Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The first flower in the garden of space.. A wonderful picture released by NASA.

 అంతరిక్షం తోటలో పూసిన తొలిపువ్విది. నాసా విడుదల చేసిన అద్భుత చిత్రం.

The first flower in the garden of space.. A wonderful picture released by NASA.

అంతరిక్షం లో జీవనం కోసం మనిషి చేస్తున్నఅనేక పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా కొన్ని సార్లు కూరగాయలు పండించడం, మొక్కలు పెంచడం కోసం కూడా పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఇటీవలే టమోటాలను అంతరిక్షంలో సాగు చేసిన పరిశోధకులు తాజాగా అంతరిక్షంలో కక్ష్యలో పెరిగిన జిన్నియా అనే పుష్పాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు పరిశోధకులు. నాసా విడుదల చేసిన ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే నాలుగు లక్షలకు పైగా లైకులు, షేర్లు, వేలలో కామెంట్లతో దూసుకుపోతోంది.

శాస్త్రవేత్తలు 1970ల నుంచి అంతరిక్షంలో మొక్కలు పెంచడంపై పరిశోధనలు చేస్తున్నారు. కానీ వ్యోమగామి కెజెల్ లిండ్‌గ్రెన్ 2015లో ఒక నిర్దిష్ట ప్రయోగంలో పాల్గొన్నారు. అలాగే, అంతరిక్ష ఉద్యానవనం ప్రదర్శన కోసం కాదని, అంతరిక్షంలో వాతావరణ పరిస్థితుల గురించి అర్ధం చేసుకోవడానికి అని నాసాకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమిపై పండే పంటలు వాతవరణం లో ఎలా పెరుగుతాయో అధ్యయనం చేయడానికి అని చెప్పారు.

అయితే, అంతరిక్షంలో కూడా పంటలు పండించేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతరిక్ష్యంలో పాలకూర, టమోటాలు, చిలీ పెప్పర్‌లాంటి ఆకుకూరలు, కూరగాయలను పండిస్తున్నారు శాస్త్రవేత్తలు. వీటితో పాటు మరిన్నీ రకాల కూరగాయల పెంపకం రానున్న రోజులలో చేపట్టనున్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The first flower in the garden of space.. A wonderful picture released by NASA."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0