Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IBPS RRB 2023 Notification

IBPS RRB నోటిఫికేషన్. 8,000 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.

IBPS RRB 2023 Notification

IBPS RRB 2023 Notification: 2023కు సంబంధించిన ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 8,000కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి.

మొత్తం పోస్టులు :  8,000

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (IBPS)’ ఏటా ‘రీజినల్‌ రూరల్‌ బ్యాంకు (RRB)ల్లో నియామకాలకు పరీక్ష నిర్వహిస్తుంటుంది. తాజాగా 2023కు సంబంధించిన నోటిఫికేషన్‌ను (IBPS RRB 2023 Notification) విడుదల చేసింది. మొత్తం 8,000కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిలో క్లర్క్‌, పీఓ, ఆఫీసర్స్‌ స్కేల్‌ II, III స్థాయి పోస్టులు ఉన్నాయి.

అర్హతలు:పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం:ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి (01.06.2023 నాటికి):

ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1983 - 31.05.2002 మధ్య జన్మించి ఉండాలి.

ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1991 - 31.05.2002 మధ్య జన్మించి ఉండాలి.

ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1993 - 31.05.2005 మధ్య జన్మించి ఉండాలి.

ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.06.1995 - 01.06.2005 మధ్య జన్మించి ఉండాలి.

నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు 3-8 సంవత్సరాలు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు, వితంతు-ఒంటరి మహిళలకు జనరల్/ఈడబ్ల్యూఎస్-35, ఓబీసీ-38, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తి్స్తుంది.

దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు:అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం:ప్రిలిమినరీ; మెయిన్ పరీక్షల ఆధారంగా.

పరీక్ష విధానం:

ముఖ్యమైన తేదీలు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఫీజు చెల్లింపు/ దరఖాస్తు సవరణ తేదీలు: 01.06.2023 నుంచి 21.06.2023 వరకు

ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌ కాల్‌ లెటర్ల డౌన్‌లోడ్‌: 10.07.2023

ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌(పీఈటీ) తేదీలు: 17.07.2023 నుంచి 22.07.2023 వరకు

ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌: ఆగస్టు, 2023

ప్రిలిమ్స్‌ ఫలితాల వెల్లడి: సెప్టెంబర్‌, 2023

మెయిన్స్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌: సెప్టెంబర్‌, 2023

మెయిల్స్‌ ఫలితాల వెల్లడి: అక్టోబర్‌ 2023

ఇంటర్వ్యూ నిర్వహణ: అక్టోబర్‌/నవంబర్‌, 2023

ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: జనవరి, 2024


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IBPS RRB 2023 Notification"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0