Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Distribution of educational gift in AP from June 12. Those who have failed 10 will have a chance to study again regularly

 Schools Reopening: జూన్ 12నుంచి ఏపీలో విద్యా కానుక పంపిణీ.. పది ఫెయిలైన వారికి మళ్లీ రెగ్యులర్‌గా చదివే ఛాన్స్.

Distribution of educational gift in AP from June 12. Those who have failed 10 will have a chance to study again regularly

ఏపీలో ఈనెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యాకానుక పంపిణీ చేయనున్నారు.

'జగనన్న విద్యాకానుకలో ఒక్కో కిట్‌కు రూ.2500లకు పైగా ఖర్చు అవుతుందని చెప్పారు. పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందనుంది. టెన్త్‌, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల పేరుతో​ ప్రోత్సహకాలు అందచేయనున్నట్లు మంత్రి బొత్స వివరించారు.

జూన్‌ 28వ తేదీన సీఎం జగన్‌ చేతుల మీదుగా అమ్మఒడి కార్యక్రమం జరుగనుందన్నారు. నాడు-నేడు మొదటి ఫేజ్‌లో పూర్తి అయిన పాఠశాలలకి డిజిటల్‌ విద్య అందిస్తామని, ఈనెల 12 నుంచి పాఠశాలల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ ప్రారంభిస్తామన్నారు.

6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలకు శిక్షణనిస్తామని, ప్రతీ మండలానికి రెండు జూనియర్‌ కళాశాలులు అందుబాటులోకి వస్తాయని, ఇందులో ఒక జూనియర్‌ కాలేజీ కేవలం విద్యార్థునులకి మాత్రమేనన్నారు.

పది ఫెయిలైన వారికి మళ్లీ చదివే అవకాశం.

పదో తరగతి, ఇంటర్మీడియట్లలో ఫెయిలైన విద్యార్థులు మరలా అదే తరగతిలో రెగ్యులర్‌గా చదువుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని విద్యాశాఖ బొత్స సత్యనారాయణ చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఫెయిలైన విద్యార్థులు మరలా అవే తరగతులు పాఠశాల, కళాశాలకు వచ్చి రెగ్యులర్‌ విద్యార్థులుగా చదువు కోవచ్చునని చెప్పారు. వీరికి ప్రభుత్వ పథకాలు కూడా అందుతాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయని, అదేరోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా క్రోసూరులోని ఆదర్శ పాఠశాలలో జగనన్న విద్యాకానుక కిట్లను ప్రారంభిస్తారని చెప్పారు.ఇప్పటికే 90 శాతం కిట్లు పాఠశాలలకు చేరుకున్నాయని వివరించారు.

రాష్ట్రంలో విద్యార్ధులకు అమ్మఒడి పథకాన్ని ఈ నెల 28న అందిస్తామన్నారు. అమ్మఒడి అర్హుల జాబితా ఈ నెల 12న గ్రామ, వార్డు, సచివాలయాల వద్ద ఉంటుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్‌ సురేష్‌కుమార్‌ వెల్లడించారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే ఈ నెల 22 వరకు తెలపవచ్చని పేర్కొన్నారు. హాజరు 75 శాతం ఉన్న విద్యార్థులే అర్హులని చెప్పారు. అభ్యంతరాలు పరిశీలించిన తరువాతే తుది జాబితా ప్రకటిస్తామన్నారు.

విద్యార్ధులకు సన్మానం..

జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం కింద పదో తరగతిలో పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది పెరిగిందని వివరించారు.

ఆణిముత్యాలు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 15న, జిల్లా స్థాయిలో 17న, రాష్ట్ర స్థాయిలో 20న నిర్వహించి, విద్యార్థులకు అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను అందిస్తామన్నారు. యూనిఫాం క్లాత్‌ గతంలో కంటే ఈ సారి 23 శాతం అదనంగా ఇస్తున్నామని, మొత్తం మూడు జతలకు సరిపడా అందిస్తామన్నారు. కుట్టుకూలి ఛార్జీలను జతకు రూ.35 నుంచి రూ.45కు పెంచామన్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Distribution of educational gift in AP from June 12. Those who have failed 10 will have a chance to study again regularly"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0