Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Have Aadhaar Card? This free service is for 8 days only.

Aadhaar Card: ఆధార్ కార్డ్ ఉందా? ఈ ఫ్రీ సర్వీస్ మరో 8 రోజులే.

Have Aadhaar Card? This free service is for 8 days only.

ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్. ఆధార్ కార్డ్ హోల్డర్స్‌కి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ మంచి అవకాశం ఇచ్చింది.

డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా ఆధార్ వివరాలు అప్‌డేట్ (Aadhaar Update) చేసే ఛాన్స్ ఇచ్చింది. జూన్ 14 వరకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఆధార్ కార్డ్ హోల్డర్స్ తమ వివరాలు అప్‌డేట్ చేయడానికి ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే. కొన్ని సేవలు మాత్రమే ఉచితంగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో పొందే సేవలకు కూడా సాధారణంగా డబ్బులు చెల్లించాలి. కానీ యూఐడీఏఐ ఆన్‌లైన్ అప్‌డేట్‌ను ఉచితంగా అందిస్తోంది. ఆధార్ కార్డ్ హోల్డర్స్ జూన్ 14 వరకు ఫ్రీగానే తమ వివరాలు అప్‌డేట్ చేయొచ్చు.

ఆధార్ కార్డ్ హోల్డర్స్ ఆన్‌లైన్‌లో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్ వివరాలను సొంతగానే అప్‌డేట్ చేయొచ్చు. ఈ వివరాల అప్‌డేట్ కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. గతంలో అయితే రూ.50 చెల్లించి ఆన్‌లైన్‌లో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్ వివరాలను అప్‌డేట్ చేసేవారు. కానీ యూఐడీఏఐ మూడు నెలలు ఉచిత సర్వీస్ ప్రకటించింది. ఫ్రీ సర్వీస్ జూన్ 14న ముగుస్తుంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయాలంటే రూ.50 ఛార్జీ చెల్లించాలి. మరి ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డ్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసే విధానం

  • Step 1- ఆన్‌లైన్‌లో మీ ఆధార్ వివరాలు అప్‍డేట్ చేయడానికి https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
  • Step 2- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
  • Step 3- Online Update Services పైన క్లిక్ చేయాలి.
  • Step 4- ఆ తర్వాత Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి.
  • Step 5- Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.
  • Step 6- పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
  • Step 7- మీ వివరాలు అప్‌డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
  • Step 8- పేమెంట్ అవసరం లేకుండా ప్రాసెస్ పూర్తి చేయాలి.

 ఈ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఎస్ఎంఎస్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. యూఆర్ఎన్ నెంబర్‌తో మీ ఆధార్ అప్‍డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక దశాబ్దం క్రితం ఆధార్ కార్డ్ తీసుకున్నవారు తమ ఆధార్ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ దశాబ్దకాలంలో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసినవారు మళ్లీ అప్‌డేట్ చేయాల్సిన అవసరం లేదు. తమ ఆధార్ కార్డులోని వివరాల్లో మార్పులు కావాలంటనే ఆధార్ అప్‌డేట్ చేయాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Have Aadhaar Card? This free service is for 8 days only."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0