Wrire the Story 'The  Fox And The Goat' in your own words in your note book and post in the group.
👇👇👇





💎నేటి ఆణిముత్యం

అవయవహీనుని, సౌంద
ర్యవిహీను, దరిద్రు,
విద్యరానియతని, సం
స్తవనీయు, దేవు,శ్రుతులన్
భువి నిందింపఁ దగదండ్రు బుధులు కుమారా |
భావము:

కుమారా! భూమిపైన అవయవలోపం ఉన్నవాళ్ళనూ,అందంగా లేనివాళ్ళనూ, పేదవాళ్ళనూ, నిరక్షరాస్యుణీ, గొప్పవాళ్ళనూ ,దైవాన్నీ, వేదాలనూ, నిందించగూడదని పెద్దలు చెబుతారు.

👬 నేటి చిన్నారి గీతం 

అందరమూ ఒకటే

అందరమూ ఒకటే- మనమందరమూ ఒకటే
మన మందిరమూ ఒకటే మన మందిరమూ ఒకటే

అందరి చరిత్ర ఒకటే
అందరి ప్రవర్తనొకటే!
భావిచరిత్ర వర్తనమంతా
ఒకటేనంటూ రాయుదుమింక  ।అందరమూ । 

మతములు వేరు మనుగడ ఒకటే
జాతులు వేరు నీతులు ఒకటే
మతములు జాతులు వేరుగనున్నా
భారతీయమది అందరిద    ।అందరమూ‌ । 

భాషలు వేరు! భావములొకటే
భాషలతల్లి! సంస్కృతమొకటే
భాష భావముల భేదములున్నా
భారత హృదయము అంతా ఒకటే  ।అందరమూ । 

విద్యలు ఒకటే! కళలు ఒకటే
వినోద విజ్ఞానమ్ములు ఒకటే* 
భిన్నత్వమ్మున ఏకత్వమ్మలె
వివిధ భారతి హృదయమ్మొక్కటే  ।అందరమూ ।


🤠 నేటి సామెత 

ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు

మతిమరుపు వారిని గురించి ఈ సామెత పయోగిస్తారు.

🤘నేటి సుభాషితం
ప్రయత్నం చేయడం నీ ధర్మం..
కానీ ఫలితం మాత్రం దైవ నిర్ణయం..!
పరిస్థితులు కాల నిర్ణయం..
ఎదుర్కోవడం నీ మనోధైర్యం..!

🗣నేటి జాతీయం
చించేశాడు

విజృంబించాడు అని అర్థం: ఉదా: సచిన్ ఈరోజు ఆటలో చించేశాడు. అటువంటి సందర్భంలో వాడే మాట ఇది.

