Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Memory Power Yoga

Memory Power Yoga: పిల్లల ఏకాగ్రత పెరగడానికి ప్రతిరోజు ఈ రెండు ఆసనాలు వేయించండి.. మెమరీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది!

Memory Power Yoga

ఆధునిక జీవనశైలి, కుటుంబంలో తగాదాల కారణంగా పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. దీని కారణంగా చాలామంది పిల్లల్లో ఏకాగ్రత నశిస్తోంది.

దీంతో పిల్లలు చదువుల్లో రాణించలేకపోతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే పిల్లల చేత తప్పకుండా చిన్నచిన్న యోగాసనాలను వేయించాలని నిపుణులు చెబుతున్నారు. క్యాట్ పోజ్ తో పాటు ట్రీపోజ్ వంటి సులభతర ఆసనాలను పిల్లల చేత వేయించడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా, మానసిక ప్రశాంతత పొందుతారని నిపుణులు పేర్కొన్నారు.

సూర్యాసనాల ప్రాముఖ్యత:
ప్రతిరోజు పిల్లలు సూర్యాసనాలు వేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ ఆసనాలను ఉదయం పూట వేయడం వల్ల పిల్లల ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా శరీరం ఫిట్ గా తయారవ్వడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రతిరోజు యోగాసనాలు వేసే పిల్లల్లో 80 శాతం ఏకాగ్రత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

బకాసన ఆసనం:
ఈ ఆసనాన్ని ఇంగ్లీషులో క్రోపోజ్ అంటారు. ఈ ఆసనాలు వేయడానికి ముందుగా యోగ మ్యాట్ పరుచుకొని దాని పైన వంగాల్సి ఉంటుంది. ఆ తర్వాత చేతులపై మొత్తం మీ బలాన్ని వినియోగించి.. కాళ్లతో సహా శరీరాన్ని పైనకి లేపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ శరీరం గాల్లో ఉండగానే మోకాళ్ళను చంకలోకి ఆనివ్వాల్సి ఉంటుంది. ఇలా ఆనిచ్చిన తర్వాత సుమారు ఐదు నుంచి పది సెకండ్ల పాటు ఉండాలి. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

శీర్షాసనం:
ఈ శీర్షాసనం వేయడం వల్ల కూడా పిల్లలు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనాన్ని వేయడానికి ముందుగా గోడ లేదా కుర్చీలు సపోర్టును తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆసనం వేసే క్రమంలో ముందుగా వజ్రాసనం స్థానంలో ఉండి.. ఆ తర్వాత గోడ సపోర్ట్ తీసుకుని, చేతులను కింద పెట్టి కాళ్లను నిటారుగా పైనకు లేపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ తల కింద చేతులు పెట్టి ఇలా పది సెకంన్ల పాటు ఉండాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలో రక్తప్రసరణ కూడా పెరుగుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Memory Power Yoga"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0