✍️ నేటి కథ 

భలే తీర్పు
సిరిపురంలో ధర్మయ్య అనే ఆసామి వుండేవాడు అతను ధర్మరీతిన ప్రజల సమస్యలు తీరుస్తూ వారి లోటుపాట్లు సరిచెబుతూ జీవనం సాగిస్తుండేవాడు.
ఎంతటి క్లిష్ట సమస్యకైనా యిట్టే పరిష్కారం
చూపేవాడు. ఓసారి ఓ యిద్దరు మిత్రులు అయన వద్దకుకొచ్చారు. వారిలో మొదటి వాడు ధర్మయ్యతో
"అయ్యా ధర్మయ్యగారూ మీరే మా తగదా తీర్చాలి"అన్నాడు. "వాడి మాటకాదు ముందు మీరు నామాట వినండి" అన్నాడు రెండోవాడు.వారిద్దరి వంకా తేరిపార చూసిన ధర్మయ్య "మీలో మీరు వాదించుకోకుండా నాదగ్గర వున్నదున్నట్టు చెప్పండి మీ సమస్య ఏమిటో తేలుస్తానన్నాడు.
అది విన్న మొదటివాడు “అయ్యా ఈతనికి నేను పదివేల వరహాలు అప్పుగా యిచ్చాను కానీ యితగాడు తీసుకోలేదంటున్నాడు మీరే ఎలాగైనా నా ధనం నాకు యిప్పించాలి” అన్నాడు. అది విన్న రెండోవాడు “అయ్యా ధర్మయ్యగారూ
యితను చెప్పేది అబద్ధం. యితను నాకు అసలు ధనం యివ్వలేదు" అన్నాడు.అలా యిచ్చానని ఒకడు... యివ్వలేదని
మరొకడు వాదించుకుంటుండగా 'ఆగండాగండి' అని వారిని అడ్డుకున్నాడు ధర్మయ్య. "మీరు నా దగ్గరకు ఎందుకు వచ్చారు" అనడిగాడు.
ఆ మాటకు వారిద్దరూ ఒకరి మొఖాలొకరు
చూసుకుని "అదేమిటండీ మీరు చాలా తెలివైన వారనీ... ఏ విషయాన్ని అయినా ముఖాలు చూడగానే పసిగట్టి అసలు విషయం రాబట్టేస్తారని వూరంతా చెప్పుకుంటుండడం మాకు తెలియదనుకున్నారా ఏమిటి అందుకే మా గొడవ  తీర్చుకోవాలని వచ్చాం" అని చెప్పారు.ఆ మాటకు చిన్నగా నవ్విన ధర్మయ్య. "మరి అంత తెలివి తేటలు గల నాకు మీరిద్దరూ నన్ను పరీక్షించాలనే వచ్చారనీ అసలు మీలో మీరు ఎవరూ ఎవరికీ డబ్బు యిచ్చుకోలేదనీ ఎవరూ పుచ్చుకోలేదనీ నేను గ్రహించలేననుకున్నారా..” అనడిగాడు.
ఆ మాటకు బిత్తరపోయిన వారిద్దరూ “ఆహా
ధర్మయ్యగారూ మీ తెలివి అమోఘం. యింతకూ
మీరు ఈ విషయం ఎలా కనిపెట్టగలిగారో
సెలవిస్తారా” అనడిగారు ఆసక్తిగా అందుకు ధర్మయ్య "చూడండి బాబులూ!
ఎవరైనా డబ్బు పోగొట్టుకుంటే యింత నిదానంగా వివరించరు. పైగా పుచ్చుకోని వారు కూడా యింత ఓర్పుగా సమాదానం యివ్వరు డబ్బంటే ఎవరికైనా ఆశే.కష్టపడ్డ సొమ్ము అయితే మరీను, కానీ మీ
యిద్దరిలో నాటకీయత కన్పడింది కానీ
సహజసిద్ధంగా మీ ముఖాల్లో బీతి కన్పించలేదు”
అని వివరించాడు ధర్మయ్య. ధర్మయ్య నిశిత బుద్ధికి ఎంతగానో కొనియాడారు. మిత్రులిరువురూ.


తెలుసు కుందాం

శ్వాసక్రియలో నత్రజని మాటెత్తరేం?

గాలిలో ఆక్సిజన్‌ సుమారు 20 శాతం, నత్రజని సుమారు 80 శాతం ఉంటాయని పాఠాల్లో చదివాను. మరి మనం ఆక్సిజన్‌ పీల్చుకుని, కార్బన్‌డయాక్సైడు వదుల్తామని ఎందుకంటారు?

గాలిలో ఐదింట నాలుగు భాగాలు నత్రజని (Nitrogen) ఉంటుంది. మన శ్వాసక్రియ (respiration)లోని ఉచ్ఛ్వాస ప్రక్రియ (inhalation)లో గాలిలోని ఆక్సిజన్‌తో పాటు, నత్రజని కూడా వూపిరితిత్తుల్లోకి వెళ్తుంది. కానీ ఆక్సిజన్‌కు మాత్రమే రక్తంలోకి చొరబడే లక్షణం ఉంది. జడతత్వం ఉండే నత్రజని వెళ్లిన దారినే తిరిగి నిశ్వాసం (exhalation) ద్వారా బయటకి వచ్చేస్తుంది. అయినా మనం ఆక్సిజన్‌ తీసుకుని నత్రజని వదులుతామని అనకూడదు. వదలడం అంటే అర్థం శరీరంలో ఉత్పత్తి అయిన పదార్థాన్ని విసర్జించడంగా భావించాలి. మనం తీసుకునే ఆక్సిజన్‌ మన శరీరంలోని పోషక పదార్థాలను ఆక్సీకరణం చేసి శక్తితో పాటు నీటి ఆవిరి, కార్బన్‌డయాక్సైడుగా మారుస్తుంది. ఈ కార్బన్‌డయాక్సైడు శరీరంలో ఉంటే ఆమ్లత్వం(acidity) పెరిగి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడుతాయి. కాబట్టి దాన్ని వదిలేస్తాము. లోపలికి వెళ్లి అదే దారిలో వచ్చేసే నత్రజనిని మనం వదలము. అదే బయటకి వచ్చేస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 39 : Students Summer Holidays Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